ప్రేమజంటపై దాడి, ప్రియురాలిపై అత్యాచారం
posted on Oct 4, 2012 @ 4:26PM
చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం కైగల్ జలపాతం వద్ద గుర్తు తెలియని దుండగులు ఓ ప్రేమజంటపై దాడి చేశారు. ప్రియురాలిపై అత్యాచారం చేసిన దుండగులు ప్రేమికుడు అడ్డురావడంతో అతనిపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ప్రేమికుడికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం ప్రేమికులు ఇద్దరు కైగల్ జలపాతం వద్దకు రావడంతో గుర్తు తెలియని నలుగురు యువకుడి పై దాడి చేసి, అనంతరం వారు యువతిపై అత్యాచారం చేశారు. బాధితుల అరవటంతో చుట్టుపక్కల వారు ఘటన స్థలానికి వచ్చారు. వారు వచ్చేసరికి నలుగురు యువకులు అక్కడి నుండి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ వారిని స్థానికులు చికిత్స కోసం వి.కోట ఆసుపత్రికి తరలించారు. బాధితులు కర్నాటక రాష్ట్రంలోని బంగారుపేటకు చెందిన రంజిత, మునిరాజులుగా ఆ ప్రేమికులను గుర్తించినట్లుగా తెలుస్తోంది.