చంద్రబాబు పాదయాత్రలో జూ.ఎన్టీఆర్
posted on Oct 4, 2012 @ 2:27PM
చంద్రబాబు చేస్తున్న వస్తున్నా మీ కోసం పాదయాత్రలో జూ.ఎన్టీఆర్ పాల్గొననున్నారు. మళ్ళీ అన్న గారి కుటుంబం కలుస్తుండటంతోపార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తోంది. హరికృష్ణ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో అన్ని విభేదాలు పక్కన పెట్టి యాత్ర ప్రారంభంలో మొత్తం తానై వ్యవహరించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇంకా దూరమే అని అందరూ భావించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కూడా చంద్రబాబు నాయుడుకు దగ్గరవుతున్నారు. చంద్రబాబు చేపట్టిన 117 రోజుల వస్తున్నా మీకోసం పాదయాత్రలో జూనియర్ పాల్గొననున్నారు. బాబు యాత్ర అనంతపురం, కర్నూలు జిల్లాల తర్వాత మహబూబ్‌నగర్‌లో ఉంటుంది. ఇక్కడకు రాగానే జూనియర్ ఎన్టీఆర్ బాబు యాత్రలో పాల్గొని పార్టీకి అండగా ఉన్నానని, పార్టీతోనే ఉన్నానని కార్యకర్తలలో ఉత్తేజాన్ని నింపనున్నారు. నందమూరి, నారా కుటుంబాలు విభేదాలు పక్కన పెట్టి కలిసి నడిస్తే టిడిపి కార్యకర్తలకు పండగే అని చెప్పవచ్చు.