ప్రముఖ గాయని ఆశాభోంస్లే కుమార్తె మృతి
posted on Oct 8, 2012 @ 5:58PM
ప్రముఖ గాయని ఆశాభోంస్లే కుమార్తె వర్షా భోంస్లే సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. 56 సంవత్సరాల వయసున్న వర్షా భోంస్లే ముంబైలోని తన నివాసంతో లైసెన్స్‌డ్ తుపాకీతో కాల్చుకుని చనిపోయింది. ఆరోగ్య సమస్యల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. 2008లో ఒకసారి వర్షా భోంస్లే ఆత్మహత్యకు పాల్పడి తృటిలో ప్రాణాలతో బయటపడింది. వర్షా భోంస్లే ఫ్రీ లాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఆమె గాయని కూడా. వర్షా భోంస్లే మృతితో బాలివుడ్ విషాదంలో మునిగిపోయింది. ప్రస్తుతం ఆమె తల్లి ఆశాభోంస్లే మరాఠి కల్చర్ అవార్డు కార్యక్రమంలో పాల్గొనేందుకై సింగపూర్ వెళ్లారు.