శాసనసభ నిరవధిక వాయిదా
posted on Sep 22, 2012 @ 5:03PM
శాసనసభ వర్షాకాల సమావేశాలు తొలి రోజు నుంచి చివరి రోజువరకు వాయిదాలతో ముగిశాయి. శాసనసభ సమావేశాల్లో ఏ ఒక్క సమస్యపై కూడా చర్చలు జరగలేదు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ఆఖరి రోజు కూడా అదే పరిస్థితి నెలకొంది. శనివారం ఉదయం సభ ప్రారంభమైన పది నిమిషాలకే వాయిదా పడింది. వివిధ పార్టీలు పలు అంశాలపై ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. టీఆర్ఎస్ సభ్యులు స్పీకర్‌పోడియం వద్ద దూసుకెళ్లి ఫ్లకార్టులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి విద్యుత్‌పై చర్చకు స్పీకర్ అనుమతించినప్పటికీ సభ్యుల్లో మార్పు లేకపోవడంతో సభను మరో గంటపాటు వాయిదా పడింది. సభ వాయిదా అనంతరం టీఆర్ఎస్ నేతలు స్పీకర్ పోడియం వద్ద నిరసన కొనసాగిస్తున్నారు. నరసనలు సద్దుమణగకపోవడంతో సభను నివధికంగా వాయిదా వేశారు. అయితే రైతు సమస్యలపై చర్చ చేపట్టనందుకు తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ శాసనసభలో ఉరితాడు ప్రదర్శించి నరసన తెలిపారు.