కాంగ్రెస్ మంత్రులు రాజీనామా
posted on Sep 22, 2012 @ 5:14PM
కేంద్రంలోని యుపీఏ ప్రభుత్వానికి తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌లోని మమతా సర్కార్ నుంచి వైదొలగాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తృణమూల్ సర్కార్‌లోని ఆరుగురు మంత్రులు శనివారం తమ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను ఈ సాయంత్రం మమతా బెనర్జీకి ఇవ్వనున్నట్లు పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ప్రదీప్ భట్టాచార్య తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మమతా అపాయింట్ కోరినట్లు పేర్కొన్నారు. అయితే 294 మంది సభ్యులున్న అసెంబ్లీలో తృణమూల్ కాంగ్రెస్‌కు 185 మంది ఎమ్మెల్యేల పూర్తి మెజారిటీ ఉంది. 42 మంది సభ్యులు ఉన్న కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకున్నప్పటికీ మమత సర్కార్‌కు ఎలాంటి ఢోకా లేదు.