ఆర్థిక సమ్మేళనంలో ప్రధానికి చేదు అనుభవం
posted on Sep 22, 2012 @ 2:26PM
ప్రధాని మన్మోహన్ సింగ్ కి శనివారం చేదు అనుభవం ఎదురైంది. అంతర్జాతీయ ఆర్థిక సమ్మేళనంలో ప్రధాని ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి చొక్కా విప్పి నిరసన వ్యక్తం చేశాడు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకొని, న్యాయవాదిగా గుర్తించారు. చిల్లర వర్తంలోకి ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆ వ్యక్తి నిరసనకు దిగినట్లు తెలుస్తోంది. ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చొక్కా విప్పి నిరసన తెలిపిన 33 ఏళ్ల సంతోష్ కుమార్ సుమన్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా పేరును నమోదు చేసుకున్నాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న ప్రత్యేక రక్షణ దళానికి చెందిన గార్డులు తుగ్లక్ రోడ్డులోని పోలీసు స్టేషన్‌లో ప్రశ్నించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అందరిపై ఉందని ఆయన అన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అన్నారు. ఆర్థిక సంస్కరణలపై సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు.