విష జ్వరాలతో వణుకుతున్న ఏజెన్సీలు
posted on Oct 18, 2012 @ 10:06AM
రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలన్నీ జ్వరాలతో వణుకుతున్నాయి. ఈ ఏజెన్సీప్రాంత గిరిజనుల ఆరోగ్య సేవ కోసం నియమించిన సిబ్బంది మాత్రం అరకొరసేవలు మాత్రమే చేస్తున్నారు. అసలు ఈ జ్వరాలు ఎందువల్ల వచ్చిందో గుర్తించటానికి చేసే పరీక్షలతోనే సిబ్బంది కాలక్షేపం చేస్తున్నారు. వ్యాధిని నిర్ధారించే అవకాశమే తమకు లేనట్లు వ్యవహరిస్తున్నారు. అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ర్యాపిడ్‌టెస్ట్‌ల్లో అసలు జ్వరం దేని వల్ల వచ్చిందో తెలుసుకునేందుకు వైద్యులు ప్రయత్నించారు. ఈలోపు జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ఏదో ఒక విధంగా ఈ జ్వరాల నుంచి గిరిజనులను రక్షించేందుకు కనీసం ఆహారభద్రత పాటించినా కొంత వరకూ మేలు జరిగేదని సీనియర్ వైద్యులంటున్నారు. విషయం తేలేటప్పటికి మృతి చెందేంత దారుణమైన పరిస్థితులు ఎదురవకుండా స్పందించాలని వారు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య సిబ్బంది తమ ఉద్యోగ ప్రాంతంలోనే నివశించకపోవటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిరదని కొందరు ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ, ఖమ్మం, అదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితిపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.