విమర్శల పాలౌతున్న తెలంగాణ ఐకాస
posted on Oct 18, 2012 @ 10:05AM
తెలంగాణా ప్రత్యేకరాష్ట్ర డిమాండుతో వెలుగులోకి వచ్చిన ఐకాస(ఐక్యకార్యచరణ సమితి) రెచ్చిపోతోంది. తెలంగాణాకు సంపూర్ణ మద్దతు ప్రకటించలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దిష్టిబమ్మ దగ్దం చేయబోయింది. దీన్ని ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి అడ్డుకున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఐకాస కార్యకర్తలు ఎమ్మెల్యే వర్గీయులపై దాడి చేశారు. వారు కూడా ఎదురుతిరగడంతో కొంత సేపు మహబూబ్‌నగర్‌జిల్లా మల్టకల్‌లో ఉద్రిక్తవాతావరణం చోటు చేసుకుంది. వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగి వివాదం తారాస్థాయికి చేరుతుందని అందరూ ఆందోళన చెందే సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రెండు గ్రూపులను తిప్పిపంపించారు. ఐకాస ఇటీవల తెలంగాణామార్చ్ తరువాత తమ బలం పెరిగిందని విర్రవీగుతోంది. ప్రత్యేకించి దాడులకు కూడా సిద్ధమవుతోంది. సమైక్యాంధ్రావాదులంటే ఐకాస కయ్యానికి కాలుదువ్వుతోందని ఇటీవల పలుసంఘటనలు నిరూపిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణా ప్రాంతంలో ఐకాస బెదిరింపులకు కూడా సిద్ధమవుతోంది. తాజాగా తెలుగుదేశం, ఐకాస మధ్య తలెత్తిన ఈ విభేదంలో తప్పుపట్టాలంటే ఐకాసను అందరూ వేలెత్తిచూపుతున్నారు.