ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతల స్వీకారం
posted on May 31, 2024 @ 2:23PM
ప్రింటింగ్, స్టేషనరీ డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం సాయంత్రమే ఆయన పదవీ విరమణ చేయనున్నారు. బాధ్యతల స్వీకారం సందర్బంగా వెంకటేశ్వరరావు మాట్లాడారు. ‘‘రెండు సంవత్సరాల తరువాత ఇదే ఆఫీసులో ఛార్జ్ తీసుకుంటున్నా. నాకు అభినందనలు తెలిపేందుకు వచ్విన వారికి కృతజ్ఞతలు. ఈరోజే నేను పదవీ విరమణ చేస్తాను. పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్న రోజే పదవీ విరమణ చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చిందని అనుకుంటున్నాను. కారణాలు ఏమైనా ‘ఆల్ ఈజ్ వెల్’ అని భావిస్తున్నా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను. ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయడం సముచితం కాదు. ఇప్పటికి ఇంతవరకు మాత్రమే మాట్లాడాలి. ఇంతకాలం నాకు అండగా ఉండి ధైర్యం చెప్పిన మిత్రులు, శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటాను. నా కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు . యూనిఫాంతో రిటైర్డ్ అవ్వాలనే నా కల నెరవేరినట్లుగా భావిస్తున్నా’’ అన్నారు.