ప్రపంచంలో అత్యంత ప్రమాదకర 7 వీధులు
posted on Dec 5, 2020 @ 9:30AM
ప్రపంచంలో అందమైన నగరాలను చూశాం. అద్భుతమైన సముద్రతీరాలను తిలకించాం.ఎత్తైన భవనాలను, విలాసవంతమైన హోటల్స్ ఇలా అనేక అంశాలను మనం తెలుసుకుంటున్నాం. అయితే కొన్ని దేశాల్లోని వీధుల్లో అడుగు పెట్టాలంటే భయంతో వణికే పరిస్థితి ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో భద్రత లోపించడం ఇందుకు ప్రధానకారణం. మరి అంత భయంకరమైన వీధులు ఎక్కడ ఉన్నాయో.. అవి ఎందుకు సురక్షితం కాదో మనం తెలుసుకుందాం..
1. కాటియా, కారకాస్, వెనిజులా( catia,caracas, venezuela)
ఈ వీధి అత్యంత ప్రమాదకరమైన వీధిగా పేరుగాంచింది. ఈ నగరంలో సురక్షితం కాని ప్రాంతాల్లో ఇది ఒకటి. 2016 లో ఈ నగరంలో మర్డర్ రేటు చాలా భయానకంగా ఉందేది. అది రోజురోజుకూ పెరిగింది. ప్రస్తుత రాజకీయ వాతావరణం కారణంగా ఈ నగరాన్ని సందర్శించకపోవడమే మంచిది. ఇక్కడ జరిగే నేరాలు స్థానిక ప్రజలనే కాదు పర్యాటకులను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వెనిజులా ఎలాంటి వాతావరణం, ప్రజల పరిస్థితి ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
2. రెనాసిమింటో, అకాపుల్కో, మెక్సి కో(renacimiento, acapulco, mexico)
పాత హాలీవుడ్ చలనచిత్రాల్లో కనిపించే ఆకర్షణీయమైన బీచ్ పట్టణం ఇది. అయితే ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. ఇది మెక్సికోలో అత్యంత హింసాత్మక నగరంగా మారింది. ఇక్కడ కొన్ని వీధుల్లో జరుగుతున్న హత్యలు ఇక్కడ ఉన్న నేరపరిస్థితులను స్పష్టం చేస్తున్నాయి. గత రెండు దశాబ్దాలలో అత్యంత ఘోరమైన నేరాలు 2017 సంవత్సరం జూన్ నెలలో జరిగాయి. ఇక్కడ గ్యాంగ్ లదే పైచేయిగా మారింది. అంతేకాదు ఈ నగరంలో నివసించే ప్రతి ఒక్కరూ వారి వారపు
జీతంలో కొంత భాగాన్ని రౌడీ మాములుగా చెల్లించడానికి క్యూలో నిలబడాలి. ఇది ఇక్కడి ప్రజల దుస్థితికి అద్దం పడుతుంది. అక్రమ పదార్థ రవాణా, గ్యాంగ్ ల మధ్య వార్ ల కారణంగా ఇక్కడ అనునిత్యం హింసాత్మక వాతావరణం
ఉంటుంది.
3. ఫోర్టాలెజా, సీరా, బ్రెజిల్ (fortaleza, ceara, Brazil)
ముఠాల మధ్య వివాదం కారణంగా మే నెల 2018 లో ఒక నైట్‌క్లబ్ లో జరిగిన కాల్పుల్లో 14 మంది మరణించారు. ఈ నగరంలో నేరాల రేటు పెరగడానికి ముఠాల మధ్య గొడవలే ప్రధాన కారణంగా మారాయి. ఇక్కడ అనేక ప్రాంతాల నేరాలకు
చిరునామాగా కనిపిస్తాయి. అనేక నగరాలు ఇక్కడ సురక్షితం కావు. ముఖ్యంగా చీకటి పడ్డాక బయటకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే. బీచ్ ప్రాంతం చుట్టూ ఉన్న వీధుల్లో నేరాల సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది. అనుక్షణం జాగ్రత్తగా ఉంటూ నేరాల నుంచి తప్పించుకోవలసిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి.
4. సాన్ పెడ్రో సులా, కోర్టెస్, హోండురాస్ (SAN pedro Sula, cortes, Honduras)
చాలా భయంకరమైన ఈ నగరంలో వీధుల చుట్టూ చనిపోయిన మృతదేహాలను చూడటం చాలా సాధారణంగా కనిపిస్తుంది. వాటిని చూసి మీరు ఆశ్చర్యపోవచ్చు. ఇది దక్షిణ అమెరికా లోని అత్యంత భయంకరమైన నగరాల్లో ఒకటి అని చెప్పవచ్చు. ఇక్కడి ఆర్థిక వ్యవస్థ నేరాలకు కారణం అవుతుంది. రహదారులు, వీధుల్లో భద్రత ఉండదు. ప్రశాంతమైన ప్రజాజీవనానికి విఘాతం కలిగిస్తున్న ఈ ప్రాంతం లోో నేరాలను అదుపు చేయడానికి వివిధ సంస్థలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఇవి నెమ్మదిగా ఈ నగరాన్ని సురక్షితంగా ఉంచడానికి దోహదం చేస్తున్నాయి. ఈ
ప్రయత్నాలు త్వరగా ఫలించి ఈ నగరం నేరాల జాబితా నుంచి త్వరగా బయటపడుతుందని ఆశిద్దాం.
5. శాన్ సాల్వడార్, ఎల్ సాల్వడార్ (san salvador, El salvador)
ఈ నగరం హత్యలకు మారుపేరుగా నిలిచింది. 2016 లో ప్రతి 1,00,000 మందికి సగటున 83.39శాతం హత్యలు ఇక్కడ జరిగాయి. దురదృష్టవశాత్తు ఇక్కడ యునైటెడ్ స్టేట్స్‌లో ఎంఎస్ -13 అనే ముఠా కార్యకలాపాలు లోతుగా పాతుకుపోయాయి. ఈ ముఠాను అమెరికాలో సాల్వడార్ వలసదారుల పిల్లలు ప్రారంభించారు. అనేక నేరాలతో సంబంధాలు కలిగి ఉండే ఈ ముఠాలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. చాలా వీధులు నేరాలకు నిలయాలు.
6. కేప్ టౌన్, దక్షిణ ఆఫ్రికా (cape town, south africa)
పోలీసుల లెక్కల ప్రకారం ఈ ప్రదేశం 2016-2017 సంవత్సరానికి దక్షిణ ఆఫ్రికాలోనే అత్యధిక నేరాలు జరిగిన ప్రాంతం. అయితే ఈ నగరం ఇతర నగరాల మాదిరిగా కాకుండా అత్యంత సుందరమైన, అద్భుతమైన నగరం కావడంతో సందర్శకులు
వస్తుంటారు. నగరం ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ నేరాలు ఎక్కువగా జరగడంతో సందర్శకుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. నగరం వాస్తవిక పరిస్థితి తెలిసిన వారెవ్వరూ ఈ నగరంలోని అద్భుతాలను చూసేందుకు ఆసక్తి చూపించరు. ఇక్కడ ఉండటం అనేది చాలా ప్రమాదకరం. ముఖ్యంగా రాత్రివేళ వీధుల్లో తిరగడం, ఈ నగరంలో బస చేయడం అనేది ఎంతమాత్రం సురక్షితం కాదు.
7. ఈస్ట్ సెయింట్ లూయిస్, సెయింట్ క్లెయిర్ కౌంటీ, ఇల్లినాయిస్ (East
saint louis, St clair county, illinois)
ఇది అమెరికాలో ఉన్న చెత్త నగరంగా పేరుగాంచింది. ఈ ప్రదేశం వీధులు పేదరికం, నేరాలతో నిండి ఉంటాయి. ఇక్కడ 2013లో తలసరి హత్య రేటు అమెరికా జాతీయ సగటు కంటే 18 శాతం ఎక్కువ. 19 హత్య లు, 42 అత్యాచార కేసులు, 146 దోపిడీ కేసులు, 682 తీవ్ర దాడి కేసులు, 12 కాల్పుల కేసులు 2015 లో నమోదయ్యాయి. అప్పుడు జనాభా కేవలం 26,616 మాత్రమే. ఈ నగరం 2016లో మొత్తం దేశంలోనే అత్యధిక హత్య రేటును కలిగి ఉంది. ఇది మరింత ప్రమాదకరమైన నగరంగా గుర్తింపు పొందింది. ఇక్కడ నేరాల సంఖ్య పెరుగుతునే ఉంది. పేదరికం నేరాలకు పెరగడానికి మరోకారణం. సో.. ఇవి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వీధులు, నగరాలు. కొత్త ప్రదేశానికి వెళ్లేముందు ఆ ప్రాంతం గురించి తెలుసుకోవడానికి ఇలాంటి సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది.