ప్రభుత్వ పనితీరుకు పట్టం కట్టిన పంచయతీ ఫలితాలు.. సీఎం రేవంత్
Publish Date:Dec 18, 2025
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మంత్రులతో కలిసి గురువారం (డిసెంబర్ 17) మీడియాతో మాట్లాడిన ఆఈయన ఈ రెండేళ్లలో తమ ప్రభుత్వ పని తీరుకు పంచాయతీ ఎన్నికలు రిఫరెండంగా ఆయన అభివర్ణించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు. మొత్తం 12 వేల 702 పంచాయతీల్లో 7 వేల 527 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ విజయం సాధించిందనీ, అంటే 66శాతం స్ట్రైక్ రేట్ సాధించిందనీ చెప్పిన రేవంత్, బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కైపోటీ చేశాయనీ, అయినా కూడా రెండు పార్టీలూ కలిపి 33 శాతం పంచాయతీల్లోనే గెలిచాయని రేవంత్ అన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో 808 మంది కాంగ్రెస్ రెబల్స్ గెలిచారన్న రేవంత్ రెడ్డి వారిని కూడా కలుపుకుంటే కాంగ్రెస్ మొత్తం 8 వేల 335 పంచాయతీలలో జెండా పాతిందన్నారు. ఈ ఫలితాలను బట్టి చూస్తే.. ఎన్నికలు జరిగిన 94 అసెంబ్లీ సెగ్మెంట్లలో 87 సెగ్మెంట్లలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత కనబరిచిందన్నారు. అంటే 2028 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మూడింట రెండు వంతుల మెజారిటీతో అధికారంలోకి వస్తామని స్పష్టమౌతోందన్నారు. 2028 ఎన్నికలలో రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ తీసేయగలరా?!
Publish Date:Dec 18, 2025
తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. జగన్ పై చంద్రబాబు విజయం!?
Publish Date:Dec 18, 2025
సీఎం చంద్రబాబు హస్తిన పర్యటన ఎందుకంటే?
Publish Date:Dec 18, 2025
పార్లమెంటు ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల నిరసన
Publish Date:Dec 18, 2025
బ్యాలెట్ బీజేపీకి కలిసిరాదా?
Publish Date:Dec 18, 2025
తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లున్న బీజేపీకి కనీసం 800 పంచాయితీలు కూడా ఎందుకు గెలవలేక పోయింది? ఇదీ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్, సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న చర్చ. బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత భయమనీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోందనీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్రధాని కాగలిగారంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు. కాంగ్రెస్, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం దేశం కోసం కాకుండా, మోడీ కోసం పని చేస్తోందా అన్న సందేహాలనూ వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో మూడు విడతలుగా జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్- 7, 093 పంచాయితీలను కైవసం చేసుకోగా, బీఆర్ఎస్- 3488, బీజేపీ- 699, సీపీఐ- 79, సీపీఎం- 75, ఇతరులు- 1264 పంచాయితీలను గెలిచాయి.
ఈ లెక్కన చూస్తే బీజేపీ 10 స్ట్రైక్ రేట్ కనీసం పది శాతం కూడా లేదని తేటతెల్లమౌతోంది. మరి ఇదే బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలలో ఎలా గెలవగలిగింది అని ప్రశ్నిస్తున్నారు.
బీజేపీకి ఎనిమిది ఎంపీ సీట్లు అంటే ఇట్స్ నాటే జోక్. కారణం ఇక్కడున్నవే 17 సీట్లు. వీటిలో 8 గెలవడం అంటే సగానికి సగం.. గెలవడంతో సమానం. అలాంటిది పది శాతం పంచాయితీలు కూడా ఎందుకు రాలేదని అడిగే వారికి తెలియాల్సింది ఏంటంటే.. బీజేపీని ఓటర్లు ఎంపిక చేయడంలో అర్ధం.. ప్రెజంట్ సిట్యువేషన్ ప్రకారం.. ఈ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఇక్కడి నుంచి ఎంపీలను పంపిస్తే.. వారు రాష్ట్రానికి ఏదైనా సాదించి తీస్కొస్తారని. ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి అన్నది అటుంచితే.. ఓటర్ల అభిమతం అయితే అదీ.
ఇక కాంగ్రెస్ కూడా బీజేపీకి మల్లే జాతీయ పార్టీ. మరి ఆ పార్టీకి ఏడు వేల పైచిలుకు పంచాయితీలు రావడానికి గల కారణాలేంటి? అని చూస్తే రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఆ పార్టీకి ఈ స్థాయిలో సీట్లు రావడం తరతరాలుగా జరుగుతూ వస్తున్నదే. ఇందులో ఎలాంటి విచిత్రం ఏమీ లేదు. గతంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు కూడా ఇక్కడా పార్టీ సరిగ్గా ఇలాంటి ఫలితాలనే చవి చూసింది. బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడే వరకూ కూడా ఒకటీ అరా తప్పించి.. అన్ని రకాల ఎన్నికల్లోనూ విజయ ఢంకా మోగిస్తూనే వచ్చింది.
కేరళలోని ట్రివేండ్రం లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. ఈ కార్పొరేషన్లో అధికారం చేపట్టింది. ఇన్నాళ్ల పాటు ఇక్కడ హిందుత్వం గానీ ఆర్ఎస్ఎస్ వాదులకుగానీ పెద్ద గొప్ప ఆస్కారముండేది కాదు. ఆదరణ లభించేది కాదు. పైపెచ్చు కమ్యూనిస్టుల చేతుల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యాకాండ సైతం నడిచేది. ఇక్కడ కమ్యూనిస్టులదే రాజ్యం. కానీ ఇప్పుడక్కడ సురేష్ గోపీ రూపంలో ఒక ఎంపీ గెలవడం మాత్రమే కాకుండా.. స్థానికంగానూ సత్తా చాటింది బీజేపీ. అక్కడా బ్యాలెట్ ఓటింగే జరిగి ఉంటుంది. మరి అక్కడి గెలుపును వీరంతా ఎందుకు ఒక ప్రామాణికంగా తీస్కోరు? అన్న ప్రశ్న వినిపిస్తోంది.
నిజంగా కాంగ్రెస్ చెప్పినట్టు ఓట్ చోరీయే జరిగి ఉంటే, సర్ రూపంలో లక్షలాది ఓట్లు పోయి ఉన్న మాట నిజమైతే.. ప్రజలు ఈ ప్రచారాన్ని ఓటర్లు ఎందుకు నమ్మడం లేదు? అన్నదొక ప్రశ్న. రాహుల్ మీడియా ప్రెజంటేషన్లు ఇచ్చి.. ఇంత నెత్తీ నోరు బాదుకున్నా.. జనం నమ్మలేదంటే దాన్నెలా అర్ధం చేసుకోవాలి? ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇదే బ్యాలెట్ల రూపంలోనే ఇక్కడ తక్కువ వచ్చిన బీజేపీ, కేరళలో విజయ ఢంకా మోగించినదాన్ని ఎందుకు మరుస్తున్నారు? అన్నది కూడా మనమంతా పరిశీలించాల్సి ఉందంటారు విశ్లేషకులు.
రేవంత్ రెండేళ్ల పాలనకు పాస్ మార్కులే!
Publish Date:Dec 16, 2025
తెలంగాణ భవన్ కు కేసీఆర్.. పంచాయతీ ఫలితాల ప్రభావమేనా?
Publish Date:Dec 15, 2025
కమలానికి కిషన్ మార్క్.. చీడ పట్టిందా?
Publish Date:Dec 13, 2025
గ్లోబంత సంబురం.. పెట్టుబడుల స్వర్గధామం
Publish Date:Dec 10, 2025
మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
Publish Date:Aug 28, 2025
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు.
కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. . రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్ భగవత్.. బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్‌ఎస్‌ఎస్ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.
నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్ నిర్ణయాలు తీసుకుంటుందని ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.
రాహుల్ టార్గెట్ గా అరవింద్ విమర్శల వర్షం.. మర్మమేంటంటే?
Publish Date:Aug 28, 2025
కల్వకుంట్ల వారసుల సెపరేట్ అజెండాలు.. క్యాడర్లో కన్ఫ్యూజన్
Publish Date:Jul 25, 2025
సీబీఎన్.. ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం!
Publish Date:Apr 19, 2025
కడప మహానాడులో బాంబులు పేలనున్నాయా..?
Publish Date:Apr 8, 2025
పెళ్లైన ప్రతి జంట తప్పకుండా ఈ కారణాల వల్ల గొడవలు పడతారట..!
Publish Date:Dec 18, 2025
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం. చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా, ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట మధ్య కొన్ని గొడవలు కామన్ గా జరుగుతాయని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు.పెళ్లయ్యాక ప్రతి జంట మధ్య జరిగే కామన్ గొడవలు ఏంటో తెలుసుకుంటే.. ఇవి అందరి మధ్యన జరుగుతాయి కాబట్టి వీటిని సీరియస్ గా తీసుకుని బంధాన్ని విచ్చిన్నం చేసుకోకూడదు అని ప్రతి జంట అర్థం చేసుకోగలుగుతుంది. ఇంతకీ అందరు భార్యాభర్తల మధ్య కామన్ గా జరిగే గొడవలు ఏంటో తెలుసుకుంటే..
తల్లిదండ్రుల శైలి..
భార్యాభర్తల ఇద్దరి తల్లిదండ్రులు ఒకరి కుటుంబ విధానాన్ని మరొకరు విమర్శించుకోవడం చాలా కుటుంబాలలో కనిపిస్తుంది. ఒకరేమో చాలా నిర్లక్ష్యంగా పెంచారు అనే నిందలు వేస్తుంటారు, మరొకరు ఏమో ఏమీ చేత కాకుండా పెంచారని అంటారు, కొన్నిసార్లు చాలా స్ట్రిక్ట్ గా పెంచి పిరికివాళ్లుగా మార్చారని అంటారు. ఇలా రెండు కుటుంబాలలో విబిన్న విధాలుగా పెంపకం ఉంటుంది. పెళ్లైన తర్వాత వారికి చిన్నతనం నుండి అలవాటైన విధానం ఇప్పుడు కూడా కొనసాగాలని కోరుకుంటారు. అంతేకాదు.. తమ చిన్నతనం ఎలా గడిచిందో అదే విధంగా తమ పిల్లలను కూడా పెంచాలని చూస్తారు. ఇది ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో సాగే గొడవ. దీన్ని వీలైనంత చాకచక్యంగా పరిష్కరించుకోవాలి.
డబ్బు..
డబ్బు చాలా ముఖ్యమైన అంశం. కొన్ని కుటుంబాలు డబ్బుల విషయంలో చాలా ఆంక్షలు విధిస్తూ పెంచుతారు. మరికొన్ని కుటుంబాలు డబ్బు అనేది పిల్లల కోసమే కదా అనే ఆలోచనతో పిల్లలకు డబ్బు అలవాటు చేస్తారు, డబ్బు వల్ల వచ్చే సమస్యలు కొన్నిసార్లు చాలా తీవ్రమైన గొడవలకు కారణం అవుతాయి. భార్యాభర్తల అభిరుచులు డబ్బు విషయంలో ఒకటిగా ఉంటే పర్లేదు. కానీ ఒకరు పొదుపరి, మరొకరు బాగా ఖర్చు పెట్టేవారు అయితే చాలా గొడవలు వస్తుంటాయి. ముఖ్యంగా ఎప్పడైనా డబ్బు కారణంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తే జరిగే గొడవలు చాలా పెద్దగా ఉంటాయి.
సాన్నిహిత్యం..
భార్యాభర్తల మధ్య మంచి అనుబంధం ఉండాలంటే వారి మధ్య సాన్నిహిత్యం కూడా చాలా బాగుండాలి. ఒకరు తమ ప్రేమను ఎక్స్పెస్ చేయగలిగితే మరొకరు అలా ప్రేమను ఎక్ప్రెస్ చేయకుండా తమలోనే దాచుకుంటారు. దీని వల్ల ఒకరి మీద ఒకరికి విబిన్న అభిప్రాయాలు ఏర్పడతాయి. ప్రేమించడం తెలియదు, ప్రేమ లేదు, ప్రేమ లేకుండా పెళ్లి చేసుకున్నారు వంటి అపార్థాలు వస్తాయి. ఎప్పుడు ప్రేమ గురించి తప్ప బాధ్యతగా ఉంటున్నానని ఆలోచించట్లేదు అని మరొకరు అనుకుంటారు. ఇలా చాలా విధాలుగా అపార్థాలు వస్తుంటాయి.
భవిష్యత్తు..
పెళ్లైన ప్రతి జంటకు భవిష్యత్తు గురించి కొన్ని కలలు ఉంటాయి. పిల్లల కోసం ఒకరు కష్టపడతారు, మరొకరు కెరీర్ ను కూడా వదిలేసుకుంటారు. జీవితంలో లక్ష్యాల కోసం ఒకరు ఆరాటపడతారు, నేను ఎన్ని త్యాగాలు చేసినా నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఒకరు అనుకుంటారు. ఇలా చాలా విధాలుగా ఇద్దరూ తమలో తాము సంఘర్షణ పడుతుంటారు. వీటి వల్ల కూడా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి.
పైన పేర్కొన్న ప్రతి గొడవ పెళ్లైన ప్రతి జంట మధ్య తప్పనిసరిగా జరుగుతుంది. కేవలం తమ మద్య మాత్రమే గొడవ జరుగుతుందనే ఆలోచన చేస్తూ గొడవ జరిగినప్పుడు దానికి గల కారణాన్ని సమస్యగా చూసి దాన్ని పరిష్కరించుకోవాలి. అంతే కానీ భాగస్వామినే సమస్యగా చూస్తే ఆ బందం పెళుసుగా మారుతుంది. అంతేకాదు.. భార్యాభర్తల మద్య గొడవలు జరిగినప్పుడు, సమస్య వచ్చినప్పుడు రాజీ పడటం ప్రధానం. ఎవరో ఒకరు రాజీ పడితే తప్ప బందం నిలవదు. రాజీ పడటం అంటే తాము ఓడిపోవడం, చిన్నతనం కావడం కాదు.. బంధాన్ని నిలబెట్టుకోవడం.
*రూపశ్రీ.
జాగ్రత్త అమ్మాయిలను ఎప్పుడూ ఈ 7 ప్రశ్నలు అడగకండి..!
Publish Date:Dec 17, 2025
సైడ్ ఇన్కమ్ కావాలా.. ఈ సూపర్ మార్గాలు మీ కోసమే..!
Publish Date:Dec 16, 2025
నకిలీ స్నేహితులను గుర్తించే మార్గాలు ఇవే..!
Publish Date:Dec 13, 2025
డిసెంబర్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఇదే..!
Publish Date:Dec 12, 2025
ఈ చిన్న అలవాట్లే మానసిక ఆరోగ్యానికి శ్రీరామ రక్ష..!
Publish Date:Dec 18, 2025
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే నేటి కాలంలో మానసిక ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు. మానసికంగా బలంగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే ఆఫీసు ఒత్తిడులు, జీవిత సమస్యలు, లక్ష్యాలు చేరుకోవడంలో పడే సంఘర్షణ.. ఇలా ఒకటేమిటి.. చాలా విషయాలు మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ కొన్ని సాధారణ అలవాట్లు మానసిక ఆరోగ్యానికి శ్రీరామ రక్షలా పనిచేస్తాయి. ఇంతకీ ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే..
కృతజ్ఞత..
కృతజ్ఞత భావం మనిషిని చాలా స్వచ్చంగా ఉంచుతుంది. ప్రతి వ్యక్తి మొదటగా గడిచే ప్రతి రోజు పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. రోజు తన జీవితంలో జరిగిన మంచి విషయాలను గుర్తు చేసుకోవాలి. ఇలా చేస్తే చాలా పాజిటివ్ మైండ్ సెట్ అలవాటు అవుతుంది. ఇది మానసికంగా బలంగా ఉండటానికి సహాయపడుతుంది.
వ్యాయామం..
శరీరంలో ఒత్తిడి హార్మోన్ తగ్గడానికి వ్యాయామం మంచి మార్గం. ప్రతి రోజూ 20 నుండి 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి.
శ్వాస వ్యాయామం..
శారీరక వ్యాయామమే కాకుండా మానసికంగా దృఢంగా ఉండటానికి శ్వాస వ్యాయామాలు కూడా చాలా బాగా సహాయపడతాయి. రోజూ కొన్ని నిమిషాలు శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది.
శ్రద్ద..
ఏ పని మీద అయినా దృష్టి పెట్టడాన్నే మైండ్ ఫుల్ నెస్ అని అంటున్నారు. ఇంటి పని చేసినా, వ్యాయామం చేసినా, ఆహారం తీసుకున్నా, ఆఫీసు పని చేసినా.. ఇలా ప్రతి పని చేసినప్పుడు ఆ పని మీద పూర్తిగా మనసు లగ్నం చేయాలి. ఇందుకోసం ధ్యానం చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది. ఇలా చేయడం వల్ల మెయింటైన్ స్కిల్స్ మెరుగవుతాయి.
ప్రకృతి..
మనిషిలో ఒత్తిడిని తగ్గించే సూపర్ మెడిసిన్ ఏదైనా ఉందంటే అది ప్రకృతి. తాజా గాలిలో, సూర్యరశ్మిలో సమయం గడపడం, మొక్కలు, చెట్లు, పక్షులు, జంతువుల సమక్షంలో సమయాన్ని గడపడం వల్ల ఒత్తిడి తగ్గి మానసికంగా దృఢంగా మారతారు.
మనసు విప్పడం..
ఎలాంటి విషయాలు అయినా కొందరితోనే మనసు విప్పి మాట్లాడగలుగుతారు. వారిలో స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు ఇట్లా చాలా ఉంటారు. అయితే ఎవరి దగ్గర ఏదైనా చెప్పుకోగల చనువు ఉంటుందో వారితో ఓపెన్ గా మాట్లాడాలి. దీనివల్ల చాలా విషయాలలో మంచి సలహాలు దొరకడమే కాకుండా క్లిష్ట పరిస్థితులలో మంచి సపోర్ట్ కూడా దొరుకుతుంది.
బంధాలు..
స్నేహం అయినా, ప్రేమ అయినా, వైవాహిక బంధం అయినా, కొలీగ్స్ తో పరిచయం అయినా.. వారితో ఉండే రిలేషన్ పదే పదే తెగిపోతూ ఉంటే అది మానసిక సమస్యలకు దారి తీస్తుంది. అందుకే బంధాలను కాపాడుకోవాలి. ఎక్కువకాలం బంధాలు నిలిచి ఉండేలా చూసుకోవాలి. ఎమోషనల్ గా బంధాలతో కనెక్ట్ అయి ఉండాలి.
నచ్చిన పని..
మానసికంగా బాగుండాలంటే అన్నింటి కంటే ముఖ్యమైనది నచ్చిన పని చేయడం. చాలా వరకు ఇతరుల సలహాలు, ఇతరుల కమాండింగ్ మీద చాలా మంది పని చేస్తూ ఉంటారు. కానీ నచ్చిన పని చేయడంలో చాలా తృప్తి ఉంటుంది. ఇది మానసికంగా బలంగా ఉంచుతుంది.
ఆత్మ విమర్శ..
ప్రతి రోజూ పడుకునే ముందు ఉదయం నుండి జరిగిన ప్రతి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా మంచి విషయాలను గుర్తు చేసుకోవడం వల్ల చాలా పాజిటివ్ మైండ్ అలవాటు అవుతుంది. పాజిటివ్ మైండ్ ఉంటే అది మానసిక ఆరోగ్యాన్ని కూడా బలంగా ఉంచుతుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
డయాబెటిక్ ఫుడ్స్.. ఈ ఆహారాలు తింటే చాలా ఈజీగా షుగర్ వచ్చేస్తుంది..!
Publish Date:Dec 17, 2025
టీతో పాటు బిస్కెట్లు తింటున్నారా? దిమ్మ తిరిగే నిజాలు ఇవి..!
Publish Date:Dec 16, 2025
వందేళ్లకు పైగా బ్రతకడానికి ఆయుర్వేదం చెప్పిన రహస్య చిట్కాలు..!
Publish Date:Dec 13, 2025
వారెవ్వా మందారం టీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!
Publish Date:Dec 12, 2025