ఇకపై 150 కిలోమీటర్ల వేగంతో రైళ్లు
posted on Oct 13, 2012 @ 11:25AM
దేశంలోని అతిపెద్దసంస్ధ అయిన రైల్యేలు ఇకపై ప్రయాణీకుల సమయాన్ని తగ్గించే ప్రయత్నంగా సూపర్ ఫాస్టు రైళ్లలో వేగాన్న పెంచనున్నారు. దీనివల్ల రైల్యేలకు అధనపు భారం ఏమీ వుండదు. మామూలుగా ఇప్పటికే ఉన్న రైళ్ల పట్టాలపై వీటిని నడపవచ్చు. దీనివల్ల ప్రయాణీకులకు సులువుగా, అతితక్కువ వ్యవధిలో గమ్యానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి రాజధాని, శతాబ్ది ఎక్స్ ప్రస్ లకు మాత్రమే ఈ సౌలభ్యం ఉన్నప్పటికీ 90 కిలోమీటర్ల వేగంతోనే వాటిని కూడా నడుపుతున్నారు. మన రాష్ట్రానికి ఈ వేగంతో ప్రయాణించే రైళ్లు ఎన్ని ఉంటాయనేది కేంద్ర రైల్యే శాఖ ఇంకా తెలుపవలసి ఉంది.