నంది అవార్డ్స్ విన్నర్స్ 2011

 

2011 సంవత్సరానికి గాను నంది అవార్డులను శనివారం ప్రకటించారు. ఉత్తమ నటుడిగా టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు (దూకుడు) ఎంపిక కాగా, ఉత్తమ నటిగా నయనతార (శ్రీరామ రాజ్యం) ఎంపికయింది. ఉత్తమ దర్శకుడిగా ఎన్ శంకర్(జై బోలో తెలంగాణ), దూకుడు చిత్రంలో నటనకుగాను ఉత్తమ హాస్య నటుడిగా ఎంఎస్‌ నారాయణ, ఉత్తమ సహాయ నటుడిగా ప్రకాశ్‌రాజ్‌ నంది పురస్కారాన్ని అందుకోబోతున్నారు. ఇక నాగార్జున, చార్మిలకు స్పెషల్‌ జ్యూరీ అవార్డులు వరించాయి. ఉత్తమ సంగీత దర్శకునిగా ఇళయరాజా ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రంగా శ్రీరామరాజ్యం ఎంపికయింది.

 

 

 

నంది అవార్డ్స్ విన్నర్స్ 2011

 

ఉత్తమ నటుడు : మహేష్ బాబు(దూకుడు)
ఉత్తమ నటి : నయనతార(శ్రీరామ రాజ్యం)
ఉత్తమ దర్శకుడు : ఎన్ శంకర్(జై బోలో తెలంగాణ)
ఉత్తమ విలన్ : మంచు లక్ష్మి (అనగనగా ఒక ధీరుడు)
ఉత్తమ చిత్రం : శ్రీరామ రాజ్యం
ఉత్తమ ద్వితీయ చిత్రం : రాజన్న
ఉత్తమ తృతీయ చిత్రం : విరోధి
ఉత్తమ గాయకుడు : గద్దర్ (జై బోలో తెలగాణ చిత్రంలోని పొడుస్తున్న పొద్దుమీద సాంగ్)
ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం : జైబోలో తెలంగాణ
ఉత్తమ కుటుంబ కథాచిత్రం : 100% లవ్
ఉత్తమ వినోదాత్మక చిత్రం : దూకుడు
ఉత్తమ హాస్య నటుడు : ఎంఎస్ నారాయణ(దూకుడు)
ఉత్తమ సహాయ నటుడు : ప్రకాష్ రాజ్ (దూకుడు)
ఉత్తమ సహాయ నటి : సుజాత రెడ్డి (ఇంకెన్నాళ్లు)
ఉత్తమ పిల్లల చిత్రం : శిఖరం
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం : అవయవదానం
ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ : సమ్మెట గాంధీ(రాజన్న)
ఉత్తమ సహాయనటి : రత్నసాగరి(కారాలు మిర్యాలు)
ఉత్తమ బాల నటుడు : నికిల్ (100% లవ్)
ఉత్తమ బాల నటి : బేబి ఆని(రాజన్న)
ఉత్తమ సినిమాటో గ్రాఫర్ : బిఆర్ కె రాజు
ఉత్తమ మాటల రచయిత : నీలకంఠ(విరోధి)
స్పెషల్ జ్యూరీ అవార్డ్(పురుషులు): అక్కినేని నాగార్జున(రాజన్న)
స్పెషల్ జ్యూరీ అవార్డ్(మహిళలు) : చార్మి(మంగళ)
ఉత్తమ గేయ రచిత : సురేందర్ (పోరు తెలంగాణ)

ఉత్తమ సంగీత దర్శకుడు : ఇళయరాజా (శ్రీరామ రాజ్యం)

ఉత్తమ చలన చిత్ర పుస్తకం : సినిమా పోస్టర్ (ఈశ్వర్)
ఉత్తమ సినీ విమర్శకుడు : రెంటాల జయదేవ్
ఉత్తమ కాస్టూమ్ డిజైనర్ : భాషా ( అనగనగా ఓ ధీరుడు)
ఉత్తమ గేయ రచయిత : శివశక్తి దత్త(రాజన్న మూవీలోని అమ్మ అవని సాంగ్)
ఉత్తమ నృత్య దర్శకుడు : శ్రీను
ఉత్తమ ఫైట్స్ : విజయ్(దూకుడు)
ఉత్తమ మేకప్ : రాంబాబు(శ్రీరామ రాజ్యం)
ఉత్తమ కథ రచయిత : రాజు మాదిరాజ్(రుషి)
ఉత్తమ సినమాటోగ్రాఫర్ : పీ ఆర్కే రాజు(శ్రీరామ రాజ్యం)
ఉత్తమ ఎడిటర్ : ఎంఆర్ వర్మ(దూకుడు)

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.