జగన్ కంపెనీలకు 3లక్షల జరిమానా
posted on Aug 8, 2012 @ 4:56PM
జగన్ కంపెనీలపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జగతి పబ్లికేషన్స్, జనని ఇన్‌ఫ్రా, ఇందిరా టెలివిజన్ సంస్థలకు హైకోర్టు జరిమానా విధించింది. ఒక్కో సంస్థకు రూ.లక్ష చొప్పున ఈ మూడు సంస్థలకు రూ.మూడు లక్షల జరిమానా హైకోర్టు విధించింది. అయితే ఈ బ్యాంక్ ఖాతాల స్తంభన ఆదేశాలు సవరించాలంటూ ఈ సంస్థలు ఆయా పిటిషన్‌లలో పదే పదే సవరణలు కోరుతుండటంపై హైకోర్టు మండిపడింది. పిటిషన్‌లు దాఖలు చేస్తూ పదే పదే సవరణలు కోరుతూ మళ్లీ పిటిషన్‌లు దాఖలు చేయడమేమిటని ప్రశ్నించింది. దీనిపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసి ఆ సంస్థలకు జరిమానా విధించింది.