ఇంగ్లాండ్ ను ఆటాడుకున్న భారత స్పిన్నర్లు
posted on Sep 24, 2012 @ 11:01AM
టి-20 ప్రపంచ కప్ గ్రూప్- ఎ చివరి మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లాండ్ ను ఓ ఆటాడుకుంది. ఇంగ్లాండ్ పై 90 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత బౌలర్ల ధాటికి 14.4 ఓవర్లలో 80 పరుగులకే కుప్పకూలారు. అంతర్జాతీయ టి-20ల్లో ఇంగ్లండ్‌కిదే అత్యల్ప స్కోరు. వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ (4/12) ఏడాది తర్వాత ఘనంగా రీ ఎంట్రీ ఇ చ్చాడు. చావ్లా (2/13), ఇర్ఫాన్ (2/17) అద్భుత ప్రదర్శన కనబరిచారు. దీంతో బ్రాడ్‌సేన పెవిలియన్‌కు క్యూ కట్టారు. జట్టులో కీస్వెట్టర్ 35పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. అంతకుముందు టాస్ఓడి బ్యాటింగ్‌కు దిగిన ధోనీసేన పూర్తి ఓవర్లలో నాలుగు వికెట్లకు 170 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ 33 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 55 పరుగులు చేయగా, గంభీర్ 38 బంతుల్లో 5 ఫోర్లతో 45, విరాట్ కోహ్లీ 32 బంతుల్లో 6 ఫోర్లతో 40 పరుగులతో దూకుడుగా ఆడారు. ఫిన్ రెండు వికెట్లు తీయగా, స్వాన్ 1వికెట్ తీసి పొదుపుగా బౌలింగ్ చేశాడు.