చిన్నారి సాన్వి దారుణ హత్య

 

ముద్దులొలికే చిన్నారి శాన్వికి ఈ ప్రపంచం రక్షణ కల్పించలేక పోయింది. తన ముగ్దంత్వంతో ఈ ప్రపంచాన్ని తాను జయించలేక శాశ్వతంగా నిష్క్రమించింది. క్రూరుల లోకంలో నేనుండ లేనంటూ సెలవు తీసుకుంది. అమానుషాన్ని అడ్డుకుంటానికి మన టెక్నాలజీ ఏ మాత్రం సహకరించలేకపోయింది. ఒకప్పుడు క్రూరులు సమాజానికి ఆవలి నుండేవారు. ఇప్పుడు మంచి వాడెవ్వరో క్రూరులెవ్వరూ తెలుసుకునేందుకు వీలు లేకుండా మనలోనే సాడిస్టులు ఇరుగు పొరుగు ఇళ్లలోనే ఉంటున్నారు. వారు సూటు బూటు వేసుకొని అత్యున్నతంగా చదువుకొని మనలో ఒకరిగా ఉంటూనే పాశవిక చర్యలకు పాల్పడుతున్నారు. సంస్కారం లేని చదువులతో మానవాళి మనుగడకు పెనుసవాలు విసురుతున్నారు. టెక్నాలజీ పెరిగి మానవత్యం తగ్గిందనటానికి ఇదొక ఉదాహరణ. అనుబంధాలు ఆప్యాయతలకు పుట్టిల్లయిన భారత దేశ పరువును దేశం కాని దేశంలో మట్టు పెట్టి దేశానికి తలవంపులు తెచ్చాడు కర్కొటకుడు రఘు. తెలుగు వారంత కలసి మెలసి ఐక్యతా రాగం తీసే కాలనీలోనే మానవత్వాన్ని పెకలించిన రాక్షసుడున్నాడని తెలిసిన తెలుగువారు వణికి పోతున్నారు. అలాంటి కపటులకు అమెరికన్ చట్టం కఠినమైన శిక్ష విధించి మరెప్పుడూ అలాంటి పాశవికత్యం రిపీట్ అవ్వకుండా బుజ్జి శాన్వికి, తన నానమ్మ ల ఆత్మలకు శాంతి చేకూరుస్తారని ఆశిద్దాం

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.