‘ఈ’ కార్లు ఇక...ఇక్కడి నుంచి ఎక్స్ పోర్ట్
posted on Aug 27, 2025 @ 3:57PM
దేశంలో విద్యుత్ వాహనాల వాడకం క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ గుజరాత్ హన్సల్ పుర్ మారుతీ సుజుకి మోటార్ ప్లాంట్ లో రెండు కీలక ప్రాజెక్టులు ప్రారంభించారు. మారుతీ విటారాతో పాటు హై బ్రెడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ ఉత్పత్తి చేసే తొలి ప్లాంటు కు జెండా ఊపారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, జపాన్ రాయబారి కీచీ ఒనో పాల్గొన్నారు.
భారత్ స్వావలంబన సాధించేందుకు ఇదెంతో కీలకమని.. ఇక్కడ ఉత్పత్తి చేయనున్న కార్లు వంద దేశాలకు ఎక్స్ పోర్ట్ కానున్నాయని.. ఈ కార్యక్రమానికి ముందు మోడీ ఎక్స్ వేదికగా రియాక్టయ్యారు. ఇ విటారా.. తొలి కారు యూకేకి ఎగుమతి కానుంది. తొషిబా, డెన్సో, సుజుకీ సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్లాంట్ లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ తయారు కానున్నాయి. దీంతో 80 శాతం బ్యాటరీ దేశీయంగా సిద్ధం కానుంది.
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తన తొలి విద్యుత్ కారు ఇ విటారాను జనవరిలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కారును 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ టార్గెట్ గా పెట్టుకుంది. తద్వారా భారత్ ను గ్లోబల్ ప్రొడక్షన్ హబ్ గా తీర్చి దిద్దాలనుకుంటున్నట్టు సుజుకీ మోటర్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ అప్పట్లో ఈ విషయం చెప్పారు.. కూడా. మారుతీ సుజుకీ ఇ విటారా రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తోందని అన్నారు.
భారత్ లో ఇ విటారా తయారీకి 2 వేల 100 కోట్లు వెచ్చించినట్టు చెబుతున్నారు సుజుకీ ప్రతినిథులు. తమ ఈవీలో కొన్న వారికి స్మార్ట్ హోం ఛార్జర్, ఇన్ స్టలేషన్ సపో్ట్ ను అందించేలా చెప్పారు. తొలి దశలో వంద ప్రధాన నగరాల్లో ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లు పెడుతున్నట్టు చెప్పారు. ప్రతి ఐదు పది కిలోమీటర్లకు ఒక మారుతీ సుజుకీ చార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు.