భూమన చెప్పిన...ఈ రజియా సుల్తానా ఎవరు శ్రీలక్ష్మీ?
posted on Aug 27, 2025 @ 3:39PM
భూమన ఐఏఎస్ శ్రీలక్ష్మి గురించి మాట్లాడుతూ.. ఆమె ఒక తాటకి, పూతన, లంకిణి.. ఆధునిక రజియా సుల్తానా అంటూ మండి పడ్డారు. మనకు తాటకి తెలుసు, రామాయణంలో కనిపిస్తుందీ పాత్ర. ఇక పూతన అంటే భాగవతంలో వస్తుంది. లంకిణి కూడా రామాయణ పాత్రే. రజియా సుల్తానా ఎవరనే దగ్గర అందరి ఆలోచనలు ఆగిపోతున్నాయ్.
ఒక వేళ అదే నిజమైతే.. రజియా సుల్తానా ఢిల్లీ సుల్తానేట్- మొదటి మహిళా పాలకురాలిగా చెప్పాల్సి వస్తుందని అంటారు. ఆమె 1236 నుంచి 1240 వరకూ ఢిల్లీని పాలించారు. ఆమె మహిళ అయినా ఆనాటి స్థితిగతులను తనకు అనువుగా మార్చుకుని, పురుషాధిక్యతను అధిగమించి.. సింహాసనం అధిరోహించి.. సైన్యాన్ని నడిపించి, రాజ్య వ్యవహారాలు చూసుకున్న ఏకైక డేరింగ్ డ్యాషింగ్ డైనమిక్ లేడీ లీడర్ గా చెబుతుంది ఆమె బయోగ్రఫీ.
ఆమె ఎలాంటి దుస్తులు లేకుండా.. బహిరంగ ప్రదేశాల్లో గుర్రాలపై, ఏనుగులపై సవారీ చేసేదని అంటారు. సైనికులతో కలసి యుద్ధరంగంలో పోరాడేదని చెబుతుంది చరిత్ర. అంతే కాదు.. ఆమె పేరిట పలు సైనిక విజయాలు కూడా లిఖించబడ్డాయి. ఆమె తన రాజ్యానికి చెందిన సొంత నాణేలపై సుల్తానాగా తన పేరు లిఖింప చేసుకున్నారు. మాములుగా అయితే ఆమె పేరు కేవలం రజియా మాత్రమే. కానీ తనకు తాను ఒక సుల్తాన్ గా ప్రకటించుకున్న ధీరోదాత్తగా పేరు.
ఇదంతా ఇలా ఉంటే.. ఒకప్పుడు కలెక్టర్ శ్రీలక్ష్మి అంటే అదో నేమ్ అండ్ ఫేమ్. అప్పట్లో ఆమె నెల్లూరు కలెక్టర్ గా పని చేస్తున్నపుడు ఎందరో ఆడపిల్లలకు ఐఏఎస్ అనే ఒకానొక పదం తమ పేరు తర్వాత తగిలించుకోవడం ఒక ప్యాషన్ గా మార్చుకున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి శ్రీలక్ష్మి వైయస్ హయాంలో.. భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే చెడ్డ పేరు మూట కట్టుకున్నారు. ఒక సమయంలో ఆమె చేత చేయించుకోవాల్సిన సంతకాలు అన్నీ చేయించుకుని.. ఇప్పుడామెను తాటకి, పూతన, అభినవ రజియా అంటూ లేని పోని మారు పేర్లను తగిలించడం.. ఏమనుకోవాలన్నది చాలా మంది వేస్తున్న ప్రశ్న.
ఒకప్పుడు సీపీఐ నారాయణ వంటి వారి చేత అందాల రాణిగా అభినందనలు అందుకున్న శ్రీలక్ష్మి- వైయస్ ఫ్యామిలీతో పెట్టుకున్నందుకు అనారోగ్యం పాలై.. జుట్టు మొత్తం పోగొట్టుకున్నారు. దీంతో ఆమె విగ్గులు వాడే వరకూ వచ్చేశారు. చివరికి ఆమె పరిస్థితి ఎలాంటిదంటే ఎవరి కోసమైతే తాను ఇంత కష్టపడ్డానో... ఆ వర్గం నుంచి కూడా ఇలాంటి చీత్కార సత్కారాలను ఎదుర్కోవడం. ఈ లెక్కన రాజకీయ నాయకుల కోసం వారి స్వలాభ.. స్వార్ధం కోసం పాటుపడే ఉన్నతాధికారుల పరిస్థితి ఏమై పోతుందో చెప్పడానికి ఒక నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తున్నారు ఐఏఎస్ శ్రీలక్ష్మి.