నాల్గోరోజు పాదయాత్రలో నాగలి పట్టిన బాబు
posted on Oct 5, 2012 @ 5:40PM
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నాల్గోరోజు పాదయాత్ర ఈరోజు ఉదయం తురకలపట్నం నుంచి యాత్ర ప్రారంభమైంది. ఎల్‌జీబీ నగర్‌లో రహదారి పక్కన ఉన్న పంటపొలాలను పరిశీలించి, రైతులతో కలిసి నాగలి పట్టి పొలాన్ని దున్నారు. రైతుల నుంచి చంద్రబాబుకు అపూర్వ స్పందన లభించింది. అక్కడి నుంచి కొగిరి, రాగిమేకపల్లి, రాచూర్, ఎర్రబెంచి మీదుగా గరికమేకపల్లి వరకు చంద్రబాబు పాదయాత్ర సాగనుంది. రాత్రికి గరికమేకపల్లిలో చంద్రబాబు బస చేయనున్నారు. ఈ రోజు దాదాపు 18 కి.మీ వరకు చంద్రబాబు పాదయాత్రగా వెల్లనున్నారు. చంద్రబాబు పాదయాత్ర శుక్రవారం కర్ణాటక ప్రాంతంలో కూడా కొనసాగనుంది. ఆ తరువాత కోగిరకు వెళతారు. అనంతరం రాగిమేకలపల్లి, ఇదే గ్రామానికి అనుబంధంగా ఉన్న బీసీకాలనీ మీదుగా రాచూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 7కిలోమీటర్ల మేరకు కర్ణాటకలో పాదయాత్ర సాగిస్తారు. ఆ తరువాత ఎర్రమంచి మీదుగా రాప్తాడు నియోజకవర్గంలోని గరిమేకలపల్లికి వెళతారు. అక్కడే రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువు ఎల్.నారాయణచౌదరి ఇంటిలో బస చేస్తారు.