జగన్ సంపాదనపై జడ్జి ప్రశ్న
posted on Oct 5, 2012 @ 5:19PM
ఈ రోజు కోర్ట్ లో వాదనలు వినిపించిన జగన్ న్యాయవాది అరెస్టు అక్రమమని, రాజకీయ కారణాలతో జైలుకు పంపించారని ఆరోపించారు. దీనికి స్పందించిన జడ్జి జగన్ అతి తక్కువ కాలంలో ఇన్ని వేల కోట్ల ఆస్తులను ఎలా సంపాదించగలిగారని జగన్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. అలాగే పది రూపాయల ముఖ విలువ కలిగిన షేర్‌లను రూ.350 ఎలా అమ్మారో చెప్పాలని ప్రశ్నించారు. ఇంకా జగన్ కేసుపై సిబిఐకి ఛార్జీషీట్ డెడ్‌లైన్ విధించింది. 2013 మార్చి 31వ తేదిలోగా ఈ కేసును ముగించాలని సిబిఐకి సూచించింది. తరుచూ ఛార్జీషీట్లు వేయవద్దని, ఒక్క ఛార్జీషీట్‌తోనే విచారణ ముగించాలని తెలిపింది. సిబిఐ మరింత సమయం కోరడంతో కోర్టు ఈ డెడ్ లైన్ విధించింది. విచారణ గడువు ముగిసిన తర్వాత బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని జగన్ కు కోర్టు సూచించింది. జగన్ తరఫున గోపాల సుబ్రహ్మణ్యం, విశ్వనాథన్‌లు, సిబిఐ తరఫున అశోక్ బాన్, మోహన్ పరాశరణ్‌లు కోర్టులో తమ వాదనలు వినిపించారు.