శ్రీవారికి హనుమంత వాహనసేవ
posted on Sep 23, 2012 @ 3:22PM
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆదివారం నాటికి ఆరవ రోజుకు చేరుకున్నాయి. ఈ ఉదయం మలయప్పస్వామి హనుమంత వాహనంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శోభాయమానంగా అలంకృతుడైన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. శ్రీవారి దర్శనానికి భక్తులకు 17 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నడకదారిన వచ్చే భక్తులకు దర్శనానికి 3 గంటలు మాత్రమే సమయం పడుతోంది. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి కూడా 3 గంటల సమయం పడుతోంది. ఈ రాత్రికి శ్రీవారిని గజవాహనంపై ఊరేగిస్తారు.