అర్ధరాత్రి యువతిపై సామూహిక అత్యాచారం
posted on Sep 23, 2012 @ 4:45PM
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మోరంపూడి వద్ద ఓ యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం రాత్రి బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్ళి తిరీగి అర్ధరాత్రి దాటిన తర్వాత తన బాబాయితో కలిసి మోరంపూడికి బయలుదేరింది. వారిద్దరూ ఓ ఆటో ఎక్కారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత ఆటో డ్రైవర్‌కు సంబంధించిన ఇద్దరు యువకులు ఆటో ఎక్కారు. మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత వారు ఆ యువతి చిన్నాన్నను ఆటోలో నుండి కిందకు తోసేశారు. అనంతరం ముగ్గురు కలిసి ఆ యువతిపై సామూహిక అత్యాచారం జరిపారు. యువతి చిన్నాన్న బొమ్మూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి బయలుదేరారు. తీవ్రంగా గాయపడిన యువతిని ఆసుపత్రిలో అత్యాచారానికి పాల్పడిన యువకులు తప్పించుకొని పారిపోయారు. పోలీసులు నిందితులను ముగ్గురిని పట్టుకోవడానికి స్థానిక ఆటో డ్రైవర్లను, పరిసర ప్రాంతాల వారిని విచారిస్తున్నారు.