ఏఎస్పీ నవీన్ సస్పెండ్ పై స్టే
posted on Sep 18, 2012 @ 5:18PM
తూర్పు గోదావరి జిల్లా, రంపచోడవరం ఏఎస్పీ నవీన్ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని క్యాట్ తప్పుపట్టింది. నవీన్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది. నవీన్‌కు వెంటనే వేరొక చోట పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. కాగా ప్రభుత్వం తనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ ఏఎస్పీ నవీన్ క్యాట్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన క్యాట్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.