యుపిఎకు మమతా షాక్

మంగళవారం మమతా బెనర్జీ యూపీఏకు పెద్ద షాకిచ్చారు, యూపీఏకు మద్దతు ఉపసంహరిస్తున్నామని ప్రకటించారు. డీజిల్ ధర పెంపు, వంటగ్యాస్ సిలిండర్లపై నియంత్రణ, అసోంలో అల్లర్లు, రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐలు, ఈ నిర్ణయాలు తమకు ఏమాత్రం నచ్చలేదన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు తృణమూల్ కాంగ్రెస్ మంత్రులు తమ రాజీనామాలను ప్రధాని మన్మోహన్‌కు సమర్పిస్తారని చెప్పారు. నిర్ణయం తీసేసుకున్నాం, ఇక వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. అయితే నాలుగు రోజులుగా కాంగ్రెస్‌కు హెచ్చరికలు పంపిస్తున్నట్లు మమత పేర్కొన్నారు. నాలుగు రోజుల క్రితమే సోనియాకు సందేశం పంపాను. సర్కారు నిర్ణయాలు ఆమోద యోగ్యం కాదని చెప్పాను. కానీ పరిస్థితిని ఆమె మార్చలేకపోయారని తెలిపారు. అలాగే మమతకు మూడు రోజుల క్రితం ప్రధాని మన్మోహన్ స్వయంగా ఫోన్ చేసినట్లు సమాచారం. ఆయన బుజ్జగింపులను మమత పట్టించుకోలేదని తెలిసింది.

 


542 మంది సభ్యులున్న లోక్‌సభలో మేజిక్ మార్కు 272. యూపీఏ బలం 273. ఇందులో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 19. వీరిని తీసేస్తే యూపీఏ బలం 254కు పడిపోయింది. అంటే సర్కారు మైనారిటీలో పడింది. అయినప్పటికీ యూపీఏకు మద్దతు ఇచ్చేందుకు బీఎస్పీ (21) లేదా సమాజ్‌వాదీ (22) ముందుకు వస్తే మన్మోహన్ సర్కారుకు ముప్పేమీ ఉండదు. అయితే తృణమూల్‌తోపాటు 18 మంది సభ్యులున్న డీఎంకే కూడా సర్కారు నుంచి తప్పుకొంటే మాత్రం బీఎస్పీ, సమాజ్‌వాది పార్టీలు రెండూ కలిసి కాంగ్రెస్‌ను ఆదుకోవాల్సి వస్తుంది.
 

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.