రేవ్ పార్టీలో అశ్లీల నృత్యాలు, హిందూ జాగరణ వేదిక దాడి
posted on Jul 29, 2012 @ 12:27PM
శనివారం కర్ణాటకలోని ఓ రిసార్ట్స్‌లో ఏర్పాటుచేసిన రేవ్ పార్టీలో అశ్లీల నృత్యాలు చేస్తున్నారని యువతీ, యువకులపై శనివారం హిందూ జాగరణ వేదిక కార్యకర్తలు దాడి చేశారు. రేవ్ పార్టీని నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న హిందూ జాగరణ వేదిక కార్యకర్తలు రాత్రి ఆ రిసార్ట్స్ వద్దకు చేరి దాడికి పాల్పడ్డారు. అక్కడ అర్ధనగ్నంగా ఉన్న యువతీ యువకులను పట్టుకుని చికతబాదారు. రేవ్ పార్టీలో యువతీ యువకులపై దాడిని పలుగురు ఖండించారు. అమ్మాయిలపై దాడి చేసే అధికారం ఎవ్వరికీ లేదని మండిపడ్డారు. ఇలా దాడి చేయడం తగ దని సీఎం జగదీశ్ శెట్టర్ అన్నారు.దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.