అక్బరుద్దీన్ ఓవైసి విషయంలో సిఎం ఆచి తూచి ?
posted on Jan 7, 2013 @ 4:09PM
మత విద్వేషాలను రేచ్చగొట్టాడనే విషయంలో పోలీస్ కేసు నమోదు అయిఉన్న ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే, ఆయన హైదరాబాద్ విమానాశ్రయంలో దిగిన వెంటనే జరిగిన పరిణామాలు మరింత చర్చనీయాంసంగా ఉన్నాయి.
అక్బర్ శంషాబాద్ లో దిగిన వెంటనే ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వారి నినాదాల మధ్య అక్బర్ తన జుబ్లీ హిల్స్ నివాసానికి ఓ హీరో లా వెళ్లి పోయారు తప్ప, ఆయనను అరెస్టు చేసే ప్రయత్నమేదీ పోలీసులు చేయలేదు ! ఆయనఫై ఐపిసి సెక్షన్లు 153 (A), 121 కింద కేసులు నమోదు అయి ఉన్నాయి. ఇవి తీవ్రమైన సెక్షన్లు.
అక్బర్ నిర్మల్ పోలీస్ స్టేషన్ లో హాజరవుతారని పోలీసులు మొదట భావించారు. అయితే, ఆయన అక్కడికి వెళ్ళకుండా ఆరోగ్యం బాగోలేదంటూ తన లాయర్లను పంపించారు. అయితే, ఈ విషయంలో ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకొన్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. అక్బర్ ను అరెస్టు చేస్తే, నగరంలో మత ఘర్షణలు చోటు చేసుకొనే అవకాశం ఉండటంతో ‘నెమ్మది’ గా పోవాలని ఆయన పోలీసులకు సూచించినట్లు తెలుస్తోంది.
అందుకే, కోర్టు ఆదేశాల కోసం వేచి చూడాలని పోలీసులకు సలహాలు ఉన్నాయని సమాచారం.