పుటపర్తి బాబా మహా సమాధికి అపచారం
posted on Jan 7, 2013 @ 8:14PM
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆరాద్యదైవంగా కొలిచే పుటపర్తి సత్యసాయిబాబా నిర్యాణానికి నెలరోజుల ముందునుంచే పుటపర్తి వివాదాలకి కేంద్రబిందువుగామారిన సంగతి తెలిసిందే. అయన నిర్యాణంతరము కూడా చాల రోజులు పుటపర్తి అనేక వివాదలాలవల్ల వార్తలలో నిలిచింది. అయితే,గత కొన్ని నెలలుగా అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొనడం అయన భక్తులందరికీ సంతోషం కలిగించింది.
మళ్ళీ, నిన్న అనగా ఆదివారంనాడు పుటపర్తిలో కలకలం రేగింది. బాబా భక్తుల మనసులు గాయపరిచే సంఘటన ఒకటి పుటపర్తిలో చోటుచేసుకొంది.
గత ఆరు సంవత్సరాలుగా పుటపర్తిలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో హ్రుదయ్యరోగ నిపుణుడిగా సేవలందిస్తున్న డా.నవనీత్ అనే ఆయన బాబా భాకుతుడు కూడా. అయన రోజూ ఉదయం సాయంకాలం తెండు పూతల బాబా దర్శనం చేసుకొంటాడు కూడా. నిన్న ఆదివారనాడు కూడా రోజూలాగే దర్శనం కొచ్చిన ఆయన, భక్తులందరూ ప్రార్ధనల అనంతరం ఒకరొకరిగా బయటకి వెళ్ళిపోతున్నసమయంలో బాబా మహా సమాదిపై తన మూత్రం చిలకరిస్తుంటే, భక్తులు నివ్వెరపోయి వెంటనే అతనిని పట్టుకొని పుటపర్తి పోలీసులకి అప్పజెప్పారు.
ఆయనని దాదాపు గంట సేపు విచారించిన పోలీసులు అతనికి మతి స్థిమితం తప్పిందని చెపుతూ వదిలేసారు.గానీ భక్తులు గట్టిగా ప్రశ్నించడంతో అతనిని మళ్ళీ సోమవారం నాడు పిలిచి విచారిస్తామని తెలిపారు. అయితే, అతని మీద కేసు నమోదు చేసి చర్య తీసుకోవాలంటే, ట్రస్ట్ కు సంబందించిన వారుగానీ, బాబా భక్తులుగానీ తమకు పిర్యాదు చేస్తే తప్ప ఏమి చేయలేమని చెప్పారు. అయితే, ఇంతవరకు ఎవరూ పిర్యాదు చేయలేదని సమాచారం.
బాబా భక్తులు ఆ డాక్టర్ నిజంగా మతి స్థిమితం లేని వాడయితే అటువంటి వ్యక్తీ ఆసుపత్రిలో రోగులకు అదికూడా హృద్రోగులకు వైద్యం ఎలా చేస్తున్నాడని, అటువంటి వ్యక్తీ చేతిలో రోగుల ప్రాణాలు ఏవిదంగా పెడుతున్నారని ప్రశ్నిస్తే వాటికి సమాధానం లేదు. అంటే గాకుండా వేలాది భక్తులు దర్శనం చేసుకొనే బాబా మహా సమాధిని సరయిన భద్రతా కల్పించకుండా ట్రస్ట్ వారు ఏమిచేస్తున్నారని ఆగ్రహంతో భక్తులు ప్రశ్నించేరు.