సౌందర్య ఆస్ధి కోసం కొట్టుకుంటున్న బంధువులు
posted on Oct 3, 2012 @ 10:46AM
దివంగత నటి సౌందర్య మరణానంతరం ఆమె కుంటుంబం వార్తల్లో నిలిచించి చాలా తక్కువ. అయితే తాజాగా సౌందర్య కుటుంబీకులు ఆమె ఆస్తుల కోసం కోర్టుకు ఎక్కారు. 2004లో హెలీకాప్టర్ ప్రమాదంలో సౌందర్య, ఆమె సోదరుడు మరణించారు. అప్పటికే సౌందర్యకు వివాహం కూడా అయ్యింది. తాజాగా సౌందర్య భర్త, ఆమె తల్లి ఒక గ్రూపుగా, ఆమె అన్న భార్య ఒక గ్రూపుగా ఏర్పడి వివాదాన్ని పెద్దది చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ దాదాపు 50 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. వాటి పంపకాల విషయంలో వారి మధ్య విబేధాలు వచ్చాయి. అయితే అప్పటికే సౌందర్య వీలునామా రాసిందని అంటున్నారు. వీలునామా ప్రకారం ఒక ఇల్లు తన సోదరుని కొడుకు సాత్విక్‌కు, అప్పటికి నిర్మాణంలో ఉన్న మరో ఇంటిని తన తల్లికి, తన కుటుంబానికి, సోదరునికి కుటుంబానికి చెందేలా ఉమ్మడి ఆస్తిగా రాసినట్లు కుటుంబ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్లో ఆమెకు ఉన్న ఆస్తిపై వచ్చే ఆదాయంతల్లికి, సోదరుని కుటుంబానికి, భర్తకు, పిల్లలకు సమాన వాటాలుగా చెందాలని, మిగిలిన ఆస్తులు భర్తకు, పిల్లలకు చెందాలని వీలునామాలో రాసినట్లు చెబుతున్నాయి. సౌందర్య రాసిన వీలునామాకు విరుద్ధంగా ఆస్తి తనకు చెందకుండా తన నాయనమ్మ అడ్డుపడుతోందంటూ సాత్విక్ కోర్టుకెక్కడంతో వివాదం మొదలైంది. సౌందర్య 2003లో రాసినట్లు చెబుతున్న వీలునామా ఫోర్జరీ చేసినదంటూ ఆమె తల్లి మంజుల, భర్త రాఘు ఫిర్యాదు దాఖలు చేయడంతో, ఆమె సోదరుని భార్య న్యాయవాది వారిపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు.