విమర్శల ఫై దేవేందర్ గౌడ్ మనస్తాపం
posted on Dec 8, 2012 @ 2:14PM
పార్లమెంట్ లో ఓటింగ్ విషయం లో తనఫై విమర్శలు చేయడంఫై తెలుగు దేశం పార్లమెంట్ సభ్యుడు దేవేందర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ తో అప్పాయింట్మెంట్ ఉన్న కారణంగానే తాను ఓటింగ్ కు హాజరు కాలేక పోయానని ఆయన అన్నారు. ఈ విషయం పార్టీ అధ్యక్షుడు చంద్ర బాబు కు కూడా తెలుసని, ఆయన అనుమతిన్చాకే తాను పార్లమెంట్ నుండి బయటకు వెళ్లానని గౌడ్ అన్నారు.
తాను నిజాయితీగా పని చేసే రాజకీయ నాయకుడినని, ఈ విషయం ఇంత రాద్దాంతం అవుతుందని తాను ఊహించలేదని ఆయన అన్నారు. తనను కొనే మగాడు కాంగ్రెస్ పార్టీ లో లేడని ఆయన అన్నారు.
ఓటింగ్ సమయంలో ములాయం, మాయావతి పార్టీలు ప్రభుత్వానికి సహకరిస్తున్నందున, ఓటింగ్ ఫలితం ముందే తెలిసిపోయిందని అందువల్లే ఈ విషయాన్ని తాము సీరియస్ గా తీసుకోలేదని గౌడ్ వివరణ ఇచ్చారు. ఈవిషయాన్ని ఇంతటితో వదిలేయాలని ఆయన మీడియాను కోరారు. మరో వైపు తన రాజీనామాకు డిమాండ్ వస్తున్న నేపధ్యంలో గౌడ్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
పార్లమెంట్ నుండి బయటకు వెళ్ళడానికి తాను బాబు అనుమతి తీసుకున్నానని అనడం తప్పుడు సంకేతాలను ఇస్తుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. రాజ్య సభలో ఓ పార్టీ నేతగా ఉన్న వ్యక్తి ఓటింగ్ ను సీరియస్ గా తీసుకోవకపోవడం ఏమిటని కొంత మంది నేతలు ప్రశ్నిస్తున్నారు.