Previous Page Next Page 
డెత్ ఛాంబర్ పేజి 6


    "గాభరా పడక్కర్లేదు! అదివరకు ఇద్దరం - ఇకనుంచీ ముగ్గురం"
    తనకు మతిపోయినట్లుంది.
    "రా! ముందు మీ ఇద్దరు"
    అనేసి తను బయటకెళ్ళితలుపు వేసేసింది.
    ఇంక తను మొఖవాటపడలేదు.
    గోపికారాణి మొఖం అందంగా ఉండదు. కాని చక్కని నిష్పత్తిగల శరీరం-
    దగ్గరకెళ్ళి ఆమెను కౌగిట్లోకి తీసుకుని పెదాలమీద ముద్దు పెట్టుకున్నాడు.
    ఇద్దరూ అలసిపోయాక చెప్పిందామె.
    "ఇక నుంచీ ఇక్కడ వద్దు. రాత్రుళ్ళు ఇంట్లో ఎవరూ ఉండరు! వచ్చేసెయ్".
    "మీరా వప్పుకుందా?"
    "ఇద్దరం రాజీకొచ్చాం! మీ ఇద్దరినీ ఎప్పటినుంచో గమనిస్తున్నాను. నాక్కూడానువు కావాలనిపించింది. కానీ డైరక్ట్ గా అడగటం ఇష్టంలేక కావాలని నేనే అల్లిక లేస్, ఆమె గదిలో వదిలి...."ఆ తరువాత కొద్దిరోజులకేతనూ, గోపికారాణి రాత్రి ఆమె ఇంట్లో ఉండగా ఆమె భర్త సడెన్ గా ఇంటికి వచ్చేశాడు.
    తను తలుపు తీయగానే బయటకు పరుగెత్తాడు.
    అతను గన్ తీసుకుని తనవెంట పడ్డాడు. ఆ రాత్రికి రాత్రే కట్టుబట్టలతో ఢిల్లీ వదిలి వచ్చేశాడు. అప్పటినుంచీ సెక్స్ అంటే భయం వేసింది. ప్రాణం అంటే తనకు భయం అనికాదు. ప్రాణం అలాంటి చిన్న విషయాలకు పోగొట్టుకోవటం అనవసరం. ఏదయినా ఒకమహాకార్యంలో ప్రాణం పోయినా సంతృప్తిగా ఉంటుంది.
    ఉదయం విమానం హైద్రాబాద్ చేరుకునేసరికి ఎనిమిదిన్నరయిపోయింది.
    ప్రహ్లాద్ పోలీస్ ఆఫీసర్ తోనూ సెక్యూరిటీ గార్డ్స్ తోనూ సిద్దంగా ఉన్నాడు.
    అతనిని కలుసుకోగానే మెడలో అరడజనుదండలు పడినయ్.
    అసమ్మతి వర్గం-
    తను ఫోన్ చేసిన అరడజనుమంది వచ్చారు.
    ఆఖరి దండ వేసింది ఎయిర్ కాజిల్ ప్రొప్రయిటర్ సామిరెడ్డి.
    "వెల్ కమ్ సర్! వెల్ కమ్ టు హైద్రాబాద్"
    కృష్ణ కాంత్ అసమ్మతివర్గం ఎమ్మెల్యేలవేపు కోపంగా చూశాడు.
    "ఏమిటీ హడావిడంతా? మీకేం తెలివుందాలేదా? నేను సీక్రెట్ గా కొన్ని విషయాలు కనుక్కోవాలనివస్తే మీరు అంతా పబ్లిక్ చేసేస్తున్నారు! ఎవరు చెప్పారు మీకసలు నేనొస్తున్నానని".
    వాళ్ళు భయపడ్డారు.
    "ఢిల్లీనుంచి మనాఫీస్ వాళ్ళు......"
    "చీఫ్ మినిష్టర్ శంకర్ రెడ్డికి కూడా తెలిసిందా?"
    "లేదు సార్ - మేమెవరికీ చెప్పలేదు"
    `"ప్లీజ్! దయచేసి ఒక్క పురుగుక్కూడా తెలియనీకండి! లేకపోతే ప్రధానమత్రికి నేను సంజాయిషీ చెప్పుకోవాల్సివస్తుంది!" అంతా కారు దగ్గరకు నడిచారు.
    "రండి! మా కార్లో వెళ్దాం!" అన్నాడు సామిరెడ్డి.
    "అదే బెటర్! నాన్ పొలిటికల్ కారే కావాలి నాకు"
    సామిరెడ్డి సంతోషించాడు. కార్లో తమతోపాటు సెక్యూరిటీ గార్డ్స్ కూడా కూర్చున్నారు.
    "సార్! వీళ్ళిద్దరూ తమ సెక్యూరిటీ గార్డ్స్ గా డి.ఐ.జి గారు ఏర్పాటు చేశారు" చెప్పాడు ప్రహ్లాద్.
    "ఓకే! థాంక్యూ మిస్టర్ డి.జి.పి.!"
    "నో మెన్షన్ సార్"
    కారు బయల్దేరుతూంటే మఎమ్మెల్యేలు కిటికీ దగ్గర కొచ్చారు.
    "రాత్రి ఎనిమిదింటికిరండి హోటల్ కి - ఇంకో విషయం గుర్తుంచుకోండి! మీ కొద్దిమందికి తప్పఇంకెవరకయినా నేను వచ్చిన విషయం తెలిసిందంటే మాత్రం నేను వెంటనే ఢిల్లీ వెళ్ళిపోవాల్సి వస్తుంది. దాని వల్ల నష్టం జరిగేది మీకే! లీడర్ షిప్ మార్పనేది మళ్ళీ ఎలక్షన్స్ వరకూ ఉండదిక"
    "అలాగే సార్"
    వాళ్ళ మొఖాల్లో ఆనందం కన్పించింది. కారు పదినిముషాల్లో హోటల్ ఎయిర్ కాజిల్ చేరుకుంది. తనకూ, మయూరికీ, చెరోగది ఏర్పాటు చేశారు. రాచమర్యాదలు జరుగుతున్నాయ్ హోటల్లో.
    సామిరెడ్డి తనతోపాటు బ్రేక్ ఫాస్ట్ చేయడానికొచ్చాడు రూముకి.
    "నాకు హైకమాండ్ వాళ్ళందరూ స్పష్టంగా చెప్పారు మిస్టర్ సామిరెడ్డి! ఆంద్రప్రదేశ్ లో మోస్ట్ ట్రస్టెడ్ మాన్ సామిరెడ్డి అని! అందుకని నాకు పూర్తిగా మీ హెల్ప్ కావాలి!"
    సామిరెడ్డి ఆనందంతోపొంగిపోయాడు "అంతా వాళ్ళ అభిమానం! అయామ్ లాయల్ టు దిపార్టీ! అంతే!"
    "అర్జెంటుగా నేను మోహన్రెడ్డినీ, వరదా చారినీ, గోవర్ధన్ రాజునీ కలుసుకోవాలి! వాళ్ళ ముగ్గురూ ముఖ్యమంత్రి పదవికోసం ప్రయత్నిస్తున్నారని అధిష్టానవర్గం చెప్తున్నారు. నాక్కావలసిందేమిటంటే విడివిడిగా వాళ్ళతోమాట్లాడి వాళ్ళల్లో ఒకరిని మిగతావాళ్ళంతా సపోర్ట్ చేసేట్లు చేయటం! వాళ్ళను ఒక్కొక్కరిని ఒక్కొక్క టైమ్ లో పిలిపించాలి మీరు. వీలయితే వాళ్ళను పిలిపించడానికీ, పంపించడానికీ మీ కారే ఉపయోగించండి! పబ్లిసిటీ లేకుండా వుంటుంది!"
    "అలాగే సార్"
    సామినాయుడు వెళ్ళిపోయాడు.
    వెళ్ళగానే మళ్ళీ రిసెప్షన్ నుంచి ఫోన్ చేశాడు.
    "సార్! వాళ్ళకెలా తెలిసిందో గానీ అప్పుడే మోహన్ రెడ్డి మిమ్మల్ని కలుసుకోడానికి వచ్చాడు."
    "నాకు తెలుసు - చివరికిదంతా పెద్ద మెస్ అయిపోతుంది!అలా అవకముందేనేనిక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిపోవటం ముఖ్యం! ఓకే సామిరెడ్డి ! నేను రేపటివరకూ కూడా ఉంటానో ఉండనో......త్వరత్వరగా మిగతావాళ్ళను పంపించండి!"
    ఫోన్ పెట్టేసిన పది నిమిషాల్లో డోర్ బెల్ మోగింది.
    ప్రహ్లాద్ పిస్టల్ కొంచెంగా కనబడేట్లు నడుముకి కట్టుకుని లోపలికొచ్చాడు.
    "సార్ మోహన్ రెడ్డిగారట!"
    "రమ్మను" అన్నాడు నూతన్.
    లావుగా పొడుగ్గా భీకరంగా ఉన్న వ్యక్తి లోపలికొచ్చాడు.
    "నమస్తే కృష్ణకాంత్ సాబ్!"
    అంటూ వచ్చి కరచాలనం చేసేడు.    
    "కూర్చోండి! మాధురీ! టేప్ రికార్డర్ ఆన్ చేయ్- నువ్ కూడా నోట్స్ రాసుకో!"
    "యస్సర్" అంది మయూరి.
    "చెప్పండి మోహన్ రెడ్డిగారూ! చాలా క్లుప్తంగా చెప్తేసరిపోతుంది. మీ తరపున ఎంతమంది ఎమ్మెల్యేలున్నారు? ముఖ్యమంత్రిపదవి మీకిస్తే ఇంకెంతమందిని కూడగట్టుకోగలరు? ఇప్పుడున్న కాబినెట్ లో ఎంతమందిని మీ కాబినెట్ లో ఉంచుకోగలరు? మీ సపోర్టర్స్ పేర్ల లిస్ట్ ఇప్పుడు ఇవ్వగలరా? వాళ్ళందరినీ ఇక్కడకు పిలిచి నా ఎదురుగ్గా 'విల్లింగ్ నెస్' రాసివ్వగలరా? అన్నీ చెప్పండి......"
    మోహన్ రెడ్డికి ఎంత అనుభవంవున్నా గొంతు కొంచెం వణికింది.
    వినయంగా చెప్పటం ప్రారంభించాడు.
    మచిలీపట్నం మెయిన్ రోడ్ అది. మూమూలుగానే అది సాయంత్రమయ్యేసరికి జనంతో నిండిపోతుంది. నడవడానికి కూడా ఇబ్బందికలిగించేంత రద్దీ! రిక్షాలు, కార్లు, బస్సులు......ఏవాహనమైనా సరే ఆ సమయంలో ఆ రోడ్డుమీద చీమలా నడవాల్సిందే.
    ఆ రోజు ఆ రోడ్డు మీదున్న ఓ సినిమా థియేటర్ లో ఓ సినిమా శత దినోత్సవంచేసుకుంటోంది.
    ఆ సినిమాలో నటించిన నటీనటులు ఆ రోజు ప్రదర్శనసమయంలో ప్రేక్షకులకు కనిపించి కన్నులపండుగ చేయడంజరుగుతుందని ముందుగానే పబ్లిసిటీ ఇచ్చారు.
    తమ అభిమాననటులను చూడ్డానికి ఆ చుట్టు ప్రక్కలున్న ఊళ్ళ జనమంతా తండోప తండాలుగా వచ్చి హాలుముందు మెయిన్ రోడ్ మీద కాపలా కాయసాగారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS