డబ్బు సంపాదించటం తన ముఖ్యోద్దేశ్యం.
ఒకసారి ఆ కోరిక నెరవేరితే మిగతా అన్ని విషయాలనూ దాని ద్వారానే పొందవచ్చు.
ఆఖరికి ప్రేమను కూడా!
అవును! ప్రేమనుకూడా కొనుక్కోవచ్చు.
కానీ ఇవాళ మయూరి ఎందుకో తనను రెచ్చగొట్టింది. ఆమెకు తెలీకుండానే!
"మయూరీ"
"యస్?"
"నీ బాయ్ ఫ్రెండ్ ఒకతను ఉన్నాడన్నావ్ కదూ?"
"ఔను"
"ఏం చేస్తుంటాడు?"
"చాలా చిన్న జాబ్- సనత్ నగర్ ఫాక్టరీలో-"
"మీ ఇద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారా?"
"యస్! కానీ ఇప్పుడేకాదు?"
"ఎప్పుడు మరి?"
"నా కోరిక నెరవేరాక!"
"అంటే డబ్బు సంపాదించటమా?"
"ఔను!"
"అంతవరకూ అతను వెయిట్ చేస్తాడా!"
"యస్ - నన్ను చాలా డీప్ గా లవ్ చేస్తున్నాడు."
"ఇద్దరి మధ్యా సెక్స్ వుందా?"
ఆమె సిగ్గుపడింది "అఫ్ కోర్స్!"
"నువిలా నాతో ఇక్కడకురావటం అతనికి తెలుసా?"
"తెలుసు!"
"మనిద్దరం ఇలా హోటల్లో ఒకే రూమ్ లో వుంటే అతనికి నీ మీద అనుమానంరాదా?"
ఆమె నవ్వేసింది.
"మా ఇద్దరికీ ఒకరిమీద ఒకరికి పూర్తి నమ్మకం వుంది! రెండో దేమిటంటే సెక్స్ అనేది మా దృష్టిలో పెద్ద పవిత్రంకాదు. మా పెళ్ళి ఎలాగూ ఆలస్యం అవుతుంది గనుక అంతవరకూ పరాయి స్త్రీవంక కన్నెత్తి చూడకుండా అతనూ, పరాయి పురుషుడివంకకన్నెత్తి చూడకుండా నేనూ వుండాలని ఇద్దరం అనుకోం. నిజం చెప్పాలంటే అతను వాళ్ళ ఫాక్టరీలో పనిచేసే ఒకమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. అందులో నాకు తప్పేమీ కనిపించలేదు. పెళ్ళి అయింతరువాత ఇద్దరూ సిన్సియర్ గా వుండాలని నేనేనుకుంటాను- అతనూ అదే ఫీలవుతాడు."
నూతన్ ఓ క్షణం తటపటాయించాడు.
తన కోర్కె ఆమెకు తెలియజేయాలా వద్దా అనే సంశయం......
"మయూరి"
ఆమె తలతిప్పిచూసింది.
"ఏమిటి?"
"షల్ వుయ్ మేక్ లవ్?"
ఆమె ఆశ్చర్యంగా చూసింది.
"నిజంగానా?"
"యస్"
"ఎందుకింత సడెన్ గా అలా అనిపించింది?"
"ఏమో! తెలీదు"
"ఇంతకుముందు రెండ్రోజులు తిరుపతి కాటేజ్ లో ఈ స్కీమ్ గురించి డిస్కస్ చేస్తూ గడిపాం కదా! ఆ రెండ్రోజులూ అసలు నేను ఆడదాన్ని కాదన్నట్లే ప్రవర్తించారు."
"అప్పటి టెన్షన్ వేరు! ఇప్పుడు టెన్షన్ వేరు -"
ఆమె నవ్వింది. నెమ్మదిగా అతని బెడ్ మీదకు దొర్లింది.
"యస్! అయ్ లవిట్-"
చాలా కాజువల్ గా, చాలా స్లోగా, చాలా కామ్ గా ఆమెను తనవేపు తిప్పుకున్నాడతను. ఇద్దరి పెదాలూ కల్సుకున్నాయ్. ముందు మృదువుగా, తర్వాత కోరికతో మండిపోతూ, ఆ తర్వాత ఆవేశంతో ఒకరినొకరు పిండివేయాలనేంత బలంతో.
తెల్లారేంతవరకూ అంతసేపు ప్రణయ లోకంలో విహరించాలన్న సంగతి ఇద్దరికీ తెలీదు.
"మనం ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకెళ్ళినప్పుడు కలుసుకునే వాళ్ళంకదూ? రెండోసారి కలుసుకున్నప్పుడు మీరు పలకరించి మాట్లాడారు గుర్తుందా?"
"వుంది"
"అప్పుడేగా హోటల్లో కూర్చుని మాట్లాడుకున్నాం."
"యస్! అప్పుడే అనిపించింది మీతో ఓసారి ఈ అనుభవంవుంటే బావుండునని" సిగ్గుపడుతూ చెప్పింది.
నూతన్ నవ్వాడు.
చాలామంది స్త్రీలు తనపట్ల విపరీతమయిన ఆకర్షణ కు గురిఅవటం తనకు తెలుసు.
ఢిల్లీలో మీరానాయర్ అలాగే తనకు దగ్గరయింది.
ఫ్లాట్స్ లో ఎదురుగ్గా ఇల్లు.
ఒకటి రెండు నెలలుకళ్ళ పరిచయం అయాక మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఆ తర్వాత ఇంతవేగంగా ఒకటయి పోయారు. తను పార్టీ ఆఫీసులో టైపిస్ట్ గా పని చేసేవాడు.
ఉద్యోగం మాని పగలంతా ఆమె ఫ్లాట్ లో గడపటం ప్రారంభించాడు.
ఓ రోజు ఇద్దరూ రసవత్తరమయిన ఘట్టంలో వుండగా పైన ఫ్లాట్ లో వుండేగోపికారాణి తలుపుతట్టింది. బెడ్ రూమ్ తలుపులు దగ్గరకు వేసి బట్టలు సర్దుకుని తలుపు తెరచింది మీరానాయర్.
"మరేం లేదు! నిన్న సాయంత్రం నీతో మాట్లాడుతూ నీబెడ్ రూమ్ లో అల్లిక దారం, సూదులు మర్చిపోయాను" అంటూ బెడ్ రూమ్ తలుపుతోసుకుని లోపలికొచ్చి బెడ మీద నగ్నంగా ఉన్న తనను చూసి స్టన్ అయిపోయింది.
తర్వాత సిగ్గుతో వెనక్కు పరుగెత్తుకెళ్ళిపోయింది.
మీరానాయర్ భయపడిపోయింది.
"ఇప్పుడిలా? ఈ విషయం వాళ్ళాయనకు చెపుతుందేమో?" అంది భయంగా.
"వాళ్ళాయన, మీ హజ్ బెండ్ ఫ్రెండ్సా?"
"కాదు! అయినా గానీ......"
"అలా అయితే భయమేంలేదు. ఇలాంటి విషయాలు అపరిచితులతో మాట్లాడరు"
తర్వాత వారం పదిరోజులు ఇద్దరూ కలుసుకోకుండా గడిపారు. ఇంక ఆ సంబంధం ముగిసినట్లే అనుకుంటున్న సమయంలో ఓ రోజు మీరానాయర్ తనను ఇంట్లోకి రమ్మని సైగ చేసింది. తను లోపలికెళ్ళాడు. లోపల్నుంచి బోల్టువేసిందామె.
"ఏమయినా గొడవయిందా?" అడిగాడతను.
"ఏమీలేదు. ఇద్దరం ఒక అండర్ స్టాండింగ్ కొచ్చేసరికి ఇన్ని రోజులు పట్టింది!"
"ఏమనుకున్నారు"
"ఇలారా"
బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళిందామె. మంచం మీద గోపికారాణి కూర్చుని ఉంది. తనను చూసి సిగ్గుపడి లేచి నిలబడింది.
తను కంగారుగా మీరా వేపు చూశాడు.
