Previous Page Next Page 
మల్లెలు ఎర్రగులాబీలు పేజి 45


    '..............'
    'అదేమిటి శాంతా.......! ఎంతకూ వెనుదిరిగి చూడవు..?' అని రెండడుగులు ముందుకు వేశాడు సుందరం.
    అంతలో ఒక్క ఉదుటున వెనుదిరిగిన ఆ యువతి తన కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ 'డాక్టర్! నాకు బాగా బుద్ది చెప్పారు. మీరలా చేస్తారని కలలో కూడా ఊహించలేదు' హాస్పిటలు భవనం వైపు పరుగెడుతున్నట్లుగా నడవ సాగింది ఆ యువతి.
    ఈ హటత్ పరిణామానికి నివ్వెర పోయాడు సుందరం. కాళ్ళ క్రింద భూమి గిర్రున తిరుగుతున్నట్లు , ప్రకృతి స్తంభించి పోయినట్లు తోచింది అతనికి. ఆ క్షణం లో అతని ముఖం పాలిపోయి కత్తి వాటుకు నెత్తురు చుక్క లేకుండా పోయింది. మరుక్షణం లో తేరుకున్న అతని నోటి నుండి 'నీరజ 'అన్న పేరు వెలువడింది.
    'ఇక్కడికి ఎలా వచ్చింది? ఎప్పుడు వచ్చింది? కట్టుకున్నచీరే .......కేశాలంకరణ ....పోగులు అన్నీ శాంత ధరించే వాటి లాగానే వున్నాయి. శాంత కు, నీరజ కు అసలు పరిచయమే లేదే! ఇదెలా సాధ్యం....? అచ్చం గా శాంత లాగే ముస్తాబు చేసుకుంది. అసలిప్పుడు ఎందుకు వచ్చిందో? ఎంత పొరపాటు జరిగిపోయింది. ఇప్పుడెం చెయ్యాలి?' అని ఆలోచిస్తూ నీరజ వెళ్ళిన వైపే వడివడిగా నడవ సాగాడు సుందరం.
    కోపంతో వెళ్ళిన నీరజ లక్ష్మయ్య గారి తోట దాటి వెళ్ళిపోసాగింది. ఆమె ఎటు వేడుతున్నదో ఊహించుకోలేని సుందరం వేగంగా వెళ్లి ఆమె నడ్డుకొని బ్రతిమాలుతూ హాస్పిటల్ వద్ద కు తీసుకు వచ్చాడు.
    హాస్పిటల్ ముందున్న కుర్చీలో కూర్చోమని జాలి గొలిపే చూపులతో అర్ధించాడు.
    'నేను కూర్చొను. వెళ్ళిపోతాను ----- నీరజ.
    'ఎప్పుడు వచ్చావు నీరూ? నాకు తెలియపరచి నటైతే స్టేజీ వరకు వచ్చి నిన్ను తీసుకు వచ్చి ఉండేవాడిని.'
    'తెలియజేసి వచ్చినట్లయితే మీ అసలు రంగు ఎలా బయటపడి ఉండేది? జరిగిన అవమానం చాలు. తడిగుడ్డతో నా గొంతుకోయ్యాలను చూస్తున్నారు. ఇంతకన్న మీరు నాకు చేయగల మర్యాద లేముంటాయి?'
    తనను నీరజను ఎవరైనా చూస్తారేమో నన్న భయంతో నలువైపులా చూసి తల ఒంచుకున్నాడు సుందరం. శాంత వచ్చే టైము అవుతూ ఉండడం వల్ల గాభారాతో అతనికి ముచ్చెమటలు పోశాయి.
    'శాంత వస్తుందేమో నని భయపడుతున్నారా? ఒకవేళ వచ్చినా మన యిద్దరి మధ్య గల పరిచయాన్ని గురించి చెప్పను. ఇంతకూ అశాంత ఎవరు?' పమిట తో కళ్ళు తుడుచుకుంటూ అంది నీరజ.
    సుందరం వంచిన తల ఎత్తలేదు. నీరజ కు ఏ సమాధానమూ చెప్పలేదు. అతని పరిస్థితి అయోమయంగా ఉంది. ఎటూ నిర్ణయించు కోలేక తనలో తాను మధన పడుతున్నాడు. 'నీరజ ను తిరస్కరించకూడదు. శాంత కూ, నాకూ వివాహం జరుగుతుందన్న నమ్మకం రోజు రోజూకు సన్నిగిలుతూ ఉంది. తలిదండ్రులను కాదని నాతొ వచ్చేయడానికి ససేమిరా ఒప్పుకోవడం లేదు. అటువంటప్పుడు నీరజ కు ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడేమీ చెప్పలేను. శాంత తో చివరిసారి మాట్లాడిన తర్వాత ఏదో ఒక నిర్ణయానికి వస్తాను. అంతవరకూ నీరజను మభ్య పరుస్తాను.'
    'ఏమాలోచిస్తున్నారు? జరిగిన డానికి సంజాయిషీ ఎలా చెప్పాలో నని ఆలోచనలో పదినట్లున్నారు. మీరు ఆలోచించ వలసిన అవసరం లేదు. గోడ మీద పిల్లి వాటం లా ఎటు వీలైతే అటు దూకే మనస్తత్వం గల వారని మొదటే తెలిసినట్లయితే అంత అమాయకంగా మిమ్ములను ప్రేమించి ఉండేదాన్ని కాదు. నేను, ఆ శాంత యిద్దరమేనా? లేక మరెవరైనా ఉన్నారా యింకా.....?' సుందరం ముఖంలోకి తీక్షణంగా చూస్తూ అంది నీరజ.
    'నీరూ......! ఇంకా నన్ను ఎందుకు చిత్రవధ చేస్తావు? నాది తప్పే.....! విషయమంతా శాంతకు వివరంగా చెప్పి ఆతర్వాత మనమిద్దరమూ వివాహం చేసుకుందాం.' నీరజ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ తగ్గుస్వరంతో అన్నాడు.
    'ఏ విషయం , ఏ విధంగా ఆమెకు చెబుతారు డాక్టర్! మీరిలా మోసం చేస్తారని అనుకోలేదు. అయినా యింత దాకా వచ్చాక మీ మాటలను నెవరు నమ్ముతారు? నేను యిప్పుడే వెళ్ళిపోతాను.' అని లేచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది.
    నీరజ వెళ్ళిపోకుండా ఆమెకు అడ్డు తగిలి 'నీరూ! నేను నేరం చేశానని ఒప్పుకుంటున్నాను. చేసిన నేరానికి పశ్చాత్తాప పడుతున్నాను. దయచేసి ఈరోజు, రేపు నా ఆతిధ్యం స్వీకరించి ఎల్లుండి వెళ్ళిపోవలసిందిగా అర్ధిస్తున్నాను.
    ముందుగా బెట్టు నటించి సుందరాన్ని ఎంతగానో వేదించి, బాధించి మానసికంగా హింసించి ఆ తర్వాత ఉండడానికే అంగీకరించింది.
    నీరజ ఒప్పుకోవడంతో తను ఎంతో చక్కగా నటించి ఆమెను మోసగించి ఒప్పించ గలిగానని మురిసిపోయాడు సుందరం.
    ఇద్దరినీ నటనలే!
    ఒకరిని మరొకరు నటించారు.
    నీరజను మోసగించ గలిగానని సుందరం, సుందరాన్ని మోసగించగలిగానని నీరజ, ఒకరిని గురించి వేరొకరు మనసులో సంతోష పడసాగారు.
    ఎవరికి వారు బాగా నటించామని మనసులో తృప్తి పడ్డారు. కాని ఎదుటి వారిది కూడా నటనేనని ఊహించలేక పోయారు.
    పై సంఘటన జరిగిన రెండవ రోజున సుందరం పది మైళ్ళ దూరం లో గల ఒక పల్లెకు వెళ్ళవలసి వచ్చింది. నీరజను ఒంటరిగా వదిలి వెళ్ళడం యిష్టం లేక పోయినప్పటికీ వెళ్లక తప్పలేదు.
    సుందరం తిరిగి వచ్చేసరికి సాయంత్రం నాలుగయింది. అతనికి తన గదిలో నీరజ కనుపించలేదు. ఎటు వెళ్ళిందా అని కిటికీలో నుండి తోట వైపు చూశాడు. దూరంగా ఒకగున్న మామిడి చెట్టు క్రింద ఎవరో యువతి కూర్చున్నట్లు తోచింది అతనికి. నీరజే కావచ్చునుకోని తృప్తిగా నిట్టూర్చి ప్రయాణ బడలిక వలన చెమట పట్టిన తన ముఖం కడుక్కోనెందుకై వాష్ బేసిన్ వైపు నడిచాడు.
    నీటుగా ముస్తాబైన సుందరం ఆ గున్న మామిడి చెట్టు వైపు మెల్లగా అడుగులు వేయసాగాడు.
    దగ్గరగా వెళ్లి చూశాడు. నిన్నటి మాదిరిగనే ఆ యువతి ముఖం వేరే ప్రక్కగ తిరిగి ఉంది. మళ్లీ ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందో నన్న భయంతో ఆమె వేషధారణ జాగ్రత్తగా గమనించిన సుందరం ఆమె నీరజే నని నిర్ధారణ చేసుకొని మెల్లిగా  సంభాషణ కుపక్రమించాడు. నిన్నటి రోజు ఈరోజు శాంత రాని కారణం అతని మనసును వేధిస్తూనే ఉంది. లక్ష్మయ్య గారు శాంతను బయటకు రానివ్వడం లేదేమో ననుకొన్నాడు.
    'నీరూ! ఈరోజు పొరుగూరికి వెళ్లి రావలసి వచ్చినందు వల్ల శాంతతో  మాట్లాడే అవకాశం చిక్కలేదు. రేపు తప్పకుండా మాట్లాడుతాను.'
    సమాధానం రాలేదు ---
    'నీ కోపం యింకా తగ్గలేదని నాకు తెలుసు నీరూ! కాని అనుకోకుండా ఈ అవాంతరం వచ్చి పడింది. ఈరోజు ఆ కేసును చూడడానికి వెళ్లక పోయి నట్లైతే తప్పకుండా శాంతతో మాట్లాడి ఆమె పీడ ఒదిలించుకొని ఉండేవాడని. కాని వీలుపడలేదు. రేపు తప్పకుండా శాంతతో మాట్లాడు తాను.'
    '...........'
    'ఏమిటి నీరూ......? ఇలా నాపై అలిగితే ఎలా? నేను భరించ గలనా?' ఆ యువతి భుజం పై చేయ వేసి తన వైపు త్రిప్పుకున్నాడు.
    అంతే-----
    వింటి దెబ్బతిన్న సివంగి ముఖం లో కనుపించే క్రోదావేశాలు ఆ యువతి ముఖంలో కనుపించడంతో బెదిరిపోయాడు సుందరం.
    'శాంతా! శాంతా! ' అని సన్నీ పాతరోగి లా పలవరిస్తూ బెదురు చూపులతో శాంతను చూడసాగాడు.
    'అవును. శాంతనే! నీరూ ....! నీరూ.....!' అని ఎంతో ప్రేమతో పిలుస్తున్నావు. ఎవరా నీరూ...నిప్పు? నా పీడ ఒదిలించు కొని ఆమెతో కులుకుతావా? హు .....నీవు ఎటువంటి నీచుడవు సుందరం? ఇటు నన్ను ప్రేమిస్తున్నట్లు నటిస్తూ, అటు ఆ ....నీరూ అనే అమ్మాయిని బుట్టలో వేసుకున్నావా? ఇలా మమ్ములనిద్దరినీ ఏకకాలం లో మోసగిస్తావా? అలా చేయడానికి నీకు ఎన్ని గుండెలు?' ఎరుపెక్కిన కళ్ళు, కోపం వల్ల కంపిస్తున్న పెదిమలు, పడమటి దిక్కున సంధ్యా సమయంలో కనుపించే దినకరుని ఎర్ర ధనంతో పోటీ పడుతున్న ఆమె ముఖం దీర్ఘ ఉచ్చ్వాసనిశ్వాసలతో ఎంతో వేగంగా ఎగిరెగిరి పడుతున్న ఆమె చాతీ అపర చండి ని గుర్తుకు తెస్తూ ఉంది.
    పై మాటలన్న శాంత యిక అక్కడ ఉండలేక , లేచి వేగంగా నడుస్తూ వెళ్ళిపోయింది. అంతటి కోపంతో , ఆవేశంతో వెళ్ళిపోతున్న ఆమెను ఆపి మాట్లాడడానికి సుందరానికి ధైర్యం చాలలేదు. అవమానం తో కృంగి పోతూ, తెల్లబడ్డ ముఖంతో ఆమె వెళ్ళిన వైపు నిస్సహాయంగా కూలబడి పోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS