Previous Page Next Page 
అర్పణ పేజి 40


    తప్పుకుని తప్పుకుని చివరికి ఒకరోజు తెగించాడు రాజు. ఏదో చెప్పాలని నిశ్చయించుకున్నాడు.
    నెలలూ, ఆ పైన వారాలూ గడిచాయి. పార్వతి మాట్లాడటానికి అతను కోరినటు వంటి అవకాశం దొరక్క నిశ్చయం నిశ్చయం గానే ఉండిపోయింది.
    రాజుకు తననెవరో నిలవనియ్యనట్లనిపిస్తున్నది.
    అతడు గుర్తించాడు, పార్వతిలో దైవభక్తి ఎక్కువవుతున్నది , నిజానికి అతను గుర్తించలేదు - ఆ అమ్మాయి లోని సర్వ ప్రాణాలు ఎవర్ని జపిస్తుంటాయో , ఆమె ఎవర్ని దైవం కన్నా ఎక్కువగా పూజించి అరాదిస్తుందో . కాని 'పార్వతి కి కవిత అంటే ప్రాణం ' అన్న సంగతి తెలుసు.
    ఒకసారి కవిత వస్తే అతనికి మంచినీళ్ళు అందిస్తున్నదంతా ఆ నీళ్ళన్నీ తెల్లని బట్టల మీదికి ఓంపేసి మరీ పోయింది, తిరిగి చూడకుండా.
    చూస్తుండగానే కత్తి పీట మీద పడవలసిన ప్రమాదం తప్పింది ఒకనాడు.
    మరొక  రోజూ వీధిలో కవిత గొంతు వినిపించి నట్టయింది, పార్వతికి. అంతే! తను మేడమీదున్నది , మెట్లు దిగాలి అన్న విషయం పూర్తిగా మరిచిపోయింది. ఆరోజు మెట్ల దగ్గర తను చెయ్యి పట్టుకోనట్టయితే జారి పడేదనే రాజు అనుమానం.
    పార్వతికి స్వంతాన్ని గురించిన ఆలోచన తగ్గి పోయింది క్రమంగా. నిరంతర నామస్మరణ -- కవిత! కవిత!
    రాజు ఇలా సతమత మౌతున్నాడు . రామనాధం గారు వచ్చారు రాఘవాపూర్ నుంచి. కొడుకు దగ్గర గడిపిన నాలుగు రోజులూ ఆయనకు తృప్తి నిచ్చాయి. "ఫర్వాలేదు . ఈ కుర్ర కుంకలు కాస్తంత బాధ్యత నెరిగి నడుచు కుంటున్నారు. ఈ సంగతి జానకికి చెప్తాను" అని అనుకున్నారు. రాజును పిలిచి అవసరమున్న లేకపోయినా ఏవో సూక్తులు బోధించి వెళ్ళేరు.
    అయన వెళ్ళిన తర్వాత ఒక రోజు పొద్దున్నే అయిదు గంటలకు నిద్ర లేచింది పార్వతి. స్నానం చేసింది. కొత్త అలవాటు ననుసరించి గీత చదువు కున్నది. ఆపైన ఏదో పని ఉండి మేడ మీద గదిలోకి వెళ్లి రాజును చూసి ఆశ్చర్య పోయింది.
    అతనంత వేగంగా నిద్ర లేవడు. "పార్వతీ!" అన్నాడు రాజు. ఆ పిలుపులోని ధ్వని కొత్తగా ఉంది.
     "ఏం?' అన్నది పార్వతి సంభ్రమంగా.
    "నాన్నగారు నీకు చెప్పలేదా, సెలవులకి అక్కడికి రమ్మని?"
    "నాతోనూ అన్నాడు మామయ్య. కానీ మీరు వెళ్ళండి. నేను రాను."
    "క్రిందటి వేసవి కి వెళ్ళలేదు. ఈ పది రోజుల సెలవుల్లోనైనా వెళ్లక పొతే అమ్మ కోప్పడుతుందేమో?"
    "అందుకే మీరు వెళ్ళండి తప్పకుండా. నా'కిక్కడ పన్లున్నాయి." అతన్ని చూడకుండానే చిన్నపిల్ల వాడికి చెప్పినట్టు చెప్పింది.
    కవిత దగ్గర చిన్నపిల్లలా అయిపోయే పార్వతి రాజు దగ్గర పెద్ద దానిలా మాట్లాడుతుంది.
    "నువ్వు ఒక్కదానివే ఉంటావా ఇక్కడ?" ఆశ్చర్యం ప్రకటించాడు.
    "మరేం భయం లేదు. అంతగా భయమైతే కవిత దగ్గరి కెళ్ళి పోతాను. మీరు వెళ్ళండి -- లేకపోతె ఎండలో ఎండిపోయారో , వానలో తడిసి పొతే ఎండలో ఎండి పోయారో , వానలో తడిసి పోయారో అని అత్తయ్య బెంగ పెట్టుకుంటుంది." చివరను నవ్వు దాచుకోలేక పోయింది.
    "ఎందుకు నవ్వడం? ఉద్యోగం లేదుగా-- ఇక్కడేం పనులు?"
    పార్వతి మాట్లాడలేదు. వేల్లిపోబోయే పార్వతిని ఆగమన్నాడు.
    "ఉద్యోగం చెయ్యకూడదా , పార్వతీ?' అదే అతడు ముఖ్యంగా అడగాలను కున్న ప్రశ్న.
    నవ్వి, "ణా ఉద్యోగం కోసం ఎవరూ శ్రమ పడక్కర్లేదు. ఉద్యోగం చేసి సంపాదించిన పొగడ్తలు భరించినంత వరకు చాలు!" అంది ఇకక్కడ ఆగకుండా.

                            *    *    *    *
    కాలేజీ కి సెలవులిచ్చారు. రాజు ఊరెళ్ళేప్రయత్నం మానుకున్నాడు. పార్వతి కారణమేమని అడగలేదు. ఆమెకు ఇరవై నాలుగు గంటలు కవితతోనే లోకం అయిపోతుంది.
    రాజు ప్రయాణం మాని ఉండిపోయాడే కాని అతనికి ప్రతి క్షణం లోటు గాను, మందం గాను గడుస్తున్నది. పార్వతైనా ఎప్పుడూ కవిత కవితంటూ ఇంట్లో నిలవక పోవడం చూస్తె ఒళ్ళు మండేది అప్పుడప్పుడు. ఎదుట పడితే కోపం తీర్చుకోవాలనే అనుకునే వాడు.
    తీరా సమయం చిక్కేసరికి ఏమనాలో తెలీక మాటలు వెదుక్కునెంత పనయ్యేది.
    పార్వతి అన్ని విషయాల్లో కొత్తగా కనిపిస్తున్నదతనికి . మొహంలో స్వల్పంగా వ్యక్తమయ్యే హుందాతనం తో, కొత్తగా తెచ్చి పెట్టుకున్న మృదుత్వం తో, సహజం గా ఉన్న సూటిదనం తో తన నొక ముల్లులా తీసి పారేసి నవ్వుతూ మాట్లాడే పార్వతి ని ఎలా కొప్పాడాలో, ఆమె పైని ఎలా కసి తీర్చుకోవాలో ఇన్నాళ్ళ కు రాజుకు సమస్యగా మారింది.
    కాకినాడ రోడ్లన్నీ తిరిగాడు. అన్ని రకాల ఆలోచనలతో యుద్ధం చేస్తూ తిరగడమే చేతనైంది.
    ఒక సందులో ప్రిన్సిపాల్ గారు కనిపించి అతన్ని బజారు దాకా తీసుకు పోయారు.
    "రావోయ్! మా అమ్మాయి కోసం చీరెలు కొనాలి. అలా వెళ్దాం" అంటూనే అయన ఒక పెద్ద బట్టల షాపు లోకి దారి తీశాడు. వెళ్లక పొతే బావుండదని రాజూ వెళ్ళేడు అయన వెంట లోపలికి.
    తీరా లోపలికి వెళ్ళాక , '"నువ్వేమన్నా తీసుకుంటావా? మంచి షూటింగ్స్ , శారీస్ ఉన్నాయి" అని ఆయనంటే బడులెం చెప్పాలో తోచలేదు. అప్పుడే అతని దృష్టి ఒక అందమైన చీర పై పడింది. ఒకప్పుడు అటువంటి చీరలంటే చాలా ఇష్టం పార్వతి కి. తీసుకుంటే బాగుండు ననిపించింది. యాంత్రికంగా తీసుకున్నాడు.
    అది ఆ అమ్మాయి కేలా ఇవ్వాలో ఊహించుకునే సరికి చిరు చెమటలు పట్టిపోయాయి. ఎందుకనో తను మరీ వెర్రి వాడై పోతున్నాడు అని మనసు కనిపించింది. 'ఆమె ఆడది -- ఏం చెయ్యగలదు తన దగ్గర? నిస్సారంగా మాట్లాడితే తను ఊరుకునే మనిషేనా? ఆ సంగతి తెలీదూ ఆవిడా గారికి?'
    ఆరోజు కవిత వచ్చింది. మర్నాడు పార్వతి దొరకలేదు. రెండు మూడు రోజుల దాకా మొహం చూసే తీరిక కూడా చిక్కలేదు పార్వతికి.
    మరో రోజు పార్వతి కవిత కొత్త నవల ఒకటి చదవడం ప్రారంభిస్తూ రాజు పిలుపు విని తల ఎత్తి చూసి అక్కడే పుస్తకాన్ని బల్ల మీద పెట్టి లేచింది.
    రాజు కుర్చీలో కూలబడ్డాడు. అతని దగ్గరి కెళ్ళి నిలబడి , "ఎందుకండీ?" అంది వింతగా అతన్ని పరికిస్తూ.
    "ఇది చూడు!" అన్నాడు చేతిలోని పాకేట్టును అతి సామాన్య ధోరణి లో చూపిస్తూ.
    ఆమె దాన్ని అందుకున్నాక ఆమె మొహాన్ని చూస్తూ కూర్చున్నాడు రాజు కుర్చీ లో వెనక్కు వాలి.
    "ఏమిటది?" అంది విప్పుతూ. ఆమెను ఆతని మారే మనస్తత్వం ఆశ్చర్య పెడుతుంది. తన తండ్రి, తన సరస్వతీ పోయిన దగ్గర్నుంచీ తన పట్ల ఇలా ప్రవర్తిస్తున్నాడు. అది చిత్రమనిపించింది. కాని కొన్ని నెలల నుంచి అతడి ప్రవర్తన మరీ విచిత్రంగా మారుతున్నది. ఈ ధోరణి తనకు ఏమంత బాగా లేదు. అయినా ఒక్కొక్క సారి తెలియని గర్వం ఆవహిస్తుంది.
    "చీరా? దేనికిది?' అంది గంబీరంగా.
    "నేను కట్టుకుంటాను. బావుందా?" అదోకలా నవ్వాడు రాజు. పార్వతి నవ్వలేదు.
    "ప్చ్! ఈ కలర్ కవిత కిష్టం లేదు" అంది
    "కవిత కిష్టం లేకపోతె ఇప్పుడేవరిక్కావాలి? నీ కిష్టం కాదా?"
    "మా కవిత కిష్టం లేనివి నాకూ ఇష్టం ఉండవు" అంది ఎటో చూస్తూ.
    "అదంతా నీ భ్రమే! మొదట కవిత నీకు తెలుసా?"
    "పోనీ, భ్రమే అయినా నిజమనుకుంటాను. ముందీ చీర వాపసిచ్చి-- రెండు సాదా చీరలు తీసుకుంటే పనికొస్తాయి -- " వెళ్ళబోయింది పార్వతి.
    "పార్వతీ! నువ్వీ చీర కట్టుకోవాలి" అన్నాడు రాజు. అది అజ్ఞా కాదు, అర్ధింపూ కాదు. అతని మొహం లో ఏ భావం కనిపించలేదు పార్వతికి.
    ఆగి, "ఎందుకని?' అంది అతన్నే చూస్తూ.
    "ఎంతో శ్రమ పడి తెచ్చాను గనుక."
    "బజార్లో కనిపిస్తే తేవడం కూడా శ్రమేనా? అయినా నాకు నచ్చలేదు మరి."
    "నాకు నచ్చింది. అందుకే కట్టుకోమని కోరడం."
    "అదేదో శాస్త్రం చెప్పినట్టుంది. నేనేం పతివ్రతని కానే, పతి కోసం పాట్లు పడడానికి? పైగా నాకు పొగరు కూడాను" అంది నవ్వుతూ.
    "ఎలా ణా మాట వినవో చూడమంటావా?" అన్నాడు ఈసారి రాజు ఠీవిగానే.
    "నా సంగతి మీకు తెలుసు. ఆ భగవంతుడు దిగినా సరే -- నా కిష్టం లేని పనిని నా చేత ఎవరూ చేయించలేరు" అంది పెంకితనం గా నవ్వి వెళ్లి పోతూ.
    రాజుకు కోపం రాలేదు. కాని, ఒక లాటి బాధ కలిగింది. ఆమె అంత తేలిగ్గా చూస్తుంటే తనెలా నిగ్రహించుకో గలుగుతున్నాడో అతనికే అర్ధం కావడం లేదు ఈ మధ్య.

                                 36
    కిటికీ లో నుంచి చల్లని గాలులు వచ్చి పార్వతి ముంగురుల్ని మృదువుగా తాకుతున్నాయి.
    టేబిల్ ముందు కూచొని ఏదో వ్రాస్తూ మధ్య మధ్య కిటికీ లో నుంచి వినీలాకాశం లోని మేఘ సముదాయాన్ని భావా వేగంతో చూస్తున్నది.
    హటాత్తుగా వచ్చి కళ్ళు మూసేశా రెవరో చేతుల స్పర్శ వల్ల కవిత కాదని తెలుసుకుంది. కాని ఎవరో గుర్తుంచలేకపోయింది పార్వతి. ఎందుకంటె ఇద్దరు ముగ్గురు స్నేహితురాళ్ళు . ఏర్పడ్డారు. అందులో ఎవరో?
    చేతులు వదిలేసి, "ఇంతమాత్రం గుర్తించలేని స్నేహితురాల్ని సంపాదించుకున్నాను." అంది బుంగమూతి పెట్టి సరోజ.
    "సరూ!" అని హడావుడి పడిపోయింది పార్వతి. "ఎప్పుడొచ్చావు ? ఏమిటీ డాక్టర్ సరోజా దేవీ!" అంటూ సరోజను సోఫాలో కూలవేసి, రాజుకు చెప్పటానికి పరుగెత్తింది.
    "ఇదేం అవస్థ!" అంటూ కూచుని దిక్కులు చూచింది సరోజ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS