Previous Page Next Page 
అర్పణ పేజి 39


                                  34
    "కవితా! కవితా! ఎక్కడా? త్వరగా రమ్మంటే...."
    "అబ్బబ్బ! కాస్త అగవమ్మాయ్! ఉరుకులూ పరుగులే ఎప్పుడూ అయితే భరించలేను నిన్ను."
    "నే నాగితే టైం అగుతుందేమిటి?"
    'ఆగుతుందనే అనుకుంటాం. అవసరాన్ని బట్టి."
    క్లబ్ లో దసరా ఉత్సవాలు ఆర్బాటంగా చేస్తున్నారు. సెక్రటరీ పద్మావతి కి ఊపిరి అందడం లేదు.
    ప్రసిద్ద గాయనీ మణిని పిలిపించడం ఒక పెద్ద ఏర్పాటు.
    మాధురమైన సంగీతం ఉత్తేజాన్ని పుట్టిస్తుంది. శ్రుతి విహితమైన గానాన్ని, అందులో నిబిడీకృతమైన భక్తీ భావాల్నీ పార్వతి అనుభవించి మనస్పూర్తిగా అభినందించు కుంది. ఐనా కవిత పక్కనుంటే నిశ్చలంగా కూచోలేడు. ఆ పిల్లతో చైతన్యం స్రవించి ఉరకలేస్తుంది.
    గాయని జయదేవుని అష్టపది ఎత్తుకునే సరికి ఆ ఉద్రేకం మరీ అధికమైంది.
    "ఎంత బాగా పాడుతుంది , కవితా! గానం, గానానికి తగ్గ గళం అదృష్టం అంటారు కదూ?'
    "అవును."
    "ఆవిడతో మాట్లాడాలనుకుంది."
    "పరిచయం చేస్తాను. ముందు సంగీతం అవనియ్యి."
    "ఆ! నీకు తెలుసా , ఈ పాడుతున్నావిడ?"
    కవిత చిరునవ్వు నవ్వింది. "తెలియకేం? మా రచయితలకు అందరూ తెలిసినట్టే ఉంటారు. ఎక్కడో చూసినట్టు. ఎప్పుడో మాట్లాడి నట్టు-- అలా."
    "ఇక నుంచి నేమన్నా ఎవర్ని చూసినా -- ఎక్కడో అగుపించినట్టు -- మరెప్పుడో తెలిసి ఉన్నట్టు అనుకుంటాన్లే !" పార్వతి నవ్వుతూ అంది.
    "నువ్వు నన్నే తెలుసుకోలేవు -- ఇంకా పైవాళ్ళ గురించి నీకేం తెలుస్తుంది?" అన్నది కవిత.
    "అదేం కాదు" అంది పార్వతి మొండిగా.
    ఇంతలో పార్వతి కనురెప్పలు హటాత్తుగా నిలబడిపోయాయి. ఎదుటి బెంచీ వరసల్లో ఒక చోట ఎవర్నో చూసి కవిత కు మరి కాస్త దగ్గరగా జరిగింది.
    "కవితా! చూడు -- కుడి వైపు -- తెల్ల చీర కట్టు కుందే-- చూశావా? ఆ అమ్మాయికి చాలా గర్వం , ఎందుకో గాని! నాతొ చదువుకుంది. పైగా ఏం గొప్ప అనడమూ కాదు."
    "ఎవరి అందాలు వాళ్ళవి!" అన్నది కవిత నిర్లిప్తంగా.
    "ఏమో-- నీకే కనిపించాలి ఆవిడా గారి అందం. నన్నయితే మా సరోజ 'లైట్ ఆఫ్ ది వరల్డ్' అనేది.' కొంటెగా నవ్వింది పార్వతి.
    "నేను చెప్పేది ఇప్పట్లో నీకర్ధం కాదేమో? కొందరి కొందరి అందాలు కొన్ని కొన్ని సమయాల్లో ప్రస్పుటమవుతాయి కళ్ళకి. మిట్ట మధ్యాహ్నం చెమటలు కారుస్తూ కొందరు అందంగా కనిపిస్తారు నాకు."
    "భలే! బాగుంది కానీ నీ సానుభూతి పొందిన ఆ పుణ్య వతికి అంత తెలివి తేటలూ లేవు. వీళ్ళ అమ్మ ఎటువంటిదట, తెలుసా?"
    "సరే, వింటాగాని నువ్వు కాస్త దూరం జరగాలి" అంది కవిత విసుక్కుని.
    పార్వతి తెల్లబోయి ఇంచుమించు కవిత మీద వాలిపోయి ఉన్నదంతా సరిగ్గా కూర్చుంది.
    కవిత నవ్వేసింది.
    "మరేం కాదు. ఈ లిప్ స్టిక్ చూస్తె మహా ప్రమాదంగా కనిపిస్తోంది. నీ పెదాల మీదైతే కొంచెం చేరిగినా ఫరవాలేద--తంటా అంతా నా బుగ్గల కొస్తుంది పిల్లా!"
    "అలా అనకపోతే -- రాసుకోవడం మానెయ్యమని చెప్పకూడదూ?" అంది పార్వతి.
    "నాకోసం మానేస్తావా?
    "తప్పక."
    "అయితే మరో బాధ కూడా చెప్పుకోలేక ఇన్నాళ్ళూ ఆగాను. నువ్వు పరుగెత్తి వచ్చి ణా పక్కన కూచున్నప్పుడంతా ఈ జడలు ఉన్నాయే-- చెడ్డ ఇబ్బంది పెట్టేస్తున్నాయి."
    కవిత పక్కను కూర్చున్న మరో అమ్మాయి ఫక్కున నవ్వింది.
    పార్వతి నవ్వుతూ, "కత్తిరించేయ్యమంటావా? చిన్నప్పుడు మా బావలనే వాడులే మాటిమాటికి" అంది.
    "అంత పనిచేయ్యకు. కాస్త ఒక్క జేడ వేసుకుంటే ధన్యురాల్ని."
    "నీకంత ఇబ్బందిగా ఉందని నాకు తెలీదే! ఇక నేప్పుడైనా నీ కిష్టం లేనట్టు నేను కనిపిస్తే ఒట్టు--"
    కవిత నిర్ఘాంత పోయింది ఒక క్షణం ఆ పిల్ల ప్రేమకు.

                             *    *    *    *
    ప్రేమ అనేది పాతాళ గంగ లాంటిది. అది హృదయంలో అనేకమైన కట్టుదిట్టా ల్లో ఉంటుంది. హృదయాన్ని చీల్చుకుని ఉప్పెనై పొంగడమే ప్రారంభించిందంటే దాన్ని ఆపడం ఎవరి శక్యమూ కాదు. ఉరకలేసే నిర్ఘరి ఎవరి మీదకు జల్లులుగా జాలువారు తుందో ఎవరికి వారే గ్రహించలేరు. యవ్వన ప్రారంభంలోనో , యవ్వన మద్యం లోనో ఈ ప్రేమ వాహిని అంతర్యపు లోతుల్లోంచి ప్రవహిస్తూ స్త్రీ ని ప్రేమమయిగా మార్చగల అవకాశం ఉంది. పురుషుడైతే యవ్వన మద్యం నుంచి చివరి వరకు ప్రకృతి పరిశీలకుడు గానో , విశ్వశక్తి కి ఉపాసకుడుగానో నిలిచిపోతాడు. అటువంటి ప్రేమకు గాని , ఇటువంటి ఆరాధనకు గాని అర్ధంగా , ఆధారంగా నిలబడి అందుకునే వారి అదృష్టం అనుపమానం.
    ఒకసారేప్పుడో ప్రేమను గురించి అడిగిన పార్వతికి సరిగ్గా ఇటువంటి సమాధానమే చెప్పింది కవిత. నాలుగు రోజుల కోక్కసారైనా పార్వతి వింత ప్రశ్నలకు జవాబులు చెప్పే గడు సమస్య తప్పడం లేదు కవితకు.
    "కవితా! కవితా! నువ్వు లేకుండా నేను బ్రతకలేను" అంది పార్వతి ఉన్నట్టుండి.
    "ఇంకా ఉన్నాను కదా!" కవిత సిద్దంగా ఉన్నట్టు జవాబు చెప్పింది.
    "అబ్బ! ణా తప్పులే ఎంచుతావ్. నిజంగానే నువ్వు దగ్గర లేకుండా నేను బ్రతకలేను, కవితా!"
    "తప్పు! బ్రతకలేనూ అనకోకూడదు."
    "ఎందుకనకూడదు? నా యిష్టం!"
    "సరే. ఆ మాట ణా దగ్గరనకుండా నీ ఆత్మీయుల దగ్గర అను-- అప్పుడు తెలుస్తుంది."
    "నాకు అత్మీయులేవరున్నారు? ఆ ప్రపంచంలో నువ్వోకతేవే."
    "ఆగాగు....మీ అత్తమామ లేమయ్యారు? ఇంకా ఎవరెవరో ఉన్నారన్నావే?"
    "వాళ్ళంతా వేరు. నిన్ను మించిన ఆత్మీయురాలు...." పార్వతి మాట సగంలోనే ఆగిపోయింది.
    "ముఖ్యంగా మీ అయన సంగతో? అది చెప్పు" అంది కవిత సూటిగానే.
    "ఆయనా లేదు, ఈయనా లేదు -- అందరూ ఒకటే. ఎవర్నీ నమ్మలేకపోతున్నాను నిన్ను తప్ప."
    "అయితే అసలు లోపం నీలో ఉంది!" కవిత అనేసింది పోల్చినట్టు.
    పార్వతి పౌరుషం రెచ్చింది. "అదేం కాదు. రాజు నన్ను ద్వేషిస్తారు. అభిమానం కొద్దిగా నన్నా లేనిచోట ఆత్మీయత ఎక్కడి నుంచి రాగలదో ఊహించు. రచయిత్రి వి కదా?"
    "ద్వేషంలో అంతర్లీనమై ప్రేమ ఉంటుంది, పారూ! దగ్గరౌతున్న ప్రేమని సహించలేక పోవడం తప్ప ద్వేషానికి ఇంకొక నిర్వచనం లేదు. ద్వేషాన్ని ప్రేమామృతం తో చల్లబరుస్తుంటే , పెరుగు చిలికితే వెన్న వచ్చినట్టు శాంతి సౌఖ్యాలు దొరుకుతాయి." ఉపన్యాస ధోరణి లో చెప్పింది కవిత.
    "నువ్వెలా చెప్పినా సరే -- ద్వేషం కూడా నీకు ప్రేమలా తోస్తుందేమో గాని , నాకు -- ఉహు -- అలా అనిపించదు. ఆ ప్రేమామృతాన్ని నువ్వే నాకిస్తే చాలు!"
    "అంతే! ఇక ఇప్పుడు నువ్వర్ధం చేసుకోలేవు" అన్నది కవిత వాదానికి ముగింపుగా.
    
                                  35
    ఒకానొక రోజు పార్వతి ని చూచి దిగ్భ్ర మించి పోయాడు రాజు. 'పార్వతేనా ?' అనుకుని నమ్మలేకపోయాడు , బాహ్య రూపం చూసి. హృదయ పరిణామాల్లాగా పై పై మార్పులు కంటికి కనిపించనివి కావు. పార్వతి దేవతలా కనిపించింది.

                                      
    అతను స్త్రీ లో ఒక విధమైన నిరాడంబరత్వాన్ని కోరతాడు. ఆ విధంగా కనిపించిన వాళ్ళంతా అతనికి దేవతలే. కవిత అంటే అందుకే మంచి అభిప్రాయం ఏర్పడ్డది అతని మనసులో అంతే కాని కొందరు ఎంత నిరపెక్షకులుగా , ఎంత నిర్లిప్తులుగా కనిపిస్తారో లోపల అంత విషాన్ని దాచుకుంటారన్న సంగతీ, అటువంటి వాటికీ మనిషి బాహ్య అడంబరాలకూ సంబంధం అంతగా ఉండదన్న సంగతీ అతనికి తెలుసునో , తెలియదో? రాజు ఇల్లాంటి విషయాల్లో అమాయకుడు అయినా అంతకు మించి పట్టుదల, మొండితనం ఉన్నవాడు. అవి చూసి అందరూ హడిలి పోవలసిందే.
    ఆలోచనా పరుడౌతున్న రాజుకు పార్వతి అలా కనిపించడం ఇష్టమే అయినా ఎందుకో కష్టం కలిగించింది. చిత్రమైన బాధ మొదలైంది. తనవల్లె పార్వతి ఇలా తన అభిరుచులన్నీ చంపుకొని విరక్తు రాలై పోతుందేమోనని బాధపడ్డాడు.
    రోజులు గడుస్తున్న కొద్దీ రాజు కిల్లాటి అస్తవ్యస్తమైన వేదన వదలటం లేదు. పార్వతి జీవితం నిరాశ పెంచుకున్తున్నదన్న ఆందోళనే పట్టుకుంది అతన్ని. తిరిగి ఎలా ఆమెతో ఉత్తేజాన్ని పుట్టించాలనే ఆలోచన లీలామాత్రంగా మసలుతున్నది అంతరాంతరాలో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS