
17
విశాల యెంత మాత్రం యిది వరకున్న విశాల కాదు.తరచి తరచి చూసే తత్వం ఆమెలో అబ్బింది. విద్య యీ కత్తికి పదును పెట్టింది. ఆమె యెలాంటి వాదన నైనా ఖండించి వెయ్య గలుగుతోంది. ఓ డాక్టరు బదులు లాయరైతే బాగుండేదనుకున్నాడు. చల్లని ఆహ్లాదాన్నిచ్చే గాలి కాస్సేపు తగిలాక మనసులు కొంత శాంతించాయ్. విశాల కాస్త దగ్గరగా జరిగి కూర్చుంది.
'ఎన్నాళ్ళు శలవు?'
'నెల రోజులు.'
'ఇక్కేడేన్నాళ్ళు ఉంటారు?'
"రేపు మా వూరేల్తున్నా"
'మళ్లీ యెప్పుడోస్తారు?'
'ఏమో చెప్పలేను.'
'వస్తారని ఆశతో వుండవచ్చా?'
'వద్దు. ఆశతో యెదురు చూస్తె ఒకప్పుడు రాలేక పొతే బాధపడ్తావ్'
'నన్ను యెందుకిలా శిక్షిస్తారు? మీ కోపం భరించడానికెనా నేను పుట్టాను? అనురాగం చవి చూడటానికి కాదా?'
ఇంత వేగిరం విశాల యిలా ప్రశ్నిస్తుందని అనుకోని సూర్యం తడబడ్డాడు.
'చెప్పండి. ఆడదాన్ని-- సిగ్గు విడిచి బయట పడ్డాను.'
'నీకు చదువు ముఖ్యం.'
'నాకేండుకా చదువు? మీ డబ్బు ఖర్చు కాకపోతే చదివే ధ్యాస వున్న వాళ్ళేవరి కైనా చదివించండి. నాకు చదువు మీద లేదు. వేదాంతం మీద అంతకంటే లేదు. నాకు తృప్తిగా బ్రతకాలని వుంది. అ తృప్తి నేను వలసి వలపించుకున్న వానితో బ్రతకటం వలన వస్తుంది. అతనితో కలసి కష్ట సుఖాలు అనుభవించుకున్నప్పుడు వస్తుంది.
'నివ్వో డాక్టర్ అవ్వాలి. అనాధుల సేవ చెయ్యాలి.'
'నేను డాక్టర్ అయినా ఆ పని యీ పరిస్థితుల్లో చెయ్యలేను. నాకూ ధైర్యం, సాహసం, కీర్తి, ఆశ , అనురాగం, గర్వం కనికరం, కరుణ, త్యాగం, సహనంతో వుండాలని వుంది. ఇవన్నీ నా ఇల్లు , నా భర్త, నా పిల్లలు వున్నప్పుడే పొంద గలుగుతాను.'
అప్పటికి జవాబు చెప్పని సూర్యం భుజం పై చెయ్యి వేసి కన్నీరుతో.
'మళ్లీ చిగిర్చాను. ఈ చిగుళ్లు తెంపేకండి.'
రాయిలా సూర్యం మాట్లాడలేదు.
'నాకు తెలుసు -- మీ గురించి నాకు బాగా తెలుసు-- నాకేంకేవరి గురించీ తెలీదండి....ఇంకెంత కాలం నన్నిలా బాధపడమంటారు? నన్నిలా పరీక్ష చేస్తూ కూర్చుంటారు?'
'నన్నేం చెయ్యమంటావ్?'
'పాత మారితే గానీ క్రొత్త రుచించదు. పాతను పట్టుకుని క్రొత్తకు భయపడకండి.'
'నాకా భయం?'
'అవును. మీకు సంఘం అంటే భయం. ఆ భయంతో నా పై నున్న ప్రేమను మీ హృదయం లో గోరీ కట్టారు. రోజూ కన్నీరు ఆ గోరీ పై రాల్చు తున్నారు.
'ఆ తప్పెవరిది?'
'నాదా చెప్పండి?'
'ఎవరిదీ కాదు. నన్ను పుట్టించిన దేవునిది?'

'ఆత్మ జ్ఞానం కలవారు దేవుడ్నేందుకు దూషిస్తారు? ఒకరిని దూషించటం వలన మనిషి ముందు కెలా పోతాడు? మిమ్మల్ని యిలా నిలదీసి అడుగుతున్నానని దూషణ క్రింద తీసుకో కండి. మీ పై నున్న స్వతంత్రం కొద్దీ యిలా సిగ్గు విడిచి అడుగుతున్నాను. ఇన్ని నిష్టూరాలు ఆడుతున్నాను. ఎంత కాలమో బాధలు అనుభవించాను. ఇక అనుభవించ లేను. ఈ నా రూపు రేఖలు గాలిలో యింకెంత కాలమో కదల్లేవు. సంఘం విసరిన బాణాలతో ఈ రెక్కలు తెగిన పావురాన్ని మీ ఉద్యానవనం లో వాలనియ్యండి. మీ అనురాగం ప్రేమతో మళ్ళీ బాగా కోలుకుంటాను.'
'అదెలా అవుతుంది విశాలా? లోకం హర్షించదు.'
'నేను లోకం కోసం కాదు మీకోసం పుట్టాను. మీరెందుకు జబ్బు పడ్డారో నాకు తెలుసు, మీరెందుకు బాధ పడుతున్నారో నాకు తెలుసు. మీరు యెవరి నైనా మరిచి పోగాలిగారు గానీ నన్ను మరువలేక పోతున్నారు. మీరు ఆత్మ జ్ఞానంతో సన్యాసి యైనా నన్ను మరువలేరు. నిజం చెప్పండి....'
సూర్యం జవాబు చెప్పక పొతే ఆమె అతనిని కుదుపుతూ 'మాట్లాడరేం?' అప్పటికి జవాబు చెప్పని వానితో విశాల నిష్టూరంగా -----
'మాట్లాడే ధైర్యమైనా మీలో లేదా?'
సూర్యం ముఖం త్రిప్పాడు. అతని త్రుణీకారంతో ఆమె ఆవేశ పరురాలైంది.
'నాకు తెలుసు. మిమ్మల్ని మొదటి నుంచీ తెలుసు. మీ చంచల మైన మనస్సు ను బ్రహ్మదేవుడైనా మార్చలేడు. మీకో నిర్ణయం చేసుకోవటం చాతకాదు. మీకు వెన్నముక లేదు. మీరో మూడ నమ్మకాల గుత్తు. పాత చింతకాయ పచ్చడి మీరు. ఎవరో అన్నట్లు యెముకలు కుళ్ళిన మనిషి మీరు. ఆలోచన లోనూ, ఆచరణలోనూ మీరు ముసలి వారై పోయారు.
'సరా! వస్తాను' అంటూ చప్పున పౌరుషంతో సూర్యం లేచి గబగబ వెళ్లి పోయాడు. మైలు , రెండు మైళ్ళు తలెత్త కుండా వడిగా నడిచి పోయాడు. ఒళ్ళంతా కుతకుత వుడికి పోతోంది. పౌరుషం శరీరమంతా ఆక్రమించి మెదడును పని చెయ్యించలేదు. మెదడే పౌరుషం లో మునిగి పోయింది. తొలిసారి యెవరో పిల్చినట్లు అనిపించి తలెత్తాడు. రోడ్డు మీద ఎలక్ర్తిక్ దీపం కాంతి క్రింద ఒక చక్కని చుక్క మెరసి పోతోంది. ఆమె ఘుమ ఘుమ సెంటు వాసనలతో, గాడీ రంగు నైలాన్ చీరతో అతి పల్చని జాకెట్టు నించి ఆడదాని అందమైన భాగాలను నిర్లక్ష్యంగా వదిలేస్తూ ఆహ్వానించింది. ఒకసారి వికారంగా ఆమె వేపు చూసి కదిలి పోతుంటే ఆమె నిర్మొహమాటంగా ఒక మోటు పదం వదలగానే తను మగవాడా కాదా అన్న ఆలోచన ఒకసారి మెదడులో మెరసింది.
'నన్ను దాటి కడలిన మగాడు లేడు.
అలా కదలిన వాడు మగాడు కాదు'- మళ్లీ ఆమె యిలా అన్నట్లు వినిపించింది. నిజానికి తను కదల లేక కదిలాడు. అతనిలో అణచి పెట్టిన వాంఛలు ఆమె సవాలుతో ప్రజ్వరిల్లాయ్. తుచ్చమైన కోరిక పౌరుషాన్ని చంపి వేసింది. చిన్నవాడు పాలకోసం ఎగబ్రాకి అది వయసు వచ్చాక పొంద లేదన్న నిస్పృహ అంతర్గతం లో నిల్చి పోయింది. మళ్లీ ఆ కోరిక యౌవ్వనం లో యింకో విధంగా బయలు పడ్తుంది.
ఈ కోరిక బయట పడటానికి కారణం యీ పని చేసి తను తల్లీ తండ్రికీ దూరం కాననే తలుపే! తిరిగి వెళ్ళాడు. ఆమె నవ్వింది.
'రా బాబూ' అంది.
సూర్యం కదల్లేదు. కోరికతో పాటు మనసులో ధర్మా ధర్మ విచక్షణ సాగుతోంది. ఆమె దగ్గరగా వచ్చి--
'ఎప్పుడూ సారాతాగని మనిషిలా! ఆడదాని దగ్గరకు చేరని వాడిలా! నిన్నేం పాడు చెయ్యను. నిన్ను సుఖ పెట్తాను -- బ్రతుకుతాను. ఆడదానికి అంతకంటే ఏం చేత నౌతుంది బాబూ?'
ఆ చివరి మాటలు సూర్యం కు యెంతో నచ్చాయ్. అతని జాతకం లో శుక్రుడు ఆరింటనున్నాడెమో? వెంట పడ్డాడు. ఆమె అతని ఒంటికి రాపాడాలని ప్రయత్నిస్తుంటే అతను ప్రక్కకు జరిగేవాడు. చిన్న పాక నులక మంచం-- చూడగానే శెట్టి జ్ఞాపకం వచ్చాడు. ఆసుపత్రి నాలుగు మంచాలు కళ్ళకు కట్టాయ్. శ్రీనివాస్ యెదుట నిల్చున్నట్లయింది. చివరి క్షణాల్లో అతని కోరిక చెవులను చిల్లులు చేసాయ్. 'ఈసరికీ విశాల నీ తృనీకారంతో సముద్రాన వుంటుంది. నా చివరి కోర్కెని తీర్చలేని మనిషివి? అవును-- నీ అనుమానం నాకు తెలుసు. నీకు త్రాగడానికి మంచి నీరే కావాలి. ఆ మంచి నీరు ఒకప్పుడు బురద నీరు, చెత్తా చెదారంతో నిండి వుంది. అదీ ప్రవహిస్తూ మంచి నీరైంది. నీవు తెంపిన పువ్వు పై అప్పుడే యెన్నో తుమ్మెదలు వ్రాలీ ఉంటాయ్. నవ్వు పవిత్రం అనుకున్నవన్నీ ఒకప్పుడు ఏదో ఒక సాలులో అపవిత్రమైనవే! నువ్వనుకున్న పాల బంగారం ధూళి నించి బయటకు వచ్చింది. నువ్వు మాత్రం -- కంపు నించే బయట పడలేదా? నీ శరీరంలో నిండి వున్నదంతా యేమిటి? నువ్వు జబ్బు పడితే గానీ నీ కంపు నీకు తెలీదు. నీలోటు యేమీ లేదని పౌరుషంతో పరుగెత్తుకొచ్చావు. నీ కళ్ళను నిన్ను చూడగలవా? ఎదుటి వారి కళ్ళు నీ కళ్ళను చూసి యెర్రబడిందో సరిగ్గా వుందో చెప్పాలి. చీకటి వెలుగులే జీవితం. విశాల చీకటి లో వుంది. నువ్వు కాస్త వెలుగు కిరణం ప్రసరింపచెయ్యాలి. ఆమె వెలుగులో చిగురిస్తుంది. మహా వృక్షమౌతుంది. ఆమెకు కళంకం అపాదిస్తున్నావ్. నువ్వూ ఆమె ప్రేమికుడవని నాకు తెలుసా? నీతో అబద్దం చెప్పడానికి. నీ గురించే ఆమె నానా కష్టాలు పడింది. నీకోసం బ్రతకాలనే నన్ను కట్టుకుని పూటకో తిండితో బ్రతికింది. నా అభిమానం, కోరికలు నన్ను క్రూరుడ్ని చేసి చెయ్యి చేసుకున్నా నీ కోసమే భరించింది. నీకోసమే ఆడది చెయ్యగలత్యాగాన్నంతా చేసింది. నీకోసమే బ్రతికింది. అలాంటిది దానిని తూలనాడావు? నువ్వు మానవుడవా? దానవుడవా? తుచ్చ కోరికతో యీ బజారు మనిషిని పొంద గలిగిన వాడివి ఆమెను ఆదరించలేవా? ఆదరిస్తానని కాస్త ఆగమని హామీ యైనా యివ్వ లేకపోయావా? అనవసరంగా నీ అనుమానాలతో ఒక ఆశతో వున్న ప్రాణి బలవంతం చావుకు కారణ మౌతావా?'
ఇవన్నీ శ్రీనివాస్ కాదు తనలో ఆత్మ శ్రీనివాస్ రూపం దాల్చి ప్రశ్నిస్తోంది. నిజంగా ఆత్మ జ్ఞానం యీ క్షణాన్నీ అతనికి కలిగింది. 'పోతాను విశాలను తప్పక పెళ్లి చేసుకుంటానని చెప్తాను. మా చెల్లెలు తమ్ముళ్ళ పెళ్ళిళ్ళ వరకూ యిలగానే వుందామంటాను. తరువాత తప్పక ఒకటిగా ఉందాం అంటాను. చేసిన తప్పుకు పశ్చాత్తాపపడ్తాను. అవును విశాల లేకుండా నేను బ్రతకలేను. క్షణికమైన వుద్రేకాలే నన్ను నిజాన్ని ఆలోచించకుండా చేసాయ్. జీవితం లో తప్పటడుగులు వెయ్యించాయ్ .'
ఆమె మళ్లీ పౌడరు ఒత్తుకుంది. పరుపు మీద కొత్తదుప్పటి పరచింది. వాసనకు ఊదువత్తి వెలిగించింది. పాన్పు పై మల్లె పూలు విరజల్లింది.
'ఇదంతా యెందుకు?'
'ఎవరికీ యిలా చెయ్యలేదు-- ఇప్పటికి మీ ఒక్కరికే !'
'ఇంద' అంటూ పర్సు లో నించి పది రూపాయల కాగితం తీసాడు.
'మీ డబ్బు నాకొద్దు-- మీరు కావాలి'
'క్షమించు నువ్వు నాకు గురువులా అగపడ్డావు.'
'గురువంటారెంటి బాబూ'
