Previous Page Next Page 
డెత్ ఛాంబర్ పేజి 37


    ఒక గ్లాస్ విస్కీ పావుగంటలో పూర్తి చేసేసింది. ఆ తర్వాత కొద్ది నిముషాలకే ఆమె ప్రవర్తనలో మార్పువచ్చేసింది. పైటజారిపోయింది. కళ్ళల్లో మత్తు వెలిగిపోతోంది.
    "సురేష్! నాకు తెలుసు.....నీకు కావలసింది నేనని! కమాన్! యూ డిజర్ మీ!" అంటూ బెడ్ మీదవాలి చేతులు జాపింది.
    సురేష్ ఇంక ఆలస్యం చేయలేదు ఎంతో పదిలంగా జీవితాంతం భద్రపరచుకోవాల్సిన అనుభూతి.
    ఆమె కౌగిట్లో కొదిగి ఆహ్వానిస్తున్నట్లు విచ్చుకున్న పెదాలమీదముద్దు పెట్టుకున్నాడు.
    "భారతదేశంలో అమిత ధనవంతురాళ్ళయినపదిమంది స్త్రీలు" అన్న ఆర్టికల్ చదువుతున్నాడు నూతన్.
    తొమ్మిదిమంది వ్యాపారరంగంలోనూ, పారిశ్రామికరంగంలోనూ వున్నారు.
    ఒకే ఒక్క స్త్రీ సినీరంగంలో ఉంది.
    ఆమె పేరు చంద్రిక - ఫేమస్ సినీ స్టార్!
    ఆమె గురించి ఆసక్తిగా వివరాలు చదివాడతను.
    వయసు నలభై - పెళ్లి కాలేదు -ఒంటరిది!
    ఆమె ఆస్తి షుమారు పది కోట్లువుంటుందని అంచనా!
    ప్రస్తుతం హైద్రాబాద్ లో బంజారాహిల్స్ లో స్వంత భవనంలో ఉంటోంది. ప్రస్తుతం ఆమె సినిమాల్లో నటించడం తగ్గినా, సోషల్ యాక్టివిటీస్ తో చాలా బిజీగా ఉంటోంది.
    నూతన్ కి ఆమె వివరాలు కుతూహలం కల్గించినయ్. తన నెక్స్ట్ ప్లాన్ కి ఆమె అనువుగా ఉన్నట్లనిపించసాగింది. వారం రోజుల్లో ఆమెకు సంబంధించిన వివరాలు మొత్తం సేకరించాడు.
    ఆమె అంతకుముందు ఇద్దరు నటులతో భార్యగా మసిలింది. తర్వాత ఇద్దరినీ వదిలేసి అప్పుడప్పుడు తనకునచ్చిన యువకులతో సంబంధం పెట్టుకుంటూంటుంది.
    ఆమె ఆస్తి బాంక్ వ్యవహారాలూ అన్నీ చార్టర్డ్ ఎకౌంటెంట్స్ 'రమేష్ అండ్ కంపెనీ' యజమాని రమేష్ చూస్తున్నాడు.
    ఆమెకు రమేష్ మీద పూర్తినమ్మకం వుంది.
    అతను ఆమె డబ్బుని షేర్స్ లో ఇన్వెస్ట్ చేయించడం, ఆస్తులు కొనటం, లాభానికి అమ్మటంలాంటి లావాదేవీలక్కూడా వినియోగిస్తూండేవాడు.
    అతని సలహాలవల్ల తన ఆస్తి చాలావరకూ పెరిగిపోవటం ఆమెకు అతనిమీద నమ్మకాన్ని మరింత పెంచింది.
    ప్రస్తుతం డబ్బు విషయంలో అతని సలహాలేందే ఏ పనీ చేయటంలేదు. ఆమె నమ్మే రెండో వ్యక్తి డాక్టర్ సరోజిని!
    ఆ వివరాలు నూతన్ కి సంతృప్తి కలిగించినయ్.
    ఆమె డబ్బులో కొంతభాగాన్ని ఎలాగోలా తను కైవసం చేసుకోవాలి.
    ఈసారి డాక్టర్ సరోజిని గురించీ, రమేష్ గురించీ వివరాలు సేకరించాడతను.
    రమేష్ కి అమ్మాయిల వీక్ నెస్ ఉంది. వాళ్ళ ఆఫీసులోనే పనిమనిషిగా వున్న లలితతో సంబంధం వుంది. కాబరే ఆర్టిస్ట్ లంటే అతనికి మోజు ఎక్కువ! తరచుగా వాళ్ళకోసం డబ్బు అమితంగా ఖర్చుచేసి ఎంగేజ్ చేసుకుంటూంటాడు.
    డాక్టర్ సరోజిని డ్రగ్ ఎడిక్ట్! రోజూ రాత్రిడ్రగ్స్ తీసుకోవటం ఆమెకి అలవాటు! ఆమె ప్రాక్టీస్ చాలావరకూ తగ్గిపోయింది. అయినా ఆస్తి ఎక్కువే ఉండడంతో ఆమె ఆ విషయం పట్టించుకోలేదు.
    తన డిస్పెన్సరీ క్లోజ్ చేసి హైద్రాబాద్ లోని ఓ సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్లో గైనకాలజీ డిపార్ట్ మెంట్ ఇన్ ఛార్జి అయింది.
    ఆమెకు నెలకు నలభయ్ వేలు జీతం.
    రమేష్ కీ, డాక్టర్ సరోజినికీ ఉన్న బలహీనతల ఆధారంగా వాళ్ళ ద్వారా చంద్రిక ఇంట్లో ప్రవేశించడానికి ప్లాన్ తయారుచేయసాగాడు నూతన్.
    మరో పదిరోజులు పట్టిందా కార్యక్రమం.
    ఆ ప్లాను పదేపదే చదువుకోవటం అందులో ఏమయినా అసంభవం అనిపిస్తే అది కొట్టేసి తేలిగ్గా అమలుపరచగల మరో ఉపాయం ఆలోచించటం...తర్వాత చివరకు ఓ ప్లాన్ ఫైనలైజ్ అయింది.
    ఫ్యూన్ ఓ కవర్ తెచ్చి అందించాడు రమేష్ కి.
    "ఎవరో ఒకమ్మాయి వచ్చింది సార్! ఉద్యోగం కోసం అప్లికేషన్ ఇచ్చింది"
    "ఇప్పుడేమీ ఉద్యోగాలు లేవని చెప్పు "అనేసి వేరేపని చేసుకోబోతూ "ఆగాగు! ఒక్క నిముషం" అంటూ ఫ్యూన్ ని ఆపాడు. 'అమ్మాయి' అనేసరికి అతనిలో వీక్ నెస్ పనిచేయటం ప్రారంభించింది.
    వయసెంత వుందోచూడాలనిపించింది. కవర్ తెరచి అప్లికేషన్ కాగితం బయటకులాగాడు.
    కుడిచేతివేపున ఉంది మయూరి కలర్ ఫోటో-
    అతను స్టన్ అయిపోయాడు.
    ఫోటో జెనిక్ ఫేస్ కావడంతో ఆమె అందంగా, మరెంతో ఎట్రాక్టివ్ గా కనబడుతోంది. ఒక్కసారిగా అతని శరీరం వేడెక్కింది. తను చూసిన  కాబరే ఆర్టిస్ట్ లేం పని చేస్తారు ఈ అమ్మాయి ముందు.
    "ఈ అమ్మాయేనా వచ్చింది" ఆతృతగా అడిగాడు.
    "ఔన్సార్ -"
    "లోపలకు పంపించు"
    "అలాగే సార్ -"
    రమేష్ మరోసారి ఆ ఫోటోవేపు చూశాడు. చూస్తూన్న కొద్దీ ఆమెలో ఆకర్షణ పెరిగిపోతోంది.
    "ఎలాగయినా సరే ఈ అమ్మాయిని అనుభవించాలి" కసిగా అనుకున్నాడతను.
    మయూరి గదిలోకి అడుగు పెట్టింది. ఆమెను చూస్తూనే కళ్ళప్పగించే శాడతను. ఫోటోలో కంటే ఎన్నోరెట్లు అందంగా వున్నట్లు కనబడుతోంది. తనింత వరకూ చూసిన అమ్మాయిలు అందంగాగానీలేకపోతే సెక్సీగా గానీ వుండేవారు. మొట్టమొదటిసారిగా ఆ రెండింటి కాంబినేషన్ ఈ అమ్మాయిలో వుంది.
    "గుడ్ మార్నింగ్ సర్! అయామ్ మయూరి!" హంసలా నడుస్తూ టేబుల్ దగ్గరి కొచ్చిందామె.
    "గుడ్ మార్నింగ్ రండి" పూర్తిగా లొంగిపోయాడతను.
    ఆమె కుర్చీలో కూర్చుని ఓసారి గదంతా చూసింది.
    "అయామ్ బాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ ఎ జాబ్! మీ ఆఫీసులో ఏమయినా వేకెన్సీలుంటే....." అతని కళ్ళలోకి సూటిగా చూసిందామె.
    ఆ చూపులు పూల చెండుల్లా తగిలి చక్కలిగిలి పెడుతున్నాయతనికి.
    "ఓ తప్పకుండా! ఇన్ ఫాక్ట్.... రైట్ నౌ -ఓ వేకెన్సీ వుంది! ఎప్పుడు జాయినవుతారు?"
    "మీరెప్పుడంటే అప్పుడే! చెప్పానుకదా! చాలా ఆర్ధికమైన ప్రాబ్లెమ్స్ తో ఉన్నాను."
    "సరే - ఇన్ దట్ కేస్- రేపే జాయిన్ కండి!"
    "థాంక్యూ వెరీమచ్" అంటుండగానే ఆమె పైటజారిపోయింది.
    ఆ దృశ్యం తనివితీరా చూస్తూ గుటకలు మింగసాగాడతను.
    "మరి జీతం ఎంతిస్తారో చెప్తే?"
    "నీకెంత కావాలంటే అంత" అందామనుకున్నాడతను.
    కానీ తన తాపత్రయం తెలిసి పోతుంది.
    "కిందటిసారి ఎక్కడ చేశారు మీరు?" తనను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు.
    "చాలా ప్రయివేట్ కంపెనీల్లో -"
    "అక్కడ జీతం ఎంతిచ్చేవారు?"
    "రెండువేలు"
    "నేను రెండువేల ఐదువందలిస్తాను."
    మయూరి నమ్మలేనట్లు చూసింది.
    "థాంక్యూ వెరీమచ్" కవ్వింపుగా ఓ నవ్వు నవ్వింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS