ఆయన జేబులోని వందరూపాయల నోటు తీసి ఆమెకిచ్చాడు.
"రైట్...రైట్..." అంది నూరురూపాయల నోటుని గుప్పెట్లో మూస్తూ.
మేము ముందుకు అడుగువేయడం మా వెనక గడిపడిపోవడం ఒకేసారి జరిగిపోయాయి.
"శివా - లోపల గొళ్ళెం పెట్టుకో" బయటనుంచి ఎవరో పెద్దగా అరిచారు.
ఆయన కంగారుగా వెళ్ళి గొళ్ళెం పెట్టారు.
అప్పుడు చూసాను ఆయన్ను.
ముఖమంతా చెమటలు పట్టేశాయి. మనిషి కూడా సన్నగా వణుకుతున్నట్లని పించింది.
కాని అదేమీ గమనించనట్టే తల వంచుకున్నాను.
ఆయన నేరుగా వెళ్లి మంచం మీద కూర్చున్నాడు.
నన్ను పిలుస్తాడేమోనని కొంతసేపు చూసాను. కానీ ఆయన పిలవలేదు.
కాసేపు అలానే వుండి ఆ తర్వాత మెల్లగా కదిలి ఆయన దగ్గరగా వెళ్లి నిలుచున్నాను.
ఆయన నన్ను చూసి పేలవంగా నవ్వారు. మమ్మల్ని గదిలోకి తోస్తూ బయటివాళ్ళు ఆయన్ని కంగారు పెట్టేసారు. అందుకే అలా అయిపోయారనుకున్నాను. నేను పక్కగా కూర్చుని "మీవూరు, మీ యిల్లు బావున్నాయండీ - నాకు బాగా నచ్చాయి" అన్నాను. ఆయన మౌనంగా వుండిపోయాడు.
"వాడికంటే మీరు మరింత నచ్చారు. ఆ మీసాలు తీసేస్తే అచ్చు ఆడపిల్లలా వుంటారు" అని చిన్నగా నవ్వాను.
ఈసారి ఆయన బలవంతంగా పెదవులను విప్పదీసారు.
"నేను మీకు నచ్చానా?"
తల ఆడించాడు.
"మీ బంధువులు నామీద ఏం కామెంట్ చేశారు?"
ఆయన దగ్గర్నుంచి ఏమీ సమాధానం రాలేదు.
ఆయన ముఖంలోకి చూస్తూ "మాట్లాడరేమిటి?" అంటూ రెట్టించాను.
ఆయనలో భయం స్పష్టంగా కనిపిస్తోంది.
"ఏమైంది? అలా వున్నారేమిటి?"
"కొద్దిగా తలనొప్పిగా వుంది మహితా" అదీ ఆయన మొదటిసారి నన్ను పేరుతో పిలిచింది. ఏదో ఆనందపు వీచిక అలా నా రక్తాన్ని స్పృశిస్తూ వెళ్ళినట్లనిపించింది.
"విక్స్ ఏమైనా రాయనా?"
"వద్దు కాసేపటికి అదే సర్దుకుంటుంది"
ఆయనకీ తలనొప్పిగా వున్నప్పుడు ఏం మాట్లాడను? అందుకే మౌనంగా వుండిపోయాను.
ఇక కూర్చోవడం వీలు కాదనిపించి, ఆయన పక్కగా పడుకున్నాను. సంఘం వేసిన మంత్రంతో అన్నిరోజులూ ముడుచుకుని గుండెల్లో పడుకుండిపోయిన కోరికలన్నీ ఒక్కసారిగా నిద్ర లేచాయి. వెచ్చటి ఆవిర్లు శరీరంలోకి పుట్టుకొస్తున్నాయి. ఎద పొంగుతోంది. ఎక్కడెక్కడో ఏదో తెలియని సంచలనం నాకు మాత్రమే తెలుస్తోంది.
"ఛీ ఛీ! పాడు తలనొప్పి" నాలో నేనే అనుకున్నాను.
ఆయనకు అభిముఖంగా వున్న నేను ఈసారి ఆయనవేపు తిరిగాను. ఆయన అటువేపు తిరిగి పడుకుని వుండడంతో వీపు కనిపిస్తోంది. మెల్లగా జరిగాను. నాగుండెల్ని ఒక్కసారిగా గుచ్చాను. జైపూర్ రాజామందిరం ముందున్న గువ్వలు ఒక్కసారిగా పైకిలేచినట్లయింది.
ఏదో ఏమరుపాటుగా వేసినట్లు కుడిచేతిని ఆయనమీద వేశాను. అప్పుడు నా స్థనాలు మరింత ముందుకు ఉరికాయి. ఆ ఒత్తిడితో కోరికంతా పగిలి నాశరీరమంతా చుట్టుకున్నట్లయింది.
ఏదో కావాలన్న ఆరాటం నన్ను మరింత ముందుకు తోస్తోంది. ఆయన ఇటు తిరుగుతారనుకున్నాను గానీ తిరగలేదు.
అలానే ఓ పదినిముషాల పాటు వుండిపోయాను. అలా నిశ్శబ్దంగా వుండడం చేతకావడం లేదు. అంత క్లోజ్ గా భర్త పక్కన పడుకుని ఊరకుండడం సాధ్యమయ్యే పనికాదు.
తల్లోని మల్లెపూల దండ వెంట్రుకల బంధం నుంచి తప్పించుకుని ఎదమీదపడి నాభర్త చేయాల్సిన పని అది చేస్తోంది. నా శరీరమే పెద్ద అగ్నిగుండంగా కాలిపోతోంది. చివరికి బొడ్డులోంచి సైతం వేడి ఆవిర్లు పుట్టుకొస్తున్నాయి.
చేతిని మరింత బిగించాను.
"తలనొప్పి పోయిందా?"
"లేదు మరింత ఎక్కువయింది."
ఆ మాటలతో నామీద చన్నీళ్ళు కుమ్మరించినట్లయింది. ఎక్కడి అవయవాలు అక్కడ గప్ చిప్ అయిపోయాయి. అలానే కళ్ళు మూసుకున్నాను.
"ఏదో కారణంవల్ల మొదటిరోజు శోభనం జరగకపోతే చాలామంచిది. మళ్ళెప్పుడు మొగుడు మనల్ని వదిలిపోడు" ఎప్పుడో మా పిన్ని ఎవరితోనో అన్న మాటలు గుర్తొచ్చాయి. తొలిరేయి చప్పగా చల్లారితే ఎలా మంచిదో నాకు తెలియదు కానీ అలాంటివాటి నన్నిటినీ లాజిక్ తో చీల్చి చెండాడ కూడదు నమ్మకమే వాటి ప్రాతిపదిక.
"అయితే నాకూ మంచే జరుగుతుంది" అనుకుంటూ నిద్రలోకి జారిపోయాను.
కోళ్ళు కూసేప్పుడు మెలకువ వచ్చింది. పక్కన చూస్తే ఆయన లేరు. పడక మీద నుంచి లేచి పెరట్లోకి వచ్చాను. మా అత్తమ్మ కళ్ళు సరిగా కనబడకపోయినా పొయ్యి రగలెయ్యడానికి నానా తంటాలు పడుతోంది. జడ విప్పుకుంటూ కూర్చుండిపోయాను.
కాసేపటికి బంధువులమ్మాయిలు నిద్రలేచి నా దగ్గరికి వచ్చారు.
భాను నా పక్కగా కూర్చుంటూ "రాత్రి అదిరిందా.... శరీరం కాదు అనుభవం" అనడిగింది. చిన్నగా నవ్వాను.
ఆమెది మా యిల్లు తరువాతి యిల్లు ముఫ్ఫైకి లోపే వుంటాయి.
"మల్లెపూలు వాడలేదు - చీర నలగలేదు - ఏమిటి కథ?"
నేను ఏమీ మాట్లాడలేదు.
"నీ వాలకం చూస్తుంటే ఏమీ కానట్లుంది విశ్వరూప సందర్సనం తరువాత అర్జునుడి కళ్ళు మెరిశాయంట. అలా నీ కళ్ళు మెరవడంలేదే"
"ఊరుకో అక్కా"
"నేను ఊరుకుంటే వూరు ఊరుకోదే ఆరాలు తీస్తుంది. ఇంతకీ ఏమీ జరగలేదా?"
చుట్టూ వున్న ఇద్దరు ముగ్గురు ఆతృతతో నా సమాధానం కోసం చూస్తున్నారు.
"తలనొప్పి"
"శివరామ్ కా - నీకా?"
"ఆయనకే"
"విక్స్ పూయకపోయావా?"
