భయంకరమైన కాళరాత్రి, మృత్యు నిశ్శబ్దానికి , కాళరాత్రి కీ, ఉదృత వర్షానికీ ఏదో దగ్గర సంబంధం ఉంది.
అందరూ నిద్రపోయినా రాజుకు ఆ రాత్రి చాలాసేపు నిద్ర రాలేదు. పక్క మీద చేరగిలి కిటికీ లోంచి లోపలికి చూశాడు. పార్వతి పడుకున్న మంచం కనిపిస్తున్న దక్కడికి.
అలసట కు వేగంగా నిద్రపోయింది ఆ పిల్ల. జాలి వంటి ఏదో పరిణామానుభవం రాజు నిలువెల్లా వ్యాపించింది ఒక క్షణం.
ఆ రోజు పొద్దున రాజు స్కూలు టై మింకా కాలేదని అలా బజార్లో కి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి సుభద్ర గారు ఇంట్లో కనిపిస్తే ఆశ్చర్యపోయాడు.
ఆవిడ టెలిగ్రాం చూపించి, "నువ్వు కూడా వెంటనే వెళ్ళు, రాజూ! పార్వతి ఒంటరిగా వెళ్ళిందనే భయంగా ఉంది" అన్నది.
అతను దీపస్తంభం లా నిలబడి పోయి ఏమీ తోచక చుట్టూ చూశాడు. లచ్చీ తాళం అతనికి ఇచ్చేస్తూ, పార్వతి వార్తా వినగానే ఎలా పడిపోయిందో కళ్ళతో చూసినట్టే చెప్పింది. నేల మీద గాజుల ముక్కలు కనిపించాయి అతనికి.
తిన్నగా స్కూలుకు వెళ్లి సెలవు పెట్టాడు. నేరుగా టాక్సీ మాట్లాడుకుని బయలుదేరి వచ్చేశాడు.
క్షణాల్లో, నిమిషాల్లో జరిగినదంతా గుర్తు వచ్చి రాజు రెండు నిమిషాలు సొమ్మసిల్లి నిద్రపోతున్న పార్వతి వైపే చూసి, ఆ వెనక సరిగ్గా పడుకుని నిద్రపోయాడు.
* * * *
తెల్లవారింది. ఉలిక్కిపడుతూ లేచి కూర్చుంది పార్వతి.
ఆమెకు ఒక కల వచ్చింది. త్రిమూర్తులు అతి పవిత్రమైన ఆకాశం లో వరసగా నిలబడి తన నాశీర్వదిస్తున్నారు అదీ కల.
"నాన్న పోయాడు కదా? ఇక ఈ ఆశీస్సులకు అర్ధమేమిటి?' తర్కించుకుంటూ కిటికీ తలుపులు తెరిఛి ఆకాశంలోకి చూచింది. అక్కడి నీలిమ అంతా నీటి రూపం లో కరిగి పోతున్నట్టు వర్ష ధారల మధ్య ఆకసం తెల్లవారి అగుపించింది. ప్రళయ శబ్దాన్ని భీకరంగా చేస్తున్న వర్షానికి కప్పలు పాడుతున్న ఆహ్వాన గీతిక మనుషులను బెదర గొడుతున్నది. ఆ ఉదయం ఎందరికి శుబోదయమో కానీ-- ఆ ఇంట్లో మెలకువ వచ్చిన వ్యక్తుల్లో తిరిగి దుఖోదయమైంది.
తన అక్కలు, జానకమ్మ నిద్రపోతున్న గది వైపుగా వెళ్ళింది పార్వతి. సరస్వతి కళా శూన్యమైన ముఖం గుర్తు వస్తుంటే పార్వతి గుండె కరుణతో నీరై పోతున్నది.
లక్ష్మీ -- రాత్రి సరైన నిద్ర లేక కాబోలు-- పక్క అంతా వదిలి నేల మీద పడుకుని నిద్రపోతున్నది . జానకమ్మ కూడా నిద్రలో ఉంది. కానీ, సరస్వతి ?
పార్వతి ఆ పక్క గదిలో చూచింది. అక్కడా కనిపించలేదు. గుండె లోక్కసారి గుబిల్లు మన్నాయి.
సరస్వతి పక్క వైపు చూచే ధైర్యం లేకపోయింది. కురుస్తున్న వర్షం లోనే పెరడంతా తిరిగి వచ్చింది.
ఎక్కడా లేదు సరస్వతి. అక్కా! అని అంతరాళానికి దూసుకుపోయేటట్టు పిలవాలనిపించింది పార్వతికి. వెంటనే ఆవేగాన్ని అణుచుకుంటూ వచ్చి సరస్వతి పడుకున్న చోట తలగడ ఎత్తి చూచింది.
ఆమె ఊహించింది దొరికింది-- ఒక కాగితం ముక్క. దాన్ని పూర్తిగా చదవ కుండానే పార్వతి ఒక్క అరుపు అరిచింది. ఆ కాగితం రెపరెపలు పార్వతి హృదయం మీద సుత్తి దేబ్బలైనాయి. ఒక్కొక్క సుత్తి దెబ్బకు ప్రతిధ్వని గా అక్కా! అక్కా! అనే పిలుపులు లోనుండి పుట్టి లోపలే అణిగి పోతున్నాయి.
పార్వతి పిలుపుతో అదిరిపడి లేచిన లక్ష్మీ , జానకమ్మా-- పార్వతి నీ, ఆమె చేతిలో కాగితాన్నీ చూచి గుండెలు బాదుకున్నారు.
ఏడుపులు విని కాస్త మందలిద్దామని వచ్చిన రామనాధం గారూ, ఆయన్ను వెన్నంటి వచ్చిన రాజు ఆ దృశ్యం చూసి స్థంభించిపోయారు. తెలివి లేనట్టు బిగ్గరగా ఏడుస్తున్న లక్ష్మీ తెలివి తప్పిపోయిన పార్వతి -- ఇద్దరినీ చూచి గుండె లవిసి పోయాయి. ఏడుస్తూనే పార్వతి కి తెలివి తెప్పించ ప్రయత్నిస్తున్న జానకమ్మ కాగితాన్ని వాళ్ళ కందించింది.
ఉత్తరం చదివిన మరుక్షణం లోనే రామనాధం గారు దాన్ని రాజు చేతిలో పెట్టి పంచెతో కళ్ళు ఒత్తుకుంటూ వీధి కేసి నడిచారు తొందరగా తడబడే కాళ్ళతో.
రాజు చూచాడా ఉత్తరాన్ని.
"పార్వతికి -------
ణా పార్వతి! నేను కూడా చచ్చిపోయానని నువ్వు దిగులు పెట్టుకోకమ్మా! నాన్నతో పాటు గానే నాకీ భూమ్మీద ఋణం తీరిపోయిందని పించింది. అయన సేవ కోసమే నేనీ లోకంలో పుట్టాను. నీ జీవితం భారత ధర్మానుసారంగా సాగుతున్నది. అందుచేత ఆ విలువైన బతుకును నిష్పలం చేసుకోకు. నేను బావిలో పడిపోతున్నాను. నిన్ను విడిచిపోయానని బెంగపెట్టు కోకే , పారూ! చచ్చిపోయి నీ కంటి కగుపించక పోయినా, నీ అక్క నీదగ్గరే ఉంటుంది.
నీ ప్రియమైన అక్క
సరస్వతి."
రాజు కళ్ళు బైర్లు కమ్మాయి. వ్యధా పూరితమైన నిట్టుర్పు గుండెలు చీల్చుకు వచ్చింది.
ఈలోగా తెలివి వచ్చిన పార్వతి చెంగున లేచి పెరట్లో కి పరుగెత్తింది. జానకమ్మ గోల పెట్టేసింది. ఆందోళన తో బరువెక్కిన గుండెతో రాజు కూడా పార్వతి వెంటే వెళ్ళాడు.
వర్షం సన్నగా పడుతూనే ఉంది. ఇంటి వెనక కొద్ది దూరంలో ఉన్న బావి చుట్టూ జనం మూగారు. పల్లెటూరి ఈతగాళ్ళు ఇద్దరు ముగ్గురు పార్వతి శవాన్ని తీసి ఇవతల పడేశారు.
అందరూ ఆ వర్షం లోనే నిలబడి కళ్ళనీరు కరుస్తున్నారు.
ఎక్కడ చూసినా నీరు. ఆఖరికి హృదయాలు కూడా నీరై పోతుంటే నీటి అవసర మీకెందుకు మనిషికి? బతకడానికి భగవంతుడేర్పరిచిన పరికరాలను చావడానికి ఉపయోగించు కుంటున్నారు కొందరు.
` చీరను వెనక్కు విరిచి కట్టుకుని నూతిలోకి దూకింది కాబోలు సరస్వతి -- పై బట్టలు చెక్కు చెదరలేదు . పార్వతి ఆ కళేబరం మీద పడి కొంతసేపి ఏడ్చింది. కానీ, మరి కాస్సేపటికి పిచ్చెత్తి నట్టయింది. మెదడు మొద్దుబారి కన్నీటి కి ఆనకట్ట కట్టింది.
సరస్వతి పచ్చని పాదాలూ, అరి చేతులూ తడుముతూ, ఏ సుఖానికీ నోచుకోని ఆ అమాయకపు ముఖాన్ని చూస్తూ సచేతన విగ్రహం లా శూన్య మనస్కగా కూచున్న పార్వతి ని చూచాడు రాజు.
నీళ్ళు పైకి ఉండటం , నూతి లోపలికి మెట్లు ఉండటం -- దూకినప్పుడు శబ్దం వినిపించక పోవడానికి కారణాలని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
దుఃఖ మేఘాన్వితమై కళ తప్పిపోయిన పార్వతి వదనాన్ని చూడలేకపోయాడు రాజు, వికలమైన మనసుతో.
క్రియలన్నీ అయ్యాయి. మనస్సు లూ గట్టి పడిపోయాయి.
అందరూ కొద్దికొద్దిగా మరుపున పడుతున్నారు. పార్వతి దుఃఖం లోలోపల పచ్చిగా ఉంది. ఒక క్షణ కాలమైనా నిష్శాభ్దాన్ని భరించలేక పోతున్నది. ఏ విషాద ఘోర వార్త అయినా భీకరంగా వినిపిస్తున్నది. ఉన్నట్టుండి శరీరం అణువణువులో కాగే నీటి వాగులు ప్రవహిస్తున్నాయి.
సరస్వతి తాలూకు పెట్టె తెరిచి చూచింది పార్వతి. అందులో పైనే కృష్ణుని చిత్రం ఒకటి కనిపించి ముగ్ధురాలై చేతిలోకి తీసుకోబోయింది ఆ పిల్ల. నిర్మల శాంతి వీచికలు హృదయానికి చల్లగా తాగిలాయి మళ్ళీ. కానీ, ఆ చిత్రంతో పాటే వచ్చి జారిపడిన కవరు చూసి దిగ్బ్రాంతు రాలై పోయింది.

సరస్వతి చేతి వ్రాతతో దాని పైన 'పార్వతికి ' అని పెద్ద అక్షరాలు స్పష్టంగా కనిపించాయి.
చప్పున తలుపులు వేసి, కవరు చించి ద్రవించి, స్రవించి పోతున్న హృదయంతోనే చదవసాగిందా అమ్మాయి ఆ లేఖను.
"పార్వతీ!
నేను ఒక విషయాన్ని నీకు వ్రాస్తున్నానే, పారూ! నువ్వేవరినీ తప్పు దృష్టితో చూచి ఎట్టేదట తప్పు లెంచవు. అందుకే నీ దగ్గర ఎటువంటి విషయాన్ని గురించి మాట్లాడ టానికైనా నాకు చెప్పలేనంత ధైర్యం.
నువ్వు రాధాకృష్ణ ను గురించి వ్రాసిన నాటి నుంచి నీ ఉద్ద్రేశానికి నేను లొంగి పోయాను. అదే నీ అభిప్రాయ మై ఉంటుందని అనుకున్నాను. రాధాకృష్ణ ను పెళ్లి చేసుకోవాలని కోరిక కూడా కలిగింది. అప్పుడు తెలిసింది నాకు -- మనిషి కోరికలకు అడ్డూ, అపూ ఉండదని. నువ్వతని సుగుణాలూ, ఆదర్శాలూ ప్రత్యేకంగా ణా మనసుకు తెచ్చినప్పుడు నాకు తెలియకుండానే ఆనందించేదాన్ని. తర్వాత -- అనుకోకూడని వన్నీ అనుకుంటున్నానెమో అని నన్ను నేను నిందించు కున్నాను. ఏ పాప ఫలమో -- ఈ జన్మకు సంపూర్ణత సిద్దించలేదు. స్త్రీ ధర్మ విరుద్దంగా నాలో కలుగుతున్న ఆలోచనల వల్ల ణా గతి ఏమోతుందో అని దిగులు పీడించింది అన్ని వేళలా.
ఏమైనా సరే -- నాన్న ఉంటె అయన ఒప్పుకుంటే రాధాకృష్ణ ను పెళ్లి చేసుకుందును. నాకు జన్మ నిచ్చిన తండ్రి అంగీకారం లేకుండా ఇటువంటి పని చెయ్యడానికి నాకు సాహసం లేదే, పార్వతీ!ఏం చెయ్యను ? నాది పిరికి గుండె. ఏదో భీతి అహర్నిశలూ వేధించింది నన్ను. నాన్న పోయాక ణా ప్రాణం ఎందుకూ పనికిరాని దనిపించింది. తెలియరాని వ్యాకులాన్ని అనుభవించాను రోజంతా.
నేను శాశ్వతంగా వెళ్ళిపోయే ముందు రాధాకృష్ణ గారికి ఈ మాటలు చెప్పమన్నానని చెప్పు. అయన మళ్ళీ పెళ్లి చేసుకోవడమే ఉత్తమం. భవిష్యత్తు లోనే అతడు అనుభవించవలసిన దేంతో ఉంది. పునర్వివాహ పద్దతిలో స్త్రీ పురుషులకు భేదం ఉంది. స్త్రీ తన ఇష్టాన్ని అనుసరించి తిరిగి పెళ్లి చేసుకోవచ్చు. పురుషుడు యువకుడై ఉండి భార్యను కోల్పోతే , తప్పక పునర్వివాహం చేసుకుని జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి. ఆ అధికారమూ, హక్కూ మొదటి నుంచి మగవాడికి ఉన్నాయి సంఘంలో. ఎందుకేర్పడినా అందులో కొంత తెలివరితనం లేకపోలేదు. రాధాకృష్ణ గారు తిరిగి పెళ్లి చేసుకుంటే ఎక్కడ ఉన్నా ణా ఆత్మ సంతోషిస్తుందని చెప్పు. ణా కోసం విచారించ కుండా అతని మనసు మరలించే భారం నీదే.
నీ అక్క
సరస్వతి.
