Previous Page Next Page 
నాలుగు మంచాలు పేజి 34


    అని సూర్యం మళ్లీ గదిలోనికి వెళ్లి పోయాడు. మైలు దూరం లో చిన్న హాలు వుంది. అక్కడకు తరచూ పాత సినిమాలు వస్తుంటాయ్. యీ భోజనాలు ఆయె సరికి యేనిమిదైనది. ఆ రాత్రి మీద రెండో ఆటకు తాలేనంది. ఆఖరికి వంట పుట్టి, రామం బయలు దేరారు. వాళ్లు వెళ్లేసరికి డ్రాయింగు రూములో ఎదురెదురు సోఫాల్లో సూర్యం, విశాల కూర్చొని వున్నారు. మనిషో మేగజేన్ తిరగ వేస్తున్నారు. వాళ్ళేమీ చదవటం లేదు. ఏమీ చూడటం లేదు. త్రిప్పిన పేజీలే మళ్ళీ త్రిప్పుతున్నారు. సూర్యం ఒకసారి లేచి ఆమె యేమి చేస్తుందో నని వెళ్ళిపోతూ ఆగి వెనక నించి చూసాడు. ఇంగ్లీషు మేగజేన్ లో ఒకచక్కని యింట్లో డ్రాయింగు రూము అలంకరణ . తివాసీ ల గురించి ఎడ్వర్ట్ యిజ్ మెంటు , తన గదిలోనికి వెళ్ళినా యెంతో సేపు వుండలేక తిరిగి డ్రాయింగ్ రూమ్ లోనికే వచ్చాడు. ఉండి ఉండి ఒకసారి మేగజన్ దించి ఆమె వేపు చూస్తున్నాడు. ఆ ప్రశాంతమైన వాతావరణం లో అమెసంమ్మోహనంగా వుంది. ఈ అందాలు చిలికే హర్యం లోనికి మేషాల చాటు నించి మెరుపు కన్నె దిగివచ్చి నట్లుంది. ఆమె వెన్నెలలు వెదజల్లే అందం అతని శరీరాన్ని పులకరింపజేస్తోంది. నిండు వెన్నెల్లో ఆకాశం వేపు చూస్తూ విహరించే ప్రేమికునిలా ఉన్నాడు. ఒకసారి లేచి బయట వరండా లోనికి వెళ్లి నిల్చున్నాడు. విరబూసిన పూల మొక్కల తోట వెన్నెల వెలుగులో వయ్యారంగా వెలిగి పోతోంది. జవ్వని నవ్వే పెదిమల్లా పూలు కదులుతూ మకరం దాన్ని వూరిస్తున్నాయి. తుమ్మెద లు నిద్ర పోతున్నాయని గాలి సంతోషంతో ఆవేశపడి పూలను తాకుతూ కదుపుతూ వీస్తోంది. ఆకారం లేని ఆత్మ లాంటి గాలుల తాకిడి తో ఆకారం వున్న పూలకు సమ్మంధమేమిటి? ఆకారం గల తుమ్మెదల అనురాగంతో పాడే ఝుంకారం ఆ పూలను పులకరింపజేస్తుంది. అందమైన ఆకారంతో ఉన్న విశాలకు తన ఆత్మతో ఏం పని-- తన శరీరంతో నే వుంది, వలపు పండనిది శరీరం పులరించదు. పులకరించని దేహాలు అమృతాన్ని సృష్టించ లేవు.
    విశాల గది నుంచి బయటకు వస్తే యెంత బావుడ్ను అనిపించింది. తను పిలవాలని కామోసు వేచి వుంది. తను పిలిస్తే వేరే అర్ధాలను సృష్టించ వచ్చు. ఏమిటో ఆమె గురించి తలచు కున్నప్పుడల్లా రెండు కళ్ళు అగుపిస్తూనే ఉంటాయ్. జన్మజన్మాల మిత్రుని కళ్ళు తన వెంటనే వున్నాయ్. ఆ కళ్ళను కప్పితే ఏమీ చెయ్యలేడు. తను ఆమెను తన ప్రియునికి -- చేర్చు మన్నాడే గానీ ఆ ముక్కలు హృదయం నుంచి రాలేదని తనకు తెలుసు. మనుసుపడే ఆ వేదనను తగ్గించు కోడానికి లోభం చంపుకోడానికి ఒప్పుకోకపోయినా చంపు తున్నానని అనుకుని అన్న మాటలవి. తాళి కట్టిన భార్య తన అనంతరం యెల్లప్పుడూ తన్నే తలచుకొని ప్రేమించాలనే కోరిక ప్రతి మగవాడికి వుంటుంది. అది మగవాడికి ఆడదాని సర్వస్వం తన స్వాదీనమనే అహం వలన వచ్చినది. అందుకే తను అనుబంధమైన కోరిక నింకొకదాన్ని కూడా చేర్చాడు. ఇంకొకని భార్యని తను ఒంటిగా తన యింట్లో పెట్టుకుని వాంచిస్తున్నానన్న తలపు రాగానే తనలో పుట్టిన వేడి చల్లార నారంభించింది.
    తను పిలవకుండానే విశాల బయటకు వచ్చింది. తన ఎదరగానే వెన్నెల్లో ఆహ్లాదంగా యిటూ అటూ లాన్ లో విహారించింది. పండు వెన్నెలలో పౌడరు లా రుద్దుకున్న గడ్డి పై వయ్యారంగా పడుకుంది. సూర్యం కలగంటున్న అంతా చూస్తున్నాడు. యౌవ్వనపు తోలి రోజుల నించీ పలవరిస్తున్న హృదయాధిదేవత వలపుల రాజ్ఞి. మనోహరి ఎదరగా దేవ విమానం లో నించి దిగి తనను ఆహ్వానిస్తున్నట్లని పించింది. విశాల గతం లోని గంట్లును కప్పేసింది. బ్రతుకు మీద యెంత విశ్వాసం అభిరుచి, తీపి లేకపోతె అంత సాహసం చేయ్యగలుగుతుంది? ఆమెకు యిహ లోకం తోటే, ఈ లోకం లో ఆనందాన్ని యిచ్చే వన్నీ ఆస్వాదించాలన్న కోరికలతో నే సంబంధం వున్నట్లుంది. లేదా అంటే ఆమెలో యింత మార్పు రావటానికి కారణం?
    సూర్యం ఆమె దగ్గరగా వెళ్ళకుండా ఉండలేక పోయాడు. మౌనంగా వెళ్లి ఆమె గడ్డి పై పడుకున్న చోటునే దగ్గరగా కూర్చున్నాడు.
    'వచ్చారా?' అని పలుకరించింది.
    'విశాల -నివ్వు' అని అడుగుదామన్నది అడగలేక పోయాడు.
    'ఇంత వేగిరం యెలా మారిపోయావని అడుగుదామని మొగమాట పడ్తున్నారు కదూ!'
    సూర్యం బదులు చెప్పలేదు.
    'నా మార్పుకు కారణం అతని క్రౌర్యం ,  మీ అనురాగం.'
    'శ్రీనివాస్ నిన్ను బాధపెట్టాడా?'
    ఆమె కళ్ళల్లో ఒక్కసారి నీళ్ళు నిండుకున్నాయ్.
    'ఆరోజులు మిమ్మల్ని చూసి మరచి పోయాను. మళ్లీ తల్చుకునేటట్లు చెయ్యకండి.'
    'విశాలా క్షమించు శ్రీనివాస్ నిన్ను కొట్టాడా తిట్టాడా?'
    'హా ఎంతకాలమో నాకోసం వేచి వున్నాడట, నన్ను ముట్టుకునే అధికారం తాళి కట్టి సంపాదించాడు. ఆ అధికారం తనకు లేదని తట్టి ఆవేశ పెడ్డాడు.'
    'ఆ అధికారం ఎందుకిచ్చావ్ విశాలా?'
    'మిమ్మాల్ని తల్చుకుని బతకడానికి?'
    'అతనిని కట్టుకోపోతే బతకలేవా?'
    'నేను, మిమ్మల్ని తాకిన యీ శరీరాన్ని యింకొకరికి అమ్ముకోవటం యిష్టం లేదు.  నా పట్టుదలతో మామ్మ ప్రాణాన్ని తియ్యదల్చుకోలేదు.'
    'కానీ యింకో ప్రాణినే బాధ పెట్టావుగా.'
    'విధి లేకపోయింది. బహుశా తొందర పడ్డానేమో! నా యీ తొందర పాటు తో చేసిన పనికి మీరు క్షమిస్తారనే ఆశతోనే చేసాను.'
    సూర్యం మౌనంగా ఆమె వేపు చూసాడు.
    'నేను తొందర పడ్డాను. మీరు తొందర పడలేదుగా! మీరంటే నాకెంతో విశ్వాసం మీతలపు నాకు యెక్కడ లేని ధైర్యాన్ని యిస్తుంది. మీరు వేరు నేను వేరు అని తల్చుకోలేను, క్షమించండి....ఏంటో యిలా మనసు విప్పెసాను పిచ్చిదాన్ని.... కాకపొతే -- ఏంటి నా వేషం -- ఇవేం మాటలు-- లోకం హర్షించదు. మీరు లోకానికి జడుస్తారు-- లోకం జయిస్తుందో మీరు జయిస్తారో చూడటానికి బ్రతికి వున్నాను--- అబ్బే--ఉఏ పిచ్చి దాని మాటలను మనసులో పెట్టుకోకండి---'
    సూర్యం దుఃఖంతో గుండె బరువెక్కి మాట్లాడలేదు. ఆకాశం వెన్నెలతో వెలిగి పోతోంది. ఒక నీలి తెరలా కనిపిస్తోంది. ఈ విశాల వెన్నెల్లో వెలిగి పోతున్నా, ఒక ఆకారం తో కనిపిస్తున్నా అనంతమైన ఆకాశం లాంటిదని అతనికి తోంచింది. ఆకాశాన్ని ముట్టుకోలేనట్టే ఆమెనూ తను ముట్టు కోలేననుకున్నాడు.

                                                             15
    ఆ వారం రోజుల్లోనే అమ్మా నాన్నా అనుకోకుండా వచ్చారు. ఎప్పుడో ఒకసారి ఇద్దరూ కలిసి వచ్చి ఒక నెల రోజులుండమని రాస్తే ఇప్పటికి తీరుబడి అయిందేమో? వాళ్ళ రాక సూర్యం మనసులో యేవేవో క్రొత్త ఆలోచనలకు చోటు యిచ్చింది. ఈ ప్రశాంత వాతావరణం తండ్రికి నచ్చింది. అంగట వరండా లో పది గంటల రాత్రి వరకూ అమ్మా, నాన్న తనూ కుటుంబం లోని విషయాలెన్నో మాటాడు కునేవారు. వాళ్ళ కుటుంబానికి తనసత్ప్రవర్తన , హోదా యెంత వెలుగు తెచ్చిందో సూర్యం తెలుసుకొని విడివడని బంధాలను మళ్లీ అల్లుకొన్నాడు. తను తల్లి ఒడిలో నున్న బిడ్డ లాంటి అనుభూతినే అమ్మ ఎదరగా పొందాడు. ఈ తల్లి దండ్రులూ తమ్ములూ, చెల్లెళ్ళూ వీళ్ళందరూ అంతా ఒక చెట్టు లోనివారు. ఒక గుంపు లోని పిట్టలు -- ఒకే రకం పక్షులు -- ఈ యేనుగుల సమూహాన్ని వదలి వేరే తను వెళ్తే ఒంటిగా పట్టుబడి మావటీ వాని శూలం పోటులను గురి కావలసిందే!
    తొందరపడి, తన జన్మకూ, తన బాగోగులకూ , తను యిలా మనిషిగా ఆలోచిస్తూ గర్విస్తూ, కదలడానికి కారుకులైన తల్లిదండ్రులకు యెడబాటు కాలేడు. అలాంటిది జరిగేటప్పుడు భూమి సూర్యుని చుట్టూ కట్టుబాట్లు వదలి తిరగదు. ఈ కట్టుబాట్లు ధర్మ సమ్మతమైనవి. ధర్మం పాలించబట్టే యెండా, వానా, వెన్నెల , చలి వగైరా అన్నీ మనుషులు అనుభవించి ఆనందించగలుగుతున్నారు. తను ధర్మం విడిచి పెట్టి ఆత్మీయులైన వాళ్ళను నవ్వుల పాలు చేస్తే లోకం హర్షించదు. తన్ను తానె హర్షించు కొలేడు. తనలో గర్వం చచ్చి పొయిందెప్పుడో . తన వెన్నె ముక విరిగి పోతుంది. జీవితం లో యిక మిగిలింది నిరాశ. నిరాశతోనే బ్రతికే అవసరం వుండదు. నిరాశ లో ఆశను చూడలేని మనిషి జీవచ్చవం. అంచేత విశాలను తల్చుకుని విదిపడుతున్న బంధాలు తల్లిదండ్రుల రాకతో మళ్ళీ గట్టి పడ్డాయ్.
    వచ్చిన వారం రోజుల వరకు అంతా సవ్యంగా జరిగిపోగానే సూర్యం కు తృప్తి కలిగింది. సాయంకాలం తండ్రి షికారుకు వెళ్ళిపోయాడు. తల్లి వంట వేగిరం పూర్తీ చేసింది. వంటమనిషి లాన్ లో రెండు వాలు కుర్చీలు వేశాడు. దగ్గరగా పూలతో నిండిన నిద్ర గన్నేరు చెట్టు సాయంత్రం కాగానే ఆకులన్నీ ముడుచు కున్నాయ్. వలపు పూలను పండించ లేని పచ్చని క్రోటన్స్ మొక్క సంధ్యా కాంతులను యిముడ్చుకుని గాలికి ప్రక్కనే వున్న సూర్యాకాంతం మొక్క వేపు వంగి వెక్కిరిస్తోంది. బంగారు చాయతో పూల నిండా వలపులను పండించి అందని వన్నె కాడు కోసం అర్రులు చాచి చివరకు నిస్పృహతో తల వంచిన సూర్య కాంతం మొక్క ఆ వెక్కిరింపు కు సమాధానం యీయలేక పోతోంది. తీసుకుంటే ప్రకృతి లో ప్రతి మొక్కా ప్రతి కీటకం, పక్షీ వస్తువూ మనిషికి సంబంధించిన సందేశం ఇస్తూనే ఉంటుంది మనిషి కోసమే ఇవన్నీ బ్రతికి వున్నట్లు మనిషి చుట్టూ తిరుగుతుంటాయ్.
    అలాంటి ప్రశాంత మైన వాతావరణం లో అమ్మ సూర్యం పెళ్లి ప్రసక్తి తెచ్చింది. తొందర లేదమ్మా అన్నాడు.
    'చూడు నాయనా! కుటుంబం పేరు చెప్పి నిన్నెన్ని రోజులింకా కట్టుబాట్ల తో బందిస్తాం. వయసుతో కలిగిన కొడుకువు, నువ్వుండబట్టే మీ నాన్న బరువు పంచుకొన్నావు. అలాగే నీకూ వుండొద్దూ? చాలా సమ్మందాలు వస్తున్నాయ్ గానీ ఒక సమ్మంధం నచ్చింది.'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS