Previous Page Next Page 
ఆరాధన పేజి 28


    "నీకెలా తెలుసమ్మా" - తన తల్లి కుమార్ ఫోటో చూచినట్లు తనకు తెలుసు - కానీ ఆ రూపాన్ని అంతబాగా గుర్తుంచుకుంటుందని కళ్యాణి కల్లోకూడా భావించలేదు. అప్రయత్నం గానే అనేసింది.
    ఆమె మౌనం దాల్చింది..కానీ ఆ చూపంతా కుమార్ మీద కేంద్రీకరింపబడివుంది. ఆమె తను కొనల్లో నీకు నిల్చింది. కళ్యాణి మారుమాట్లాడ కుండా ఆమె కన్నీరును కొంగుతో ఒత్తింది. ఆమె బాధగా మూల్గింది!
    "ఈ రెండు సాంపిల్స్ ఈతని రక్తంతో సరిపోతాయి. ఇక "ఓ" గ్రూప్ అన్నాడు రవి లోపలికి వచ్చి.
    ఆత్రంగా చూచాడు. ఆ రెండు సాంపిల్స్ తనది. కళ్యాణిది కళ్యాణీ గబగబ ముందుకొచ్చింది. కాని ఆమెను గమనించినట్టు లేదు రవితో కల్సి వాన్ వైపు నడుస్తూ వెళ్ళిపోయాడు.    
    కళ్యాణి అతనివైపు చూస్తూ నుంచుండి పోయింది. భాస్కర్ ఆమె రెక్క పుచ్చుకుని నడిపించుకుంటూ బైటికి తీసుకెళ్ళిపోయాడు. నర్స్ ఏదైనా డ్రింకు తయారు చేయించటానికి వెళ్ళి పోయింది. కొంతసేపటికి అందరు గదిలోకి వచ్చారు. వేచి ఉన్నవారికి కొన్ని యుగాలు దాటి నట్లుగా ఉన్నాయి. రవిచేతిలో రక్తంతో నిండిన సీసావుంది. కుమార్ ముఖములో ఎప్పటి మాదిరిగానే అలసట ప్రస్ఫుటంగా కానవస్తోంది. కాంపౌండర్, రవి, సహాయంతో రక్తం ఎక్కించటానికి అంతా ఆ మర్నాడు కుమార్. చుక్క చుక్కగా రక్తం అతడి శరీరంలోకి పోతోంది. ఆఫ్టర్ ఇఫెక్ట్స్ కోసం పరిశీలనగా చూస్తూ కూచున్నాడు కుమార్. అంతా నిశ్శబ్దంగా వుంది. రెక్కమీది బాండేజీ గడ్డను వదులుచేసి చూచాడు మీదనున్న దూది కొద్ది మాత్రం తడిసి వుంది...హమ్మయ్యా......ఇక ఫర్వాలేదు.....అనుకున్నాడు. నిమిషాలు దొర్లుకుపోతున్నాయి. బొట్టు బొట్టు గా శరీరంలోకి వెళ్తూన్న రక్తం తన పని తను చేసుకుపోతోంది గుండె కొట్టుకోవటం కొద్దిగా స్పష్టమైంది. శరీరానికి రంగువచ్చింది. పెదిమలు ఎరుపెక్కాయి. శరీరంలో ఉడుకు రక్తం ప్రవహిస్తుంటే ప్రాణాపాయం కొంత వరకు తగ్గినట్లే. కాస్త కుదుటబడ్తే. అతనిని హైదరాబాద్ కు తీసుకొని వెళ్ళిపోవచ్చును.
    రాత్రి పదకొండు గంటలైంది.....కానీ ఆతనికి స్మారకంరాలేదు. ఈ లోపుగా పోలీసు వారు డాక్టర్ను తీసుకొని వచ్చారు.
    ఇద్దరు డాక్టర్లు చర్చించుకున్నారు. తలకు గాయం తగిలింది. అందువల్ల అతనిలో స్పృహ లేదు. ఇక వెంటనే తీసుకొని వెళ్ళి విరిగిన ఎముకల్ని సరిచేసి ప్లాస్టర్ వేసి గాయాలకు కట్లు కట్టాలి. ఇద్దరు ఆలోచించి ఇంకొన్ని గంటలు ఆగి తీసుకొని వెళ్తే మంచిదని నిర్ణయించారు.
    కుమార్ కు గాని, మరెవ్వరికిగాని నిద్రలేదు. తల్లికి నిద్రమందు ఇచ్చారు. ఆమె దీర్ఘనిద్రలో మునిగివుంది.
    తన హాస్పిటల్ కు తీసుకొనివెళ్ళాలని కుమార్ ఆశ. కానీ అలా జరగటానికి వీల్లేదు అతడ్ని తను యమ్. యస్ చేసిన హాస్పిటల్ కు తీసుకొని వెళ్తారు. అక్కడ కూడా అంతేతనకు తెలిసినవారే కుమార్ కు కొంత తృప్తి కలిగింది-కానీ తను చికిత్స వేయటంలో పాలు పుచ్చుకోలేదు దగ్గర వుండి మౌనంగా చూడటమే. తనవిధి ఒక డాక్టర్ మరొక డాక్టర్ కివ్వవలసిన మర్యాద. గౌరవం ఇది.
    మరుసటి రోజు సాయంత్రానికి గాని కాలరీ జోన్ కు ప్లాస్టర్ పడలేదు రెక్కదగ్గర ఫాక్చర్ అయింది. అంతవరకు అదృష్టవంతుడే అన్ని విధాలైన కట్లతో తండ్రిని ఆపరేషన్ థియేటరీ నించి తెస్తుంటే కళ్యాణి బిగ్గరగా ఏడవలేక నోట్లో చెంగు క్రుక్కుకుంది. కుమారీ ఆమెను సమీపించి ఓదార్చాడు. "ప్రాణాప్రాయం దాటిందమ్మా-మరేం ఫరవాలేదు..చాల అదృష్ట వంతులు...స్పృహ త్వరలో వస్తే ఇక ఏమీ భయపడనవసరంలేదు....మీ అమ్మగారితో ఇది మాట చెప్పి ఓదార్చు."
    కల్యాణి తల్లిదగ్గరకు వెళ్ళింది. అన్నలు ఇంతవరకు రాలేదు. పినతండ్రి, మేనమామ లిద్దరికి వైర్స్ అలసివుంటాయి. రేపటికిగాని దిగరు....మంజుల వారంరోజల్లో రాబోయింది కానీ ఆ క్షణంలో కళ్యాణి ఒంటరిధైంది, ఈ ఆందోళనంతా తాను ఒంటరిగా భరించలేకపోతుంది తనకంత శక్తిలేదు, ఎవరైనా పట్టుకుని బిగ్గరగా ఏడవాలనిపిస్తోంది. తన తల్లిని తను ఓదార్చాలి మొదట తనే బీరువై పోతోంది.....ఇక తనేం ధైర్యం చెప్పగలదు.... భాస్కర్ వైపు చూచింది కిటికీలోంచి ఎటో చూస్తున్నాడు. కుమార్ వైపు చూచింది ఎంతో శ్రద్దగా డాక్టర్ తో ఏదో మాట్లాడుతున్నాడు డాక్టర్ వెళ్ళిపోగానే కుమార్ కళ్యాణి కళ్యాణి తల్లి దగ్గర కొచ్చారు. అతని ముఖం బాగా అలసివుంది. నిద్రలేమితో కళ్ళు ఎరుపెక్కివున్నాయి. శాంతంగా అన్నాడు "మీరేమీ భయపడనవసరం లేదమ్మా.....ఎక్కువగా రక్తం పోవటంవల్ల ఇలాంటి పరిస్థితి కల్గింది. రక్తం ఎక్కిస్తున్నారుకదా? త్వరలో స్మారకం రావచ్చు మీరేం కంగారు పడకండి. ఈరాత్రికి నేను ఇక్కడే వుంటాను."    
    తల్లి ఏమేమో అడగాలనుకుంది...కానీ ఒక మాటామాట్లాడలేకపోయినది. కళ్యాణి భాస్కర్ అయిష్టంగానే ఇంటికి వెళ్ళారు.
    మంచానికి దగ్గరగా ఈజీ చైర్ వేయించు కుని రాత్రంతా కాపలా కాశాడు. నర్సులు డ్యూటీ డాక్టరు ప్రిస్కిప్షన్ ను అనుసరించి చేయవలసినది చేసి వెళ్తున్నారు తెలతెలవారుతుండగా కుమార్ కు కాస్త నిద్రపట్టింది.
    భళ్ళున తెల్లవారింది. ఆయాలు, స్టూడెంట్ నర్స్ లు, తోటివాళ్ళు హడావిడిగా తిరుగుతున్నారు పక్కలు సరిచేసి గుడ్డలు మార్చటం టెంపరేచర్ చూసి, ఎర్ర నీళ్ళు" గొంతులో పోసి - చార్టు రాసి- వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు నర్సులు. కుమార్ అతని చేతిని తన చేతిలోకి తీసికొని నాడి పరీక్షించాడు నార్మల్ కన్నా కొద్దిగ తక్కువ ఫరవాలేదు.
    అతని ముఖంలోకి పరీక్షగా చూశాడు. ఎందుకు మంజు గుర్తొస్తోంది మంజుతో తండ్రిపోలికలే ఎక్కువగా వున్నాయి అతడ్ని చూడటం అదే ప్రథమం. అతను కేవలం పేషంట్ మాత్రం కాడు. తన మంజు తండ్రి.....అంటే తన మామ అప్రయత్నంగానే అతని స్వాస్థి కోసం ఎక్కువ ఆశ చూపుతున్నాడు అదృశ్య బంధకాలేవో తనను లాగుతున్నాయి అతనిపై గౌరవం ఇనుమడిస్తోంది. అతనిని స్పృహవస్తే బావుంటుంది....అతని ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి.
    ఎనిమిది గంటలకు కల్యాణి వచ్చింది. భాస్కర్ చేతిలో సుమారైన టిఫిన్ కారియర్ వుంది. కల్యాణి రాగానే ఆర్ద్రనయనాలతో కుమార్ కేసి క్షణంచూచి 'నాన్న కెలా వుంది భావాల అంది.
    అంతా బాగానే వుంది.....కాని స్పృహ లేదు.....సర్జన్ వస్తారు.....ఇంకా చాలా పరీక్షలు కావాలి"
    కల్యాణి కాఫీపోసి ఇచ్చింది సాసర్ లో నాల్గు ఇడ్లీలుపెట్టి కారంపొడి వేసి నెయ్యివేసి అందించింది కుమార్ కిటికీ దగ్గరకెళ్ళి నుంచుని తిన్నాడు.
    "అక్కయ్యకు రాస్తే......ఏమంటారు కళ్యాణి అనుమానంతో ప్రశ్నించింది.    '    
    తప్పక రాయాలి నేనే రాసేస్తాను. ఎలాగూ వచ్చే ప్రయత్నాల్లోపు డొచ్చు కానీ ముందుగా తెలివై మంచిది."
    చేతులు కడుక్కోటానికి బైటికెళ్ళాడు. మంజు అన్నలిద్దరు వస్తున్నారు.
    "నమస్కారం.....డాక్టర్....నాన్నగారికి ఎలావుంది?
    కల్యాణి బైటికొచ్చింది. అన్నల్ని చూడగ కొండంత ధైర్యంవచ్చింది. "డేంజర్ సిగ్నల్ దాటినట్టే.....కానీ ఇంకా స్మారకం రాలేదు వదినలేరి? అన్నట్లుచూసింది. పెద్దన్నయ్య అన్నాడు "అందరువస్తే ఎక్కడుంటారు? నానా హంగామా చేస్తారు....లేనిపోని ఖర్చు.....పద్మ కుమార్ కు ఇక తను అక్కడ అవసరమని పించింది "మీరంతా వున్నారు.....నేను వెళ్తానమ్మా..... రోజూ వస్తుంటానులే నీకేమాత్రం అధైర్యంగా వున్నా- డాక్టరు అన్నపూర్ణ నంబర్ ని ఫోన్ చెయ్యి..... వస్తాను."
    కుమార్ వెళ్ళిన దిక్కుకేసి చూస్తునిలుచుండి పోయారు కల్యాణి భాస్కర్ లు మనసులోనే అతనికి భక్తితో నమస్కరించినది. భాస్కర్ కు ఎంతో తృప్తిగా ధీమాగా వుంది. ఇక 'నాబాధ్యత ఏమీ లేదు. బావలొచ్చారు. వాళ్ళ పూచీ ఇక "పద కల్యాణి- మీ అమ్మగార్ని పలుకరించి వెళ్దాం" సజల నేత్రాలను తుడుచుకుంటూ తల్లిదగ్గర కెళ్ళింది.
    "ఏమే- అతడు వెళ్ళిపోయినట్లున్నాడే!
    "ఎవరు? అంది ఏమీ ఎరుగనట్లు.
    "అతడే - మంజు మొగుడు"
    "ఓహో ....బావా ....అన్నలిద్దరు వచ్చారు. ఏ- నీకు చెప్పకుండా వెళ్ళారనా! చెప్పినా -వెళ్ళి రండి అంటావు.... కల్యాణి కోపంతో మాట్లాడటం గ్రహించి ఆమె విశ్వసించి అంది అన్నయ్య లొచ్చారన్నావు. ఏరి?
    "నాన్నగారి దగ్గరున్నారు....... మా మనసులు" కుదుట పడ్డాయమ్మా."

                              *    *    *

                  

    "ఏ మాట కామాటే చెప్పుకో వాలి తల్లీ. అతనురాక పోయి నట్లయితే మీనాన్నగారు..." ఆమె కంఠం పూడుకుపోయింది.
    ఔనమ్మా- అంతపని జరిగే వుండేది."
    మంజుల ఇద్దరు చంటిబిడ్డలతో లావణ్యతో రైలు దిగింది. వెంట వచ్చిన ఒక కేరళ స్త్రీ ఒక బాబు నెత్తుకుని వుంది. కుమార్ పసి పాపలను చూస్తున్నాడు. ఇద్దరు ఒకే మాదిరి ఉన్నారు. పెద్దదయితే గాని వాళ్ళ రూపాల్లో తేడా కనిపించదు. పాప తండ్రిమీదికి దూకింది. భార్యాభర్తలు ఒకరి నొకరు చూచుకున్నారు. మంజుల ముఖం తేజస్సుతో నిండి-ఆనందాన్ని పోతపోసి నట్లుంది. భర్త కు తన చేతిలోనిబిడ్డ నందిస్తుంటే అదొహ ఆనందం. ఆ క్షణం కల్గే అనుభూతి మరింకెప్పుడు కలుగదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS