Previous Page Next Page 
ఆరాధన పేజి 26


    అన్న మంజుకేసి చూశాడు. నమ్మటానికెందుకో సంకోచిస్తూనే వున్నారు. మంజు మందస్మిత వదనయై అంది "ఆపరేషన్ చేయించుకోవాలన్న ఇష్టం వుంటే- అలాగే కానియ్ అన్నయ్యా! పదిమందిలోనూ చెప్పుకోవచ్చు- పెద్ద ఆపరేషన్ అయింది - పెద్దాసుపత్రిలో ఫారిన్ లో ట్రెయినింగ్ అయిన డాక్టరు ఆపరేట్ చేశారు....డ్యుడోనియం అల్సర్-అట అని చాల-చాల చెప్పుకోవచ్చు. నీ స్నేహితుల్లో నీకె క్రొత్త డిగ్రీ- చాలా రోజుల వరకు సంభాషణకు క్రొత్త అంశాలకోసం వెతుక్కో నవసరం లేదు. అదొహ ఘరానా - ఏమంటావు వదిన?" కుమార్ మంజుకేసి చూస్తున్నాడు- ఆ కళ్ళు నవ్వుతూన్నట్లున్నాయి మంజుకు-
    "అవునమ్మా - అన్ని నవ్వులాటగానే వున్నాయి. నీకు-మీరేమైనా చేసుకోండి చెల్లెలు డాక్టరు గారున్నారుగా! నే వెళ్తాను.... ప్రతీదీ ఆటకాయితనంగా త్రోసి పారేస్తూ మాట్లాడితే నేనేం చెయ్యను : రేపే నా ప్రయాణం వచ్చే వాళ్ళంతా తయారుకండి" అన్న నిజంగానే గాభరాపడి పోయాడు.
    "నువ్వేల్తే అన్నయ్యకు సాయం ఎవరుంటా రొదినా" వెళ్తున్న వదిన రెక్కపుచ్చుకుంది. లాలనగా అంది" పర-పర కడుపు కోసి పారెయ్యగలం- అదేం కష్టమైన పనికాదు. కానీ రోగి శస్త్ర చికిత్స లేకుండా ఆరోగ్యం పొందగల్గేలా ప్రయత్నిస్తాము. మందులు పనిచేయకపోతే ఆఖరి ప్రయత్నం శస్త్రం తో - అందుకే ముందు మామూలు ట్రీట్ మెంట్ తీసుకుంటే- భోజనం మేము చెప్పినది తీసుకుంటే తగ్గవచ్చు. చాలా మందికి ఈ విధంగా నయమైంది. కాదు - కూడదంటే ఆపరేషన్ చేస్తాము.
    ఆమె మాట్లాడలేదు. సరిగ్గా వారానికి తిరుగు ప్రయాణమయ్యారు. పెద్దామె కోర్కె తీరనే లేదు. ఇతరుల బాధ చూస్తేగానీ ఆనందించరుకొందరు. వాళ్ళను తెల్లవారి పలుకరించి వెళ్ళిపోవడానికి కుమార్ ఒక్కడే పాపను తీసుకొని వాళ్ళ బసకు వెళ్ళాడు. అక్కడ కూడా మంజు పెద్దన్న గారికి అతను తీసుకోవలసిన జాగ్రత్త లను గూర్చి చెప్పివచ్చేశాడు.    
    వాళ్ళు ఏమైనా యిస్తారు- లేదా బట్టలు పెడతారు. వాటిని తిరగ్గొట్టేయాలి.....అంతటికి ఫీజు ఎంతైందో అడిగి ఇచ్చెయ్యాలి- పెద్దామె చిన్న లెక్చర్ యిచ్చింది. భర్తకు -మరిదికి.
    సాయంత్రం స్టేషన్ కు మంజు మాత్రం బయలుదేరింది. అందరూ టాక్సీలు ఎక్కినా మంజు ఏదీ యిచ్చేలా కనిపించలేదు. ఆమెలో లోపల మండి పడ్తోంది. తిరగ్గొట్టేయాలనుకున్న మనిషి. వాళ్ళివ్వ లేదేమో అని విచారిస్తోంది. ఇన్నాళ్ళకు కలిశాము. ఒక్క రవికెముక్క యివ్వలేక పోయింది. ఛీ- ఏం మనుష్యులు- ఏం మర్యాదలు? ముభావంగా కూచుందామె. మంజు చిన్న వదినతో మాట్లాడుతోంది.
    టాక్సీలు రెండూ స్టేషన్ చేరాయి. అందరు దిగారు. పెద్దన్న టికెట్స్ కొనటానికి వెళ్ళబోతున్నాడు. మంజు ఆపుచేసింది. సెకండ్ క్లాస్ టికెట్స్ చేతిలోపెడ్తూ అంది. "డాక్టర్ గారు టికెట్స్ తీసి పంపారు....అర్జంటు కేసొచ్చిందట ...రాలేనని కబురు చేశారు." టికెట్స్ అందుకుని జేబులో పెట్టుకున్నాడతను.

                            *    *    *

                   

    ఎవరికి తోచినట్లు వాళ్ళు ఆలోచిస్తున్నారు.
    "బాగానే తప్పించుకున్నారు- అందరికి గుడ్డలు పెట్టాలంటే రెండు మూడు వందలు వదుల్తాయి!" పెద్దామె వ్యాఖ్యానించేసుకుంది.
    రైలు ఫ్లాట్ ఫార్మ్ మీదికొచ్చింది అంతాబండి ఎక్కి కూచున్నారు. ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. కళ్యాణి రాలేదు అత్తగారు పోవటం మూలాన నవ్వరు ఎక్కడికి వెళ్ళేస్థితిలో లేరు.
    రైలు కూతవేసింది, మంజు బండి దిగింది. కిటికీ ఊచపట్టుకుని నుంచుంది. రైలు కదిలింది. రైలుతోపాటే నడుస్తోంది. వేగం హెచ్చుతోంది. బిగ్గరగా అంది "పళ్ళబుట్ట అడుగున పిల్లలకి బట్టలున్నాయి. మీకిస్తే తీసుకోరని ఇలా చేశాయి" ఏదోగోల- ఇక అడుగులు వేయలేక నుంచుండి పోయింది. రైలు దాటిపోయింది.....ఆమె కళ్ళలోనీళ్ళు సుళ్ళు తిరిగాయి. చటుక్కున ఏదోజ్ఞాపకానికొచ్చింది.....తన పాపకు.....వాళ్ళేమిచ్చారు. ఒక్క గౌను గుడ్డకూడా ఇవ్వలేకపోయారే....ఆమె హృదయం వ్యధతో మూల్గింది. పరధ్యానంగా నడుస్తోంది. ఎవ్వరో-మంజూ అన్నారు.
    ఆమె ఆశ్చర్య చకితయై ఆవైపు చూచింది. కుమార్ పాపనెత్తుకుని నుంచుని వున్నాడు. ఆమె వదనం ఆనందంతో వికసించింది. సజల నేత్రాల్ని తుడుచుకుంటూ అంది "మీరెప్పుడొచ్చారు?
    "అరగంట దాటింది......వాళ్ళు వెళ్ళాక దిగులు పడ్తావని వచ్చాను" మంజూ ఆరాధన పూర్వకంగా చూచింది. అలాచూడకు- అన్నలా తల ఆడించాడు. ఇదిచూడు మంజు కవరు ఆనందించాడు.    
    "ఏమిటి సినిమాకు టికెట్సు" ఆమె విస్తుపోయింది. సాధారణంగా సినిమాలకు వెళ్ళని కుమార్ ఆనాడు టికెట్సుముందేకొని ఇలా రావటం ఆమె కత్యంతాశ్చర్యాన్ని కల్గించింది. నైట్ షోస్ కు అసలు వెళ్ళరు- ఇదేమిటి?
    కాంప్లిమెంటరీ టికెట్సు యివి. ఆమె మీనాక్షి లేదూ మనకు- అంటే స్టాఫ్ అంతకు పంపమని తన రిప్రెజెటెటివ్ తో చెప్పిందట వాళ్ళ పిక్చర్ మొన్న రిలీజ్ అయిందట. అతను ప్రొద్దుటవచ్చి ఇచ్చివెళ్ళాడు...అప్పటి ఆమె గాయాలు ఎలా మానిపోయాయో చూడాలని వుంది. మంజుకు కూడా ఆమెను చూడాలని ఆతృతగానే వుంది. ఇద్దరు టాక్సీ తీసుకున బయలుదేరారు. పాపను ఇంట్లోవదిలేసి సినిమా హాలీ చేరారు. క్రొత్తగా వచ్చిన సినిమా కావటం మూలాన హాలు బైట జనం కిటకిటలాడుతున్నారు.
    సినిమా మొదలైంది. మీనాక్షి తెరమీదికి వచ్చింది. ఆమె తోటలో పాడుతూ తిరుగుతోంది ఆమె పెదిమల మీద లాస్యం చేస్తున్న మందహాస రేఖ వికసించకముందే ఆమె ముఖాన్ని మరో కోణంలోంచి చిత్రించాడు. కెమెరామాన్ హాయిగా నవ్వుతున్న ముఖాన్ని సూటిగా ఎదురుగా చూపకుండా క్షణంలో పోజు మార్చేశాడు. అలాగే చెంపని క్లోజప్ లో చూపలేదు. చూపినా చెంపకు చేయి ఆన్చి. లేదా ప్రియుని ఎదలో ఆ చెక్కిలిని దాచి చూపాడు అక్కడక్కడ ఆమె లోనిలి పాలు తెలియక పోలేదు. ముఖ్యంగా కుమార్ మంజుకు ఆమె ముఖంమీద మచ్చ- పెదిమ దగ్గర పంపు బాగా తెలుసు కానీ మొత్తంమీద ఆమె అందం దెబ్బతినలేదు ఎంతో బాగా నటించింది ఆమె అలా నటించిందంటే ఆమె మన స్థైర్యాన్ని మెచ్చుకోవచ్చు.
    కుమార్ కు ఎంతో తృప్తిగా వుంది.
    మరుసటిరోజు ఆమె అభినందిస్తూ ఇద్దరు ఉత్తరం వ్రాశారు. జవాబురాస్తూ తన కృతజ్ఞతలు తెల్పుకుందామె!
    ఈ సారి పసవించటానికి మంజు ప్రమీల వాళ్ళ అమ్మగారి దగ్గరకు తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చింది. మూర్తి ఆంతర్యంలో చాలా బాధ పడ్డాడు తను ఆశించినట్లు ఏదీ జరగటంలేదు. లక్ష్మి చేతిలో తనొక కీలుబొమ్మ- ఎందుకో ఆమె నెదిరించే శక్తిలేదు.
    కుమార్ కు పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. ఎవరోఒకరు వచ్చి ఆదుకుంటారని ఆశపడింది మంజుల. ఎప్పుడూ ఖాన్ తల్లి జ్ఞాపకాని కొచ్చేది. ఖాన్ తండ్రికి చాలా జబ్బుచేసి కోలుకుంటున్న మూలంగా ఆమె రాలేదు ఖాన్ మంజును తీసుకెళ్ళాలని ప్రయత్నం చేశాడు కానీ సమస్యను పరిష్కరిస్తూ ప్రమీల దిగింది. ఆమె భర్త కూడా వచ్చారు.
    వెళ్ళటానికి ఇష్టంలేకపోయినా మంజుకు వెళ్ళక తప్పిందికాదు. పరీక్షల సమయంలో తను ప్రసరిస్తే చాలాశ్రమ అవుతుంది. ఏదో సరుకు పోలరు డాక్టరు అన్నపూర్నవుంది. అంతా ఆమె చూచుకోగలదు. కానీ ప్రమీలఒప్పుకోదు.
    రైలెక్కించడానికి వచ్చిన సిబ్బందిని చూచి కన్నీరు పెట్టుకుంది. భర్తను ఒదిలి వెళ్ళటం అదే ప్రథమం. నిస్సహాయతతో బిక్క ముఖం వేసుకుని కన్నీరు పెట్టింది. కళ్యాణి మూర్తి, నేరంచేసిన వాడికి మల్లె ఎంతో  బాధపడిపోతున్నాడు పాప వచ్చీరాని మాటలతో తండ్రికి బోలెడన్ని కబుర్లు చెబుతోంది.
    కళ్యాణి అక్కతో నెమ్మదిగా అంది. చిన్నన్న రాశాడు. వాళ్ళా ఫీసరు సర్జను మాదప్పగారి మేనల్లుడట. అన్నయ్య ఏదో ఇరకాటంలో పడ్డాడు. నీతోచెప్పి నట్లయినాసరే-సరిచూడమని రాశాడు" అక్కచేతిలో ఉత్తరంపెట్టింది.
    మంజు స్థబ్ధయై నిమేషంపాటు చెల్లి ముఖం లోకి చూసింది. ఉత్తరం తెరవకుండానే గట్టిగా నలిపినట్లు పట్టుకున్నది. ఆమెకు వెర్రి కోపం వచ్చింది. తననించి ఎంతైనా సహాయం కావాలి. ఇలాంటి సమయం పొందటానికి. డబ్బు వెనకే సుకోడానికి ఏవీ అడ్డురావు. తమలో ఒక్కరిగా భావించి ఆదరించే సమయం వచ్చేసరికి ఎక్కడి కక్కడ గప్ చిప్ గా ఊరుకుంటారు. ఐనా పెద్దన్నయ్య కృతజ్ఞతగా ఒక్కకార్డు ముక్క రాశాడు అంతే .... అంతా అంతే.....మంజు అప్రయత్నంగా భర్తకేసి చూసింది. కుమార్ మంజులోని ఆవేరనను గ్రహించినట్లు జాలిగొల్పే చూపులను ప్రసరింపజేశాడు. నెమ్మదిగా భర్తను సమీపించి ఆ లేఖను అతనిచేతిలో పెట్టింది. "మీ కెలా తోస్తే అలా చెయ్యండి," అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS