స్నానంచేసి ఇవతలి కొచ్చింది పెద్దామె. వంటింట్లోకి వెళ్ళింది, అంతా శుభ్రంగా సర్దివుంది మీట్ సేఫ్ తెరచింది! పై అరలో చిన్న సజ్జలో గ్రుడ్లువున్నాయి. నాగుపాము కనిపించినట్లు చటుక్కున తలుపేసింది! నడుంమీద చేతులుంచుకోని గది కలియ జూచింది. ఏదో చటుక్కున స్ఫురించింది. గబ గబ బైటికొచ్చి భర్తను, మర్ధిని వుద్దేశించి "నే చెబితే విన్నారూ - ఇంతా మన సిలేనని మీ అభిప్రాయం. చూచారా యింటికి వచ్చిన వాళ్ళనెంత సబబుగా చూస్తోందో. ....మనమేమై పోతామో - అందులో చిన్న పిల్ల లతో - అని కాస్తయినా విచారించిందా?
"బాగానే వుంది వదినా - అంతా చెప్పి వెళ్ళిందిగా? తనుండి మర్యాద జరపటానికి వీల్లేనప్పుడు మనం సర్దుకుపోవాలి-అంతేగాని లేనిపోని నిష్ఠూరాలు దేనికి చెప్పు?
అన్నదమ్ములు పరస్పరం చూచుకున్నారు.
ఆ మాటల్లోని గూడార్ధాన్ని అందరు గ్రహించారు! "మన అవుసరం కొద్దీ వచ్చాము. అవుసరం తీరేదాక అలా అలా వుండి వెళ్ళిపోదాము. ఇది అందులోని భావం.
ఆమె మాత్రం ముఖం చిట్లించింది. "ఏమో బాబు నీచువండిన గిన్నెల్లో నేను ఏదీ వండలేను- పెట్టలేను- తినాలేను- ఏమ్మా చెల్లీ.
చంటిబిడ్డ, రెండేళ్ళకొడుకు, అంటే ఆకలికి తాళలేనివారు రెండో ఆవిడకే వున్నారు. ఆమె ఏదో లెద్దూ, హోటల్ లో తిండి తినగా లేంది-ఇక్కడ తింటే ఏం అనుకుందిగానీ పెద్దామే ఒడిసెలలో వేసి విసరిన రాయి బాగానే తగిలింది.
"అక్కా - నాకు అదే సమస్యగా వుంది. మనం వూరుకుంటే మంజు ఏమనుకుంటుందో-అని భయంగా వుంది,"కోపగించుకుంటే పెద్దాళ్ళ ఇద్దరి టాన్సిల్స్ ఆపరేషన్ చేయించకుండానే వెళ్ళిపోవలసి వస్తుందని భయం."
"ఆ ఏ మనుకుంటుంది లెద్దూ - ఆ మాత్రం అర్ధం చేసికోలేదా - ఏం?"
పిల్లలు ఆకలౌతోంది- అని ఈసారి నోటితో అనేశారు, చిన్న వదిన జడుస్తూనే వంటింట్లోకి వెళ్ళింది. గంగమ్మను పిల్చింది.
"మీ అమ్మగారూ వాళ్ళు నీచు దేన్లో వండుతారో నీకు తెలుసా?"
పాప భుజంమీద నిద్ర కుపక్రమిస్తోంది. "లేదండమ్మా - అసలు ఇక్కడ వండనివ్వరు. బాబుగారు తినాలంటే- పెద్ద డాక్టరమ్మగారి నౌకరు వండి తెస్తాడు."
"మీ అయ్యగారూ రోజు తినరా?"
"లేదమ్మా-వారాని కొక్కరోజు తింటే అదే ఎక్కువ."
ఈ సంభాషణ అంతా విన్నారు స్టౌ మీద మా.... ని పూరీలు వత్తుతోంది. పంచదార వేసుకుని పిల్లలు తింటున్నారు. బంగాళా దుంప కూరపండింది. పిల్లలు ఆరుమంది తిని లేచారు. పెద్దవాళ్ళు ఒక్కరూకూడా తినే ప్రయత్నం చేయలేదు. నలుగురు కాఫీ పెట్టుకుని త్రాగారు.
ఎవరికి వారు ఆలోచిస్తున్నారు. మంజు ఇంట్లో దిగి అక్కడ భోంచెయ్య వలసి వస్తే ఏం చెయ్యాలి? ఇలాంటి పరిస్థితి కల్గుతుందని అందరికీ ముందరే తెలీయదా? అలా తినకుండా వుంటే మంజు ఏమనుకుంటుందో - అని ఫీల్ అయ్యారా? ఏమో-కనీ "అక్కడే ఒక గదిలో వేరుగా వండుకుందా." అని పెద్దామె మాత్రం ఇంటినించి బయలుదేరక ముందే అంది.
అక్కడ అంతా తలూపినవారే - కా ఇక్కడ అదెంత వరకు ఆచరణీయమో గ్రహించటానికింతవరకు వీలులేకపోయింది.
అరగంట దాటినా మంజు జాడలేదు-
ఎవరో వస్తున్న చప్పుడైంది. పెద్దాయన తొంగి చూచాడు. ఒకతను చేతిలో రెండు టిఫిన్ కారియర్స్ తో వస్తున్నాడు. అతన్ని చూచి ప్రాణం లేచివచ్చింది అందరికీ ను.
"అమ్మగారు ఇంకో అర్ధగంట కొస్తారు బాబూ-అని" అక్కడ పెట్టేసి వెళ్ళాడు భోజనం చేసి చేతులు కడుక్కుని అలా కూర్చున్నారో లేదో - మంజు వచ్చింది. దాదాపు రెండు కావస్తోంది. బాగా అలసిపోయిన ముఖం చూస్తుంటే పెద్దవదిన నాలుక వూరుకుండలేకపోయింది- భోజన నెపం మీద ఏదేదో అనెయ్యాలని ఎదురు చూస్తున్నదల్లా భోజనం పంపటంతో ఆ కాస్త అవకాశం జారిపోయింది.
ఎవరిని పలుకరించకుండా గదిలోకి తొంగి చూచింది. పాప నిద్రపోతుంది. గుడ్డలు మార్చుకుని అందరు కూర్చున్న గదిలోకి వచ్చింది.
"ఐతే.....గంగమ్మ వచ్చి చెప్పక పోయినట్ల యితే మీరంతా వస్తుండే వారన్న మాట..."
"ఈ ఇంట్లో ఎలా వండుకుతింటా మనుకున్నావ్?" పెద్దావిడ గయ్ మంది.
"నిజమే..." అందరి ముఖాల్లో ద్యోతకమైన గెలుపు భావాన్ని చూచి చటుక్కున అనేసింది." పిలవకుండానే- అంత ప్రేమగా చూడ్డానికి వచ్చిన వారు - ఇక్కడ వండుకుతినటానికే అభ్యంతర లేదనుకున్నాను....గంగమ్మగాని చెప్పక పోయి నట్లయితే వదినా ఒంటికాలిమీద లేచేదానివి.....ఔనా?" మంజు స్మితవదనాన్ని చూచి ఆవిడ కొరకొరచూచింది. చిన్నావిడ మాటమార్చింది "మీ ఆయన ఏడీ?"
"యమ్. ఎన్. చేస్తున్నారు. హాస్పిటల్ కు వెళ్ళారు.....సాయంత్రానికి గాని రారు."
సాయంత్రానికి గూడు చేరతాడన్నమాట. ఔను గానీ....మంజూ.....అందర్నీ ఒదులుకుని వచ్చేశావుకదా ఎప్పుడైనా మమ్మల్నితలంచావా? "పెద్ద వదిన మంజు అంది, కిల కిల నవ్వింది. మిమ్మల్నంతా తలంచటానికి నాకు వ్యవధి. అవసరం ఏవి? పురుడైతే ఓ అమ్మవచ్చి పురుడుపోసి పోయింది. ఇంకో అమ్మ పాపకు నగలు చేసి పంపింది. కళ్యాణి అత్తగారు వెండి గిన్నె కంచం, గ్లాసు ఇచ్చారు. చావు బ్రతుకుల్లో వున్న మా పెద్ద మామగారూ పదెకరాల మాగాణి రాసి ఇచ్చారు...దమ్మిడి ఖర్చులేకుండా ఎమ్ ఎస్. చేయటానికి ఈ ఆసుపత్రి డబ్బిస్తోంది. వీరందరినీ తలుస్తూంటే నాకు మరెవ్వరికీ గుర్తుకురారు."
అంతా వట్టిదే - అని అందరికీ తెలుసు. మంజు భావగర్భితంగా మాట్లాడుతోంది. పరిహసిస్తోంది. ఎవ్వరికీ జవాబు చెప్పటానికి ఏమీ తోచలేదు. అంతా పెద్దామెకేసి చూచారు. ఎన్ని వున్నా తనవారిని విస్మరిస్తుందా? ఆ మాత్రం గుర్తుకు రారా? వస్తువులిస్తే ఆప్యాయత ప్రేమ వున్నట్లు-లేకపోతే లేదు అంతేనా? నీ ద్వారా కళంకం ఆపాదించబడింది. మాకు గాని వాళ్ళకు కాదు. నిన్ను చేరదీసి అభిమానం చూపటానికి మాకేం గౌరవ మర్యాదలు లేవనుకున్నావా! అత్తయ్య, మామగార్లుండగా నిన్ను చేరదీసి వారి ఆగ్రహానికి గురి కావాలని, మమ్మల్ని మేము హీనపర్చుకోవాలని మేమెప్పుడనుకోలేదు. ఇప్పటికి సంశయంతోనే వచ్చాము...."
మంజు పేలవంగా నవ్వింది. "సంశయం దేనికి?"
"ఎలాంటి ఆహ్వానం స్వాగతం లభిస్తాయో అవి..."
"చూచావుగా? ఇంతకన్నా ఎక్కువ ఆశిస్తానేమో నా కింతకన్నా చేతకాదు."
"నీ నించి కాదు..... ఎంతైనా నువ్వు మా ఆడపడుచువి. ఆయన నించి.....మంజు ముఖం గంభీరమైంది వదిన వైపు నిశ్చలంగా చూస్తూ అంది.
"వదినా-నానించి ఏదైనా పొరపాటు కల్గవచ్చు కాని వారినించి సూదిమోపంతైనా నేరం జరుగదు....ఆమె చటుక్కున ఆగింది.
* * *
.jpg)
అందరిని కలియ జూచింది. పెద్దన్న లేచి నుంచున్నాడు. "చూడు మంజూ - అయిందేదో అయిపోయింది. అప్పటి కోసం ఇంకా వుందను కోబోకు. నిన్ను చూడాలని ఎప్పటినించో అనుకుంటున్నాము. ఇప్పటికి కలసి వచ్చిందమ్మా...."
అన్న మాటల కడ్డుతగిలింది. "ఐతే నన్నొక్కత్తిని చూడాలని వస్తే - మీరాక - నిజంగా నాకు మనః క్లేశమే కల్గిస్తుంది..." ఆమె తల దిగులుగా ఆడించింది. "ఆహా - ఆహహా - అదికాదు....నిన్ను చూచి ఆ తర్వాత ఎలాగు నీ భర్తను చూస్తామనుకో....సరేలే - ఆయన వచ్చేలోగా ఓ విషయం తేల్చుకోవాలి.... ఇలా రోజూ హోటల్ లో తినటం బావులేదు. మీ వదిన కాస్త పాత్ర సామాను తెచ్చింది. ఓ గది ప్రత్యేకంగా వుంటే వండుకుని..."
"అన్నయ్యా" మంజు ఆవేదనతో అరచింది. ఆ కేక తనకే భయంకరముగా విన్పించింది. తన్ను తాను సంబాళించుకుని శాంతించి అడిగింది.
"ఇంతవరకు నన్ను నేను అణచుకుని వున్నా...మీ రాక నాకెంతో ఆనందాన్ని కల్గించింది. ఎన్నాళ్ళ నించో ఇటువంటి అవకాశం కోసం ఎదురు తెన్నులు చూస్తున్నాను. మీరు వచ్చారు. .... నా హృదయంలోని అనిర్వచనీయానందం మాటలతో చెప్పుకోలేను.... ఒకమాట అడుగుతాను... మీరు ఎందుకొచ్చారు? ఎన్నాళ్ళుంటారు?... ఈ జవాబులపై ఆధారపడి వుంటుంది నా జవాబు"
"చల్లకొచ్చి ముంత దాచటం దేనికి? .....నే చెబుతా నిను- చిన్నన్నకు రేపు ఇంటర్వ్యూ వుంది. ఆ చిన్నవాళ్ళిద్దర్నీ నువ్వుచూడలేదుగా! టాన్సిల్స్ తీసెయ్యాలన్నారు. రాజధాని చూడాలని మరోకోర్కె. మీ అన్నయ్యకు ఒంట్లో కులాసాగా లేదు. ఓసారి చూపించుకోవాలని వచ్చావమ్మా......దీనికంతకూ కొన్ని రోజులు పట్టవచ్చు..... నీకెందుకు మా భారం? అతను రాకముందే ఒకటి తేల్చిచెప్పు....ఓ గది ప్రత్యేకంగా...."
"వదినా- సత్రాలున్నాయిగా?" అంది. ఆమె కళ్ళలోని విస్ఫులింగాల్ని చూచి చకితుయాల్య రంతా.....తొణకని.... బెదరని....మనిషి పెద్దామె మాత్రమే-
"ఔనమ్మా-ఉన్నాయి....ఇలా నువ్వుంటావని మీ అన్నగారితో ముందే చెప్పాను....చెల్లాయిని చూడాలి చూడాలి అని ఒకటే ఇదైపోయారు. చూచారుగా.....ఇక ఆ సత్రానికో హోటల్ కో నడవండి" అన్నలిద్దరూ - ఆవిడమాటలు విని స్థాణువులై పోయారు. ఆమె విసవిసా నడిచి వెళ్తోంది....
"ఆగు వదినా? మిమ్మల్ని వెళ్ళమనలేదు నేను .....మీకై మీరు కోరివచ్చారు. పొమ్మని అనటానికి మీరు పరాయివాళ్ళు కాదమ్మా వదినా- కానీ కానీ- ఒక్కటి ఆలోచించారు కారు. వేరుగా వంట ప్రారంభిస్తే అంతా ఏమనుకుంటారు? అందులో నా భర్త హృదయం నవనీతం - ఒకరి ద్వారా యింతవరకు అపమానితులు కాలేదు. తన యింటికొచ్చి ఇలా ప్రవర్తిస్తే ఏమనుకుంటారు? వారి నలాంటి క్లిష్ట పరిస్థితి కొప్పగించ లెను. నా వారివల్ల ఆవగింజంత సహాయం-సానుభూతి లభింపకపోగా- పైగా అవమానం పొందటంకూడానా?....అంతేకాదు.....మాపాప లావణ్యను మేనగోడలిగా మీరు ఒక్కరైన దగ్గరకు తీసుకున్నారా? లేదు......ఇదంతా చూస్తుంటే మీరు కేవలం మమ్మల్ని అవమానించటానికే వచ్చారనుకున్నాను .... మీవల్ల ఏమాత్రం పొరపాటు జరగడానికి వీల్లేదు- వారు బాధపడడానికి వీల్లేదు.... ఆగు అన్నయ్యా: అంతా చెప్పనీ? ఈ ఇల్లు చాలా చిన్నది, డాక్టర్ అన్నపూర్ణ ఇంటికి గెస్టు రూమ్ లు రెండున్నాయి మీకు అక్కడ అంతా ఏర్పాటుచేశాను. దీనివల్ల ఎవరమూ ఏ విధంగా అవమానితులముకాము.
సమస్య పరిష్కారమైంది. పెద్దామె పెడ ముఖం పెట్టుకుని కూచుంది. మంజు కొన్ని క్షణాలు మౌనం దాల్చింది. ఏదో గుర్తుకు రావటంతో ఆనందోళనతో అడిగింది "అన్నయ్య - నీకేమైంది? ఇంత దూరం రావలసివచ్చిందా?"
"కడుపులో నొప్పిగా వుంటుందమ్మా-"
"ఎంతకాలం నించి?"
"పక్షం రోజుల నించి"
సాయంత్రం నాల్గుగంటల కంతా బయలుదేరారు. డాక్టర్ అన్నపూర్ణ యింట్లో వాళ్ళను వదిలి వెళ్తూ అన్నది "సరిగ్గా ఆరు గంటలకు తయారుగా ఉండండి వారొస్తారు. మీ రంతా మా యింట్లో వుండాలి."
కుమార్ ను చూడాలని మాట్లాడాలని, ఏదో ఒక విధంగా వాళ్ళని ఇరకాటంలో పడేసి మనసు నొప్పించాలని అందరూ తహ తహలాడుతున్నారు.
మంజు ఇంటికెళ్ళి స్నానంచేసి ఇల్లంతా సర్ది. కాఫీ ఫిల్టర్ తయారుచేసి ఎదురు చూస్తోంది. లోపల హాల్లో అంతా కూచుని వున్నారు. అతను వస్తాడు-బావా- అక్కా అని పలుకరిస్తాడు - సామానేదీ అంటాడు- ఇక్కడ దిగులేదంటే - అయ్యో - అని విచారం ప్రకటిస్తాడు-అన్నింటికీ "తగిన జవాబులు సిద్ధంగా వుంచుకుంది పెద్దవదిన.
కుమార్ వస్తున్న చప్పుడు విని పాప పరుగు తీసింది. మంజు గట్టిగా పట్టుకుంది. బూట్లు బైటనే వదలి లోపలికొచ్చాడు. బోలెడన్ని జోళ్ళ జతలు.....ఎవరో అనుకున్నాడు. పాపను తాకకుండా-వంగి-ఏదో పలుకరించి భార్యవైపు చూచాడు.
మంజు మందహాసం చేస్తూ "అన్నయ్యలు-సకుటుంబంతో వచ్చారు."
కుమార్ ముఖం వికసించింది "అలా చెప్పు-అందుకనే నీముఖం అరవిందంలా వుంది."
మంజుకు భయంగానే వుంది- ఎవరేం నోరు జారతారో - భర్తకెంత తలవంపు కల్గుతుందో నని.
"ఇప్పుడే వస్తాను" అంటూ తన గదిలోంచి బాత్ రూంలోకి వెళ్ళాడు.
మనల్ని చూడను సిగ్గుగా వుంది -ఆ - ముఖం చెల్లక-ధైర్యం లేదు-ఏదో భయం..." వ్యాఖ్యానిస్తున్నారు-అందరు.
పదిహేను నిమిషాలకు కుమార్ వచ్చాడు. అతని పెదిమలపై దరహాస రేఖ - ముఖంలో ఏదో గంభీరత ఆవరించి వుంది. దుస్తులు మార్చుకుని తెల్లని లాల్చి. తెల్లని పైజామా వేసుకున్నాడు. పాప-గది ఇవతలికి రాగానే కాళ్ళకు చుట్టుకుంది. పాపనెత్తుకుని వచ్చారు.
ఏదో కబుర్లలో మునిగినట్లు నటిస్తున్న అందరు మౌనం దాల్చారు.
"అందరికీ నమస్కారం" అన్నాడు.
"నమస్కారం..." గొణిగారు.
"పెద్దన్నయ్య. చిన్నన్నయ్య. పెద్దవదిన' చిన్నవదిన, వీళ్ళిద్దరు, ఆ పాప చిన్నన్నయ్య సంతానం- వాళ్ళు ముగ్గురు పెద్దన్నయ్య పిల్లలు.
