నేను నాన్న ముందు చెప్పలేదుగానీ అమ్మకు అతన్ని చేసుకోనని చెప్పాను. కానీ అమ్మా, నాన్న చిట్టచివరికి ఆత్మహత్య చేసుకుంటామన్న బెదిరింపుకి దిగారు. తమ్ముడికి, చెల్లెళ్ళకు విషమిచ్చి చంపి, తామూ చచ్చిపోతామని భీష్మించుక్కూర్చున్నారు.
ఇక నేను మెత్తపడక తప్పలేదు.
ఎప్పుడయితే నేను మెత్తపడ్డానని కనిపెట్టాడో వెంటనే నాకు తెలియకుండానే వెళ్ళి నిశ్చయ తాంబూలాలు పుచ్చుకుని, పెళ్ళి ముహూర్తాన్ని నిర్ణయించుకుని వచ్చాడు నాన్న. ఇరవైవేల మహాత్యం మరి.
టౌన్లోని ఓ చిన్న సత్రంలో జరిగిపోయింది మా పెళ్ళి. అతి తక్కువమంది బంధువులు వచ్చారు. ఆహ్వానపత్రికలనే తక్కువమందికి ఇచ్చారు. ఈ పెళ్ళి వల్ల కలిగే గిల్టీనెస్ ని అలా బయటపెట్టుకున్నారు నాన్న, పెళ్ళికొడుకు.
పెళ్ళిపీటల మీద అతని పక్కన కూర్చోవడంతోనే అసహ్యం బయల్దేరింది నాలో. ఏదో బీభత్సదృశ్యాన్ని చూస్తున్నానన్న ఫీలింగ్ బట్టతల, రఫ్ గా వుండే ముఖంతో, మెలితిరిగిన మీసాలతో చిన్న చిన్న పురుగులతో చేసినట్లున్న అతన్ని చూస్తూంటే కంబటి బూచీలు నన్ను చుట్టుకున్నట్లు భావించాను.
ముఖం దించుకుని కూర్చున్న నేను పెళ్ళితతంగం ముగిసేవరకు తల పైకెత్త లేదు. మంగళసూత్రధారణ జరుగుతున్న సమయంలో మానసికంగా చచ్చిపోయాను. జీవచ్చవం అంటే ఏమిటో ఆ క్షణంలో నాకర్ధం తెలిసింది.
పెళ్ళిలో కాళ్ళు తొక్కోవడాలూ, ఉంగరం తీయడం కోసం పోటీ పడడాలూ, గిల్లుకోవడాలూ ఏమీలేవు. అది పెళ్ళిలా కాకుండా శ్రాద్ధకర్మలా అనిపించింది.
పెళ్ళి అయిపోయాక ఊరికెళ్ళాం. మా వూరి ముందున్న చెరువు నన్ను రమ్మన్నట్టే వుంది. విశాలంగా చిన్న చిన్న అలలతో వూగుతున్న చెరువును చూడగానే చచ్చిపోవాలన్న బలమైన కోరిక కలిగింది. జీవించాలని రెట్టింపు ఉత్సాహం కలగాల్సింది పోయి ఆత్మహత్య చేసుకోవాలన్న బుద్దిపుట్టడం నా తప్పు కాదు. మా నాన్న చేసిన తప్పు.
ఇంటికెళ్ళాం. కొత్త పెళ్ళికొడుకుని చూడడానికి వూళ్ళోని అమ్మలక్కలు గుంపులు గుంపులుగా రావడం మొదలుపెట్టారు. వాళ్ళు నా వేపు జాలిగా, సానుభూతిగా చూస్తుండడం తల పైకెత్తకుండానే కనిపెట్టగలుగుతున్నాను.
రాత్రయింది. హడావుడి కాని హడావుడి స్నానం చేసి తెల్లచీర కట్టుకోమన్నారు. తెల్లటి జాకెట్టు తొడుక్కోమన్నారు.
మౌనంగా అన్నీ అలంకరించుకున్నాను. పిలుపొచ్చేవరకు ఆగమన్నారు. వెళ్ళి ఇంటి వెనుకనున్న గచ్చుమీద కూర్చున్నాను.
ఆకాశంలో చందమామ ఉత్త మైనపు ముద్దలా వుంది. వెన్నెల ఇసుక తుఫాను సమయంలో లేస్తున్న దుమ్ములా వుంది. గాలి చల్లగా కాకుండానే వేడిగా తగులుతుంది. వూరంతా మాటు మణిగింది. మరి కాసేపట్లో ఏదో ఉపద్రవాన్ని వూహిస్తున్నట్లు వూరకుక్క అదేపనిగా అరుస్తోంది.
పదిగంటల సమయంలో అనుకుంటాను మా అమ్మ వచ్చి నా చేతిలో పాలగ్లాసు పెట్టింది.
"వెళ్ళు"
నిశ్శబ్దంగా అడుగులు వేశాను. వంటగదిలో అన్నీ ఓ మూలకుసర్ది పడక వేశారు.
మా ఆంట్లో వున్నవి రెండే గదులు ముందు గదిలో దుకాణం వుంది దాని వెనుక పెద్ద వంటగది. ఆ గదిలోనే ఇప్పుడు పడకవేశారు. నవారు మంచం మీద పరుపువేసి, దానిమీద దుప్పటి పరిచారు. పక్కన ఓ స్టూలువేసి పెళ్ళిలో మిగిలిపోయిన బాదుషాలు కాబోలు నాలుగో అయిదో వుంచారు. మిక్చర్ అయిపోయినట్లుంది. కారం ఏమీలేదు.
పాలగ్లాసుతో తలుపుదాటి నిలుచున్నాడు. సిగరెట్ తాగుతున్న ఆయన పొగలోంచి నన్ను చూసి తలుపు వేసేసి ఇటురా' అన్నాడు.
నేను కదల్లేదు.
"సిగ్గేమో ణ ఆమోద్తి పెళ్ళాన్ని క్కూడా భలే సిగ్గు. మొగుడి దగ్గర సిగ్గూ, తల్లి దగ్గర ఆకలీ దాచుకోకూడదే అనేవాడ్ని"
పళ్ళికిలిస్తున్న ఆయన్ను చూస్తుంటే ఇంటిద్వారం పైన వేలాడదీసే దిష్టిబొమ్మ కళ్ళముందు మెదిలింది.
విసురుగా వచ్చి తన ప్రతాపం చూపించడానికి తలుపు బలంగా మూశాడు. ఆ శబ్ధాన్ని వింటుంటే నా ఎముకలు విరుగుతున్నట్లే వుంది.
నన్ను లాక్కుని వెళ్లి మంచంమీద కూర్చోబెట్టాడు. పాలగ్లాసును స్టూల్ మీద వుంచాను.
"ఏం పేరు? మరిచిపోయాను"
శోభనం గదిలో పెళ్ళాం పేరడిగే దౌర్భాగ్యస్థితిలో వున్నాం మనం. ఐదు నిముషాల పెళ్ళి చూపుల పరిచయంలో ఎదుటి వ్యక్తి గురించి ఏం తెలుస్తుంది? మా ఆయన మరీ అధ్వాన్నం గనుక పేరు మరిచిపోయాడు. తేడా చాలా స్వల్పమే.
"కైవల్య"
"అలా అంటే ఏమిటి?" అని అడిగాడు.
"మోక్షమనుకుంటా"
"అర్ధంకాని పేరు పెట్టుకున్నావే" అంటూ నన్ను గట్టిగా వాటేసుకున్నాడు. ఎలుగుబంటు పట్టుకుని వున్నా అంతగా జడుసుకుని వుండేదాన్ని కానేమో జుగుప్స లాంటిది శరీరాన్ని కుంచింపజేస్తోంది.
తలనంతా లాగి చెంపమీద కొరికాడు. గుండెల్లో రేగిన మంట కళ్ళనీళ్ళ రూపంలో తేలింది.
ఇక ఆయన మాట్లాడడని నాకు తెలిసిపోయింది. శోభనం ముందు నా భర్త మాట్లాడిన మాటలు అవే. బయటనున్న చందమామ జాలిగా నన్ను చూసి నవ్వుతున్నట్లే వుంది. పొగపొయ్యే కిటికీ గుండా వెన్నెల బూజులాగా వేలాడుతోంది.
జాకెట్ హుక్ ల కోసం వెదుకుతున్న ఆయన చేతులు ముళ్ళకంచెతో పేరుకుతున్నట్లు కదులుతున్నాయి. జాకెట్టు మధ్యన వేళ్ళు పోనిచ్చి లాగాడు. హుక్కులన్నీ తెగిపోయాయి. పందొమ్మిదేళ్ళ పరువాన్ని తమలో కలిపేసుకున్న నా ఎద సంపద పొంగాల్సిందిపోయి విచిత్రంగా టచ్ మి నాట్ ఆకుల్లాగా ముడుచుకు పోయాయి.
బ్రా ఎలాస్టిక్ ను సాగబెరికి వదలడంతో కొరడా చివర తగిలినట్లు విలవిల్లాడిపోయాను. దాన్నీ తెంపాలని చూశాడు వీలైంది కాదు. ఉంగరం చేయి గుచ్చుకుంటూ వుండగా దాని బంధనాలను విప్పాడు.
ఆయనకు కావాల్సింది స్త్రీ కాదు - స్త్రీ శరీరం భార్య చనిపోయిన దగ్గర్నుంచీ పస్తులుంటున్నాడు కాబోలు ఆకలిగొన్న సింహంలా మీద పడ్డాడు. ఇలాంటి ఆన్ ఈస్టటిక్ వెధవని ఏ అమ్మాయి ప్రేమించి శరీరాన్ని ఇవ్వగలదు? అందుకే స్త్రీ శరీరం పట్ల మంచి యావతో వున్నట్టున్నాడు. ఆయన తోసిన తోపుకి మంచం అడ్డ బలంగా తగిలింది. రక్తం ఏమైనా వస్తూ వుందేమోనని చూసుకోవాలనిపించింది. అప్పటికే నా చేతుల్ని తీసుకుని లాగి పట్టుకుని వున్నట్లు తెలిసి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను.
పాపం నా తెల్లటి కాటన్ చీర అప్పటికే ఆయన మురికిని పీల్చుకుని నల్లగా ముఖం పెట్టింది.
కుచ్చిళ్ళను పట్టుకుని మోటుగా పైకి లాగాడు. పువ్వుకున్న రేకులన్నిటినీ దూసేసినట్లు అతని చేతులు కదిలాయి. లంగా బొందును చిక్కు ప్రశ్నలా మరింత బిగుసుకుపోయింది. దాన్ని పట్టుకుని గింజుతున్నాడుగానీ అది ఊడిరావడం లేదు. నా శరీరంమీద అగ్గులవాన కురుస్తున్నట్లే వుంది. కణాలన్నీ తమలోకి తామే ప్రవహిస్తున్నట్లే ముడుచుకుపోయాను. మూడంకె వేసుకుని బిగదీసుకుపోయాను.
