Previous Page Next Page 
ధర్మ చక్రం పేజి 20


                                        24
    ధర్మారావు చెప్పిన విషయం విన్న అర్జున్ విపరీతశ్చర్యం ప్రకటించలేదు కాని, కొంత దిగ్బ్రమ చెందిన మాట వాస్తవం.
    "అయితే చాలావరకు పోయాయన్న మాట ప్రయత్నాలు!" అన్నాడు తల పంకిస్తూ. "మీరు సందేహించకుండా చెప్పండి. ఎవరిని ఊహిస్తున్నారు, మీరు?"
    ధర్మారావు మాట్లాడలేదు.
    "మీ ప్రవర్తన వల్ల విపరీతంగా ఎవరికి బాధో, వారే కదా ఇటువంటి డానికి ప్రయత్నించడం?"
    అప్పటికీ ధర్మారావు మాట్లాడలేదు.
    అర్జున్ నవ్వుతూ అన్నాడు; "మరీ ఇంతటిది కాకపోయినా, ఇటువంటిదే నాకూ ఒక ఆకాశ రామన్న ఉత్తరం వచ్చింది -- 'అనవసర వ్యవరాలలో జోక్యం కలిగించుకోవ'ద్దని హెచ్చరిస్తూ. నా అనుమానం బాగా ఒక వ్యక్తీ పైన ఉన్నది."
    ఇక ధర్మారావు తప్పని సరిగా అన్నాడు: "నేననుకోవడం -- కాంట్రాక్టరు భుజంగం, జైలు వార్డెన్ రాధాయ్ -- ఈ ఇద్దరిలో ఎవరో ఒకరయి ఉంటారని."
    "అవును. సరే. ఇటువంటి వాటిలో ఆరితేరిన వాడిని. కనుక్కోవడం నాకేమంత కష్టమైన పని కాదు. ఎలాగో వాళ్ళ వెలి ముద్రలు సంపాదించి, అవీ, ఇవీ నిపుణుల కు పంపించుతాను."
    "ఎట్లా సంపాదిస్తారు?" అన్నాడు ధర్మారావు.
    "చూస్తారుగా? రండి నాతొ."
    ఇద్దరూ అర్జున్ కారులో బయలుదేరారు.
    "అర్జున్ గారా? నమస్కారాలు. నమస్కారాలు." కారు ఆగేసరికి ఇంట్లో నుంచి పరుగెత్తుకు వచ్చాడు భుజంగం. పక్కనే ఉన్న ధర్మారావు ను చూచి ముఖం కొంచెం ముడుచుకున్నాడు.
    "ఆ! బాగున్నారా ? ఈ మధ్య కలవలేదు. ఇలా పోతూ ఓసారి పలకరిద్దామని . అంతే. పెద్ద పనేమీ లేదు. "స్టీరింగు ముందు కూర్చుని, కారు దిగకుండానే మాట్లాడుతున్నాడు అర్జున్. కింద నిల్చుని అతివినయం ప్రకటిస్తూ మాట్లాడు తున్నాడు భుజంగం.
    "ఒక్కసారి దిగి లోపలికి రండి. రండి, ధర్మారావు గారూ, కాస్త కాఫీ తీసుకుని వెళ్ళుదురు గాని. మా ఇల్లు పావనం చేయండి."
    ధర్మారావు అర్జున్ వైపు చూచాడు. అర్జున్ సిగరెట్ కేసు తీసి సిగరెట్ వెలిగించి, ఏదో ఆలోచిస్తున్నట్లు పరధ్యానంగా సిగరెట్ కేసును కర్చీప్ తో శుభ్రంగా తుడుస్తూ , "ఇప్పుడు కాదండీ. మరోసారి వస్తాము. ఏమిటో అనవసరమైన పనులు నెత్తి నేసుకు తిరగడం మామూలై పోయింది. ఈ ధర్మారావు గారొచ్చిణ దగ్గర నుంచీ" అంటూ ఓరగా చూచి నవ్వాడు. ఆ నవ్వడం లో సిగరెట్ కేస్ కింద రోడ్డు మీద పడిపోయింది.
    అరెరే,' భుజంగం చటుక్కున వంగి తీసి అందించాడు.
    "థాంక్స్ . "కర్చీఫ్ చేత్తోనే అందుకుని , అలాగే చుట్టి జేబులో వేసుకున్నాడు అర్జున్. "వస్తాము, మరి." అంటూ ఇంజను స్టార్టు చేశాడు, భుజంగం నమస్కారాలను అందుకొంటూ, ధర్మారావు తో గుంభనంగా నవ్వుతూ.
    సెంట్రల్ జెయిల్ ముందు కారు ఆగగానే పోలీసులు పరుగెత్తి వచ్చి సెల్యూట్ కొట్టారు. లోపలికి వెళ్ళుతుండ గానే వార్డెన్ ఎదురు వచ్చి నమస్కరించాడు.
    "ఆ ఎట్లా ఉన్నాయి, ఖైదీ ల వ్యవహారాలు?' యధాలాపంగా అడిగినట్లు అడుగుతూ పరధ్యానంగా నడుస్తున్న అర్జున్ చేతిలోని గాగుల్స్ జారి కింద పడ్డాయి. తీసి అందించాడు. వెనకనే నడుస్తున్న వార్డెన్. అర్జున్ వెంటనే అందుకోలేదు. సంభాషణ ధోరణి లో. ఆ కళ్ళద్దాలను అటూ ఇటూ తిప్పుతూ, చేతి వేళ్ళతో రాస్తూ కడకు అర్జున్ కారు ఎక్కి కూర్చున్నాక సెలవు తీసుకుంటూ అందించాడు వార్డెన్. రుమాలుతో నుదురు ఒత్తుకుంటున్న అర్జున్ ఆ రుమాలు తోనే అందుకొని అలానే జేబులో ఉంచుకున్నాడు అ కళ్ళద్దాలను.
    "చూశారా, ఎలా సంపాదించానో వాళ్ళ వెలి ముద్రలు? ఈ రెండు వస్తువులూ, ఆ కత్తీ, ఉత్తరం ఇప్పుడే వేలి ముద్రల నిపుణుడి కిద్దాము. రెండు గంటలలో మనకు వ్యవహార మంతా విపులమై పోతుంది."
    ఫలితాలు చూచిన ధర్మారావే కాదు, అర్జున్ కూడా అతిగా ఆశ్చర్యపోయాడు. కత్తి మీద వేలి ముద్రలు భుజంగానివి. ఉత్తరం మీద వార్డెన్, భుజంగం -- ఇద్దరి చేతి వేళ్ళ ముద్రలు ఉన్నాయి. అర్జున్ కు వచ్చిన ఉత్తరం మీద భుజంగం వేలి ముద్రలున్నాయి.
    "ఏం చేద్దాము?' అర్జున్ అడిగాడు ధర్మారావును.
    "వాళ్ళెం చేయగలరు, అటువంటి చాటు పనులు తప్ప? మనకేం తెలియనట్లు తటస్థంగా ఊరుకుందాము."
    "కాదు, కాదు" అర్జున్ అంగీకరించలేదు. "ఇది అంటు జాడ్యం కంటే ప్రమాద భరితం. ఆరంభం లోనే అంతం చేసేయాలి."
    "గొడవలవు తాయేమో?"
    "కావనే ఆశిద్దాము. అయినా ఫర్వాలేదు." అంటూనే అప్పటికప్పుడే పోయి జైలు సూపరింటెండెంట్ ఆఫీసులో కూర్చున్నారు. వార్డెన్ సిద్ధమయ్యే ఉన్నాడు. కబురంప గా అప్పటికప్పుడే కాంట్రాక్టరు కూడా వచ్చేశాడు. నక్క వినయాలు ప్రదర్శిస్తూ.
    "ఏం, బాబూ, పిలిపించారట?"
    "అవును" కర్కశంగా ఉంది అర్జున్ గొంతు.  "ఓ విషయం లో మీ సలహా తీసుకుందామని."
    బిత్తర పోయాడు భుజంగం.
    "ఇది కాస్త చదివి పెట్టండి." ఉత్తరం అతడి కందించాడు.
    అందుకోలేదు భుజంగం. నిర్ఘాంతపోయి నిలబడ్డాడు.
    'అరె. తీసుకోరేం? కాస్త ఇది చదివి మీ సలహా చెప్పండి, ఏయ్, వార్డెన్! నువ్వు కూడా చూడు దాన్ని కాస్త."
    తప్పనిసరిగా అందుకుని శిలలా నిలబడ్డాడు భుజంగం.
    వార్డెన్ ఆ కాగితాన్ని అందుకుని చూస్తూ, "ఎవడో బుద్ది తక్కువై వ్రాశాడు. ఎందుకింత కలవరం మీకు, అయ్యగారూ?' అన్నాడు.
    "అదేనోయ్ , ఎవడా బుద్ది తక్కువ గాడిద -- అని? నీకేమైనా తెలుసా?"
    "మాకేం తెలుసండీ?"
    "షటప్!" దూకుడుగా లేచాడు అర్జున్.
    "తొందర పడకండి" అంటూ వారించాడు ధర్మారావు.
    వినిపించుకోలేదు అర్జున్. ఏం, భుజంగం ఏమంటావు?"
    ఈ హటత్పరిణామానికి దిమ్మెర పోయిన భుజంగం మెల్లగా తేరుకొని "ఇదేమిటి సూపర్నెంటు గారూ? మీరేమిటో తొందర పడుతున్నారు..." అంటూ ఏమిటో చెప్పబోయాడు.
    "కట్టి పెట్టు. "గర్జించాడు అర్జున్. "ఎవ్వరికీ తెలియని విషయమైతే డబాయించే అవకాశ ముంటుంది. ఇదిగో, చేతివ్రాత, వేలిముద్రలు అన్నీ రుజువై వచ్చాయి."
    మ్రాన్పడి పోయాడు భుజంగం. అప్పటికప్పుడే అర్జున్ ఫోన్ చేసి సబిన్స్పెక్టర్ల ను రప్పించాడు.
    వారికి విషయమంతా వివరించాడు అర్జున్.
    మరి లాభం లేదనుకున్న వార్డెన్ , భుజంగం -- ఇద్దరూ "ఈ తప్పును క్షమించండి" అంటూ అప్పటికప్పుడే టపటపా లెంపలు వాయించేసు కున్నారు. ఆ నీచత్వం చూస్తున్న అందరికీ అసహ్యం కలిగింది.
    అర్జున్ సబిన్సేక్టర్ల వైపు తిరిగాడు. "చూచారుగా? వీళ్ళు వయో ముఖ విష కుంభాలు. ఈ విషయం మీకు తెలిసి ఉండడం మంచిదని మీ ఎదురుగా ఒప్పించాను. ఇక నుంచి వీళ్ళ మీద ఓ కన్నేసి ఉంచండి. అసలు వీళ్ళనేమైనా చేద్దును కాని, ధర్మారావు గారి వల్ల క్షమించి వదిలెయ వలసి వస్తోంది."
    "అలాగే, గుర్తుంచు కుంటాము." అన్నారు సబి న్స్పెక్తర్లు.
    "మరి మనం వెళ్ళుదాము" అని లేచాడు ధర్మారావు.
    "చూచారయ్యా , అయన స్వభావం? ఇంత వరకూ మిమ్మల్ని పన్నెత్తి ఒక్క మాటైనా అన్నాడా, మీరింత చేసినా?" అన్నాడు అర్జున్ భుజంగాన్ని చూస్తూ.
    భుజంగం ముఖం కంద గడ్డలా చేసుకుని నేలకేసి చూస్తూ నిలబడ్డాడు.
    "సరే. ధర్మారావు గారి మాట ప్రకారం నేను మిమ్మల్నేమీ చేయదలుచు కోలేదు గాని, మిమ్మల్ని ఇలా తేలికగా మాత్రం వదలను. ఇవిగో కాగితాలు. ఇంత బుద్ది తక్కువగా మరెప్పుడూ ప్రవర్తించ మని క్షమాపణ పత్రాలు వ్రాసి ఇవ్వండి."
    వార్డెన్ మాట్లాడలేదు కాని, భుజంగం అభ్యంతరం చెప్పాడు.
    "ఆలోచించాలి. నేను క్షమాపణ వ్రాసి ఇవ్వను, ఇప్పుడు."
    "ఇస్తేనే అసలిప్పుడు నిన్ను వదిలి పెట్టేది. ఆలోచించుకో -- బతుకు రట్టు చేసుకుంటావో , ఇంతతో ఈ తప్పును మాపెసు కుంటావో."
    మరి కిక్కురుమనలేదు భుజంగం.
    ఇద్దరి చేతా ధర్మారావు కూ, తనకూ కూడా క్షమాపణ లు వ్రాయించి తీసుకొని వదిలి పెట్టాడు అర్జున్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS