Previous Page Next Page 
విధి విన్యాసాలు పేజి 28


    ఓ సాయంత్రం అయిదు గంటల వేళ ఆకాశం మేఘామృతమైంది. సుడిగాలులు వీస్తున్నాయి. ఇక వర్షం ప్రారంభం కావచ్చు...... కలవరపాటుగా ప్రకృతి వైపు భయంగా చూస్తుంది బస్సు కోసం వెయిట్ చేస్తూన్న పద్మజ.
    స్కూటర్ మీద స్పీడుగా ముందుకు పోతున్న వాసు సడన్ బ్రేక్ వేసి, చప్పట్లు చరిచి, "పద్మజా!" అని పిలిచాడు.
    "హమ్మయ్యా!" అంటూ చిన్నగా నవ్వి గబగబా అతని దగ్గరికి వచ్చి, "ఇంటికేనా వెళుతున్నావు?' అని ప్రశ్నించింది పద్మజ.
    పైన మబ్బులు కమ్మిన ఆకాశం -- ధూళిని రేపే సుడిగాలులు. బస్సు కోసం వెయిట్ చేసే నలుగురు కాలేజీ విద్యార్ధులు. ఇన్నిటి మధ్యా ఆ వాతావరణం లో తన వైపు ఆశగా చూసే పద్మజ.
    "ఆ ఇంటికే! వస్తావా?' అత్రతగా ఆమె వైపు చూశాడు వాసు.
    "బస్సు వచ్చేస్తుందేమో?' బస్సు స్టాపు లో నిలుచుని, తన వైపు వెకిలిగా చూస్తున్న కాలేజీ విద్యార్ధుల వైపు చూసిన పద్మజ- "అల్లరి వెధవలు" అని సన్నగా గొణిగింది.
    "లాభంలేదు. వర్షం వచ్చేస్తుంది. నాతొ వచ్చేయ్." స్కూటర్ స్టార్ట్ చేశాడు వాసు.
    బిడియంగా వెనక కూర్చుంది పద్మజ- "జాగ్రత్త, నా భుజం మీద చెయ్యి వెయ్యి" అన్నాడు వాసు. స్పీడుగా పోతున్న స్కూటర్ కుదుపుతో అతని స్పర్శ ఆమె శరీరంలో విద్యుత్తు . ఏదో తియ్యని పులకింత....ఇల్లు చేరాకముందే ఉమ్మిరిగా వర్షపు జల్లు.
    "పిల్లలిద్దరూ ఇల్లు చేరలేదు. తడిసి పోయారేమో?" వీధి అరుగు చివర నిలుచుని అటూ ఇటూ అత్రతగా చూస్తుంది మధుమతి.
    నిండా తడిసి స్కూటర్ దిగుతున్న వాసూ, పద్మజా ఇద్దరినీ చూస్తూ, "అనుకుంటూనే ఉన్నాను, తడిసి పోతారని!" అని గబగబా చెరొక టవలు అందించి, "ప్చ్! కట్టంత తల..... అర విప్పుకో. కాస్త సాంబ్రాణి వేస్తాను. పద. బస్సు దొరకలేదా?" అంది మధుమతి. పద్మజ జడ విప్పబోతూ.
    "ఛ, ఛ! ఈ వేళ శనిలా బస్సు దొరక్క పోవడం -- వర్షం. సిగ్గయి పొయిందత్తయ్యా" అంటూ చటుక్కున పమిట పై తువ్వాలు కప్పు కుంది పద్మజ.
    "శని లాగే ఉంటుంది లే, మరి! ఆ అల్లరి వెధవల మధ్య వదిలి రావలసింది.సిగ్గు వదిలి పోను అమ్మాయికి" అంటూ నిండా తడిసిన ఆమె వైపు చూసి చప్పున చూపులు తిప్పుకున్నాడు వాసు.
    చిలిపిగా అతని వైపు చూసి విసురుగా ఇంట్లోకి వెళ్ళిపోయింది పద్మజ.
    నిండా తడిసిన ఆమె ఎంతో అందంగా కనుపించి ఒక్కసారి అతని మనస్సు చలించింది.
    కట్టంత తల తడిసిపోయిందని ఒకటే వగుస్తున్నావు. చెట్టంత పిల్లని. నీకు ప్రాణ సమానమైన అమ్మాయిని జాగ్రత్తగా ఇంత వర్షం లో ఇంటికి చేరవేశానే -- నన్నేమన్నా పోగిడావా?" నవ్వుతూ అడిగాడు మధుమతిని.
    "బాగుంది! వదిలేస్తానేమిటి? ఎవరి కోసం తీసుకు వస్తావు? తల గట్టిగా తుడిచేస్తానిలారా. జలుబు చేస్తుంది.' అంటూనే వాసు తల తుడిచి , "బట్టలు మార్చుకో, కాఫీ తెస్తాను. పాపం, అసలేఅది సిగ్గు పడుతుంటే హాస్యం కూడా చేస్తున్నావు?" అంది మధుమతి నవ్వుతూ.
    వేడి కాఫీ గ్లాసు తో వచ్చిన మధుమతి వైపు చూస్తూ , "మా పిల్లల డ్యూటీ పూర్తిగా నీకు వదిలేసినట్టుంది అమ్మ. నాకు చెప్పత్తయ్యా, నీకేమన్నా సాయం చేస్తాను." అంది పద్మజ.
    "అయితే మేడ మీద ఉన్నాడు కాబోలు -- బావకి కాఫీ ఇచ్చేయ్."
    "ఫో, అత్తయ్యా..... అసలే నే సిగ్గుపడి చస్తుంటే బావా గీవాను. పైగా కాఫీ తీసుకెళ్ళి ఇవ్వమంటావు!" చిరుకోపం ప్రదర్శించింది పద్మజ.
    "నా అమ్మవు కదూ?" గడ్డం పుచ్చుకుని తన వైపు తిప్పుకుంది మధుమతి.
    "నీ అమ్మను నేనెలా అయ్యానూ!" నవ్వే పెదవులు అదిమిపెడుతూ అంది పద్మజ.
    "ఇప్పుడే అన్నావు ౦ నా డ్యూటీ ఏదన్నా చెబితే చేస్తానని, ఇప్పటికే వందసార్లు పైకి వెళ్ళి దిగానో! నా కాళ్ళు నెప్పులు పెడుతున్నాయ్. ఇచ్చిరా! బజ్జీలు ఉన్నాయి కాని చల్లారిపోయి ఉంటాయి, తింటాడేమో అడుగు."
    "నువ్వు మరీ, అత్తయ్యా!" విసురుగా ఆమె చేతిలో కాఫీ గ్లాసు అందుకుని మేడేక్కింది పద్మజ.
    కాఫీ గ్లాసు టక్కున చప్పుడు చేస్తూ టేబిలు మీద పెట్టింది.
    వాసు అటు వైపు చూశాడు.
    ఆమె గిరుక్కున వెనుదిరిగింది.
    "టిఫినేమన్నా ఉందా? ఆకలిగా ఉంది."
    "బజ్జీలు , చల్లారాయ్ తింటావా?"
    "తీసుకురా...."
    "అమ్మో! ఇన్ని తినగలవా?" ఆమె చేతిలో ప్లేటందుకుంటూ అన్నాడు వాసు.
    "ఆకలిగా ఉందన్నావు కదూ?" నవ్వబోయింది పద్మజ.
    "నువ్వు కూడా తిను..... నే నిన్ని తినలేను." అతని ప్లేట్లో బజ్జీలు రెండు చేతిలో కి తీసుకుంది పద్మజ.
    ఆ రాత్రి ఆమె మనస్సు లో ఏవో మధురమైన కొత్త ఊహలు. ఆ ఊహాలన్నీ వాసు చుట్టూ అల్లుకున్నాయి.
    మరునాడు అతన్ని చూస్తూనే ఆమె కనురెప్పలు బరువుగా వాలిపోయాయి.
    "రాత్రి ట్యూషను కి రాలేదేం? ఏమలా ఉన్నావు? ఒంట్లో బాగుండలేదా?" ప్రశ్నించాడు వాసు మాములుగా.
    "అవును, వాసూ . ఇంపార్టెంట్ లేసెన్సు ఉన్నాయి. అడగాలను కున్నాను. ఇప్పుడు వీలవుతుందా?" అడిగింది మత్తు ఊహల్ని అవతలికి నెట్టి వేస్తూ.
    "రోజుకన్నా ఓ అరగంట ముందు పోవాలి ఈవేళ. సాయంత్రం చెబుతాను లే. కాలేజీ ఎగ్గొట్టేయ్.' నవ్వింది పద్మజ.
    రోజూ అరగంటో, పావుగంటో , పగలో, రాత్రో, తనకై తానూ పిలిచి ట్యూషను చెబుతాడు వాసు. అతను లెక్చరిస్తుంటే మంత్రముగ్ధలా చూస్తూ వింటుంది పద్మజ.
    ఓ ఆదివారం సాయంత్రం ఐదు గంటల వేళ వాసు గది వైపు నడిచిన మధుమతి టక్కున ఆగి గదిలోంచి వస్తూన్న మాటలు శ్రద్దగా వింటుంది.
    "ఛ ఛ! నీకు బుర్ర లేదు. నిన్న చెప్పిన పాఠం మళ్ళీ ఈవేళ చెప్పాలి. అసలు నీకు చదవాలనే దృష్టి లేదు, పద్మజా! చక్కగా మానేసి వంట నేర్చుకో. మీ నాన్న డబ్బులు దండగ చెయ్యక. నా చదువు పాడు చేస్తున్నావ్. నీకు పాఠాలు చెబితే నా బుర్ర పాడవుతుంది. దయచేసి మరి నా గదికి రాకు.' విసుగ్గా , చిరాగ్గా అన్నాడు వాసు ఇంగ్లీషు లో.
    "వాసూ!' మందలింపు గా మధుమతి గొంతు విన్న వాసు ఉలిక్కిపడి, "ఆహా కాదమ్మా!' అన్నాడు.

                                 
    "అత్తయ్యకు ఇంగ్లీషు వచ్చు. ఇంకెవరికీ అర్ధం కాదని ఇంగ్లీషు లో నాకు ఉద్వాసన చెబుతున్నావ్. అసలు కోపం వస్తే నువ్వెలా ఉంటావో చూడాలనిపించి ...." అంటూ పకపకా నవ్వింది పద్మజ.
    "సరే, సంతోషం..... అయినా ఇటుపైన నాకు అవసరం లేదు. నేను చెప్పను..." ఉదాసీనంగా కందింది వాసు మొహం.
    "వాసూ! ఏమిటా అర్ధం లేని కోపం? .... ' కలవరంగా ఉంది మధుమతి గొంతు.
    "మరేం ఫరవాలేదత్తయ్యా! ఒకటే బోర్ కొట్టిం చేస్తుంటే ఏం చేస్తాడు, పాపం! తెనుగూ, ఇంగ్లీషు నరకరం చేసి నాలుగు చీవాట్లేశాడు. యూనివర్శీటీ లో చదువుతున్నాడంటే ఎంత హుషారుగా ఉండాలి? ప్చ్! నీ కొడుకు వట్టి బుద్ధావతారం లా.... అసలితని లో కోపం, తాపం -- ఇలాంటి వెనన్నా ఉన్నాయా లేవా అనుకుంటున్నాను. వారం రోజులై ట్రై చేస్తున్నాను ఇతనికి బాగా కోపం తెప్పించాలని. ఊ హు..... లాభం లేకపోయింది. ఈవేళ రాబోతుంటే మధ్యలో నువ్వొచ్చావు." మధ్య మధ్య నవ్వుతూ అంటూన్న పద్మజ--" నీలా తల్లిదండ్రుల మధ్య బ్రతికే అదృష్టం నాకుంటే నీకన్నా హుషారుగా ఉండేది నాకు" అన్న నిష్టూర స్వరం విని, "వాసూ!' అని బాధగా అంది.
    "ఎందుకురా అంత బరువైన మాటలు!" మందలింపు గా అడిగింది మధుమతి.
    చప్పున పద్మజ కళ్ళనిండుగా నీళ్ళు తిరిగాయి. "హస్యానికన్నాను, గాని, నువ్వింత సీరియస్ గా తీసుకుంటా వనుకోలేదు." అంది జీరబోయిన గొంతుతో పద్మజ.
    "చూడు, పాపం, ఎంత బాధపడుతుందో! కాస్త సున్నితంగా మాట్లాడ్డం నేర్చుకో" అంటూ వాసుని మందలించి, పద్మజ కళ్ళు చీర చెరగుతో తుడిచింది మధుమతి.
    "ఈవేళ సెలవురోజు. మంచి పిక్చరోచ్చింది. వెళదామానుకున్నా నమ్మా!"
    "అయితే వెళ్ళు" అంది మధుమతి వాసు మాటకు అడ్డు వస్తూ.
    "సారీ! దొర్లిన నాలుగు క్షణాలూ మరిచి పోదాం. నా కోసం నీ కళ్ళలో నీరు తెప్పించింది. క్షమించు. పోదామా సినిమాకు?' మెత్తని గొంతుతో అన్నాడు వాసు.
    ఒక్కసారి మధుమతి వైపు , ఒక్కసారి వాసు వైపు చూసి చూపులు వాల్చింది పద్మజ.
    "పది నిమిషాలు. వెళ్ళగలమా?" అంటూ వాచీ చూసుకొన్నాడు వాసు.
    "ఏ టాకీస్, వాసూ! దూరమా?" ఇంకా గొంతులో దుఃఖ చ్చాయలు ఉన్నాయి.
    "మినర్వా-- దూరమే, శ్రీను వస్తాడా?"
    "రాడు వాడూ -- స్కూటరుందిగా? పోనీ, నువ్వెళ్ళు." అని వాసుకి చెబుతూ మధుమతి వైపు చూసింది పద్మజ.
    "వెనక కూర్చున్నంత మాత్రాన కొంప లంటుకు పోవు. వెళ్ళండి" అంది మధుమతి.
    "వస్తావా?" నవ్వుతూ అడిగాడు వాసు.
    అతన్నేలా అన్నా సంతోషపెట్టాలనుకుంటున్న పద్మజ, గబగబా తయారయి వచ్చింది.

                                             *    *    *    *   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS