Previous Page Next Page 
ప్రేమతో ...వడ్డెర చండీదాస్ పేజి 3

     ఆ క్షణాలు యిప్పటికి తరచూ గుర్తొస్తున్నాయి. చాలా బాధేస్తుంది.  చాలా చాలా బాధేస్తుంది. ఎంత గాడంగా బాదేస్తుందంటే నాప్తె  నాకే తీవ్రమ్తెన  కోపం వచ్చేంత బాధేస్తుంది. నేను బయటికి వస్తుంటే, ఎప్పుడూ  తలుపు బయట దాటిరాని వారు ఆరోజు ఆ మెట్ల దగ్గర వరకు  వచ్చి 'కాళిదాసు  భట్టాచార్యాగారికి  నేనిచ్చిన మాట -మూడువందల పేజీల ప్తెన  Desire అండ్ Liberationని వివరించడం - యిప్పటికి మీ ద్వారా తిరబోతున్నదన్న మాట',  మాటలను నెమరు వేసుకుంటుంటే నాకు గ్రీకు తత్వవేత్త సోక్రటీసుకు దండనగా  విషం తాగించిన తర్వాత చనిపోక ముందు అతనన్న ఆఖరి మాటలు  ప్లేటో తన డయలాగు  phaedo లో  నివేదించిన వాఖ్యాలు:
    "crito, we ought to offer  a cock to  Asclepious. see to it, and don't  forget'
    No , it shall be done, said crito. Are you sure that there is  nothing else?
    Socrates made no reply to  this question, but after  అ little  while he stirred, and  when  the  man uncovered him, his  eyes  were fixed. when  crito saw this, he closed తే mouth and eyes."
    సోక్రటిస్ చనిపోతాడని crito కి మిగతా అక్కడి వాళ్ళకు తెలుసు. కాని రెండుమూడు నెలల తర్వాత, తనిచ్చిన మాట తీర్చడం కోసమే  వేచి వున్నట్లుగా యిలా అనంత లోకాలకు చేరుకుంటారని నేను కలలో కూడా ఊహించలేదు. తను భట్టాచార్యకిచ్చిన మాటను తీర్చడానికి  సర్వావిదాలా  కృషి చేస్తున్నాను. ఈ పుస్తకం దీనితో మూలగ్రంథమయిన Desire and  liberation ప్రచురించితే  చాలా బావుంటుంది. అలా ముగిసింది ఈ ఆఖరి కలయిక.
    ఈ సందర్భాలలో 'నిరుత్సాహపడకండి' అని ప్రోత్సహిస్తూ, ద్తేర్యం చెపుతూ వుత్తరాలు రాసేవారు. ఆ తర్వాత నేను హ్తేదరాబాదుకు తిరిగొచ్చి మళ్ళి పుస్తకం మీద పని మొదలు పెట్టినాను. డిసెంబరులో తన నవలలు, కథలను  పునఃప్రచురించాలని ప్రయత్నం చేశాను. ఈ విషయమ్తే రెండు వుత్తరాలు  వచ్చింది. అందులోని రెండు విషయాలను యిక్కడ ప్రస్తావించడం సముచితం. ఒకటి, తన మిత్రుడు పోలిస్ ఆఫీసర్ , కథకుడు సదాశివరావుగారు  తీసిన తన ఫోటోలో  నుదిటి ప్తె  మధ్యలో అడ్డంగా నీడ అడ్డం వచ్చి విభూతి గీతలా కనిపించడం. రెండవది కాళిదాసు భట్టాచార్యకు యిచ్చిన మాట నేరవేరబోవడం గురించి. ఈ రెండింటిలోని మర్మియా సూచనల్లాంటి వాటిని, పోలికద్వారా  విస్తరించి అర్ధం చేసుకోవడం, విపరితార్ధనికి దారితిస్తుందా లేదా అనేది నాకు చేరిన ఆఖరుది. ఆ తర్వాత మిగిలినవి జనవరి 30,2005న విజయవాడలో అనంత వాయువుల్లో కలిసిపోవడం. ఆ తర్వాత అనుక్షణికం పునఃముద్రించిన  సందర్భంలో విజయవాడలో ఆవిష్కరణ సభలో మళ్ళి, చాలా సంవత్సరాల తర్వాత రెండసారి బంగారు తల్లి రాధికా చేతనను చూడడం.
    శ్రీయుతులు సదాశివరావు, రాధికా చేతన, వాడ్రేవు చినవీరభద్రుడు, దూపాటి విజయకుమార్, ఒమ్మి రమేష్ బాబు, నామాడి శ్రీథార్ , ఎమ్. యస్. నాయుడు సంపాదక టిమ్ గా ఈ వుత్తరాలను చదివి సూచనలిచ్చినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పురుషోత్త్ కుమార్ చక్కగా , శ్రద్దగా అక్షరాలను కూర్చినందుకు నా కృతజ్ఞతలు.                                                                                                                                                                                                             - అడ్లూరు రఘురామరాజు
                                                                                                                                                                                      30 ఏప్రియల్, 2007     
                                                                                                         10 -1 - 84
    రఘుగారికి ,
    నమస్తే,
        మీరు రాసిన యెంతో చక్కని వుత్తరం - సెలవుల కారణంగా  యివ్వాల  చూశాను - బడికి వెడితే.
        గితాదేవి గూర్చిన మీ అనుభవాలు బావున్నాయి. గితాదేవి నా మనసున రూపొంది యిప్పటికి సరిగ్గా పాతికేళ్ళు. గడిచిన దశాబ్దం చివర్లో మరెందరో రూపొందారు. రూపొంది,       
        అందరూ బయటకెళ్ళి పోయారు జనంలోకి. వెళ్ళిపోగా, యెప్పటిలాగా యెప్పటికి నేనోంటరిగా, వొంటరితనంలోనే యెందరో రూపొంది - లోకంతో అనుక్షణికం, నాతో క్షణికం.
                                                                                                               -వడ్డెర చండీదాస్.
                                                                                                                    26 - 12-84
    రఘుగారికి,
    నమస్తే,        
        మీ మోక్షకాంక్షల అన్వేషణాయానం  అత్యంత అభిలాషణియం.
        'd. and l.' 51  పేజిలో మీ సందేహం అచ్చుతప్పకాదు. అది అంతే! సూత్రరూపంలో వున్నా రచన. చెప్పటం ప్రారంభిస్తే వివరణ యేంత్తేనా వుంటుంది. చెప్పకపోతే యేంతా వుండదు. మోక్షిస్తూ కాంక్షించే, కాంక్షిస్తూ మోక్షించే మౌనం!

                                                                   శుభాకాంక్షలతో,
                                                                                                               -వడ్డెర చండీదాస్.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS