Previous Page Next Page 
ఫస్ట్ క్రష్ పేజి 27

 

రాజుగారు ఇప్పుడిప్పుడే కొంచెం కూర్చోగలుగుతున్నారు. దిన కృత్యాలకు వాకర్ సహాయంతో తన పని తను చేసుకుంటున్నాడు. ఒక పర్సనల్ అటెండెంట్ కూడా పెట్టుకున్నాడు అవసరానికి. 
సుధాకర్ కి మనసులో కొంచెం భీతి కలిగింది. వెంకటరాజును ఎలా పేస్ చెయ్యాల్నా అని.
రాజుగారు ముందు పలకరించారు ఎలా ఉన్నారు సుధాకర్ గారు అని.
చాలా ఏళ్లయ్యింది.  నా పేరు ఇంకా గుర్తుందా మీకు అని ఆశ్చర్యంగా అడిగాడు సుధాకర్.
ఒక ఊరి వాళ్ళం. కలిసి మెలిసి తిరిగిన వాళ్ళం. ఎలా మర్చిపోతాం చెప్పండి. ఆ రోజు నేను మాధవి ని ప్రేమించినపుడు మీరందరూ  నాపైకొచ్చారు. అప్పటి ఆ ఆవేశంలో తప్పులేదు. తరువాత ఆ మనస్పర్ధలన్నీ సమసిపోయినాయి. మాధవితో నా పెళ్ళైన తరువాత అందరం కలిసిపోయాం. నేను భీమవరం వెళ్ళినప్పుడల్లా మన స్నేహితులందరిని కలుస్తుంటాను. మీరు ఉద్యోగరీత్యా అన్ని ఊర్లు తిరిగారు. మీరు వేరే ఊర్లలో ఉద్యోగం వలన మిమ్మల్ని కలుసుకోవడం జరుగలేదు అన్నాడు.
చాలా సంతోషమండీ. మా వాడు మీ సంగతులు అన్నీ చెప్పాడు. ఇప్పుడు ఎలా ఉంది మీ ఆరోగ్యం అని వాకబు చేసాడు సుధాకర్.
ఇప్పుడు ఫరవాలేదు. త్వరగానే కోలుకుంటున్నాను. మీ అబ్బాయి నీల్ కరెక్ట్ టైం లో నన్ను ఆదుకున్నాడు. నిన్న కూడా పెద్ద గండం నుంచి అలవోకగా తప్పించాడు. నేను నమ్మిన నా ఆఫీస్ వాళ్ళే నన్ను వెన్నుపోటు పొడిచారు. తన తెలివితో నీల్ వాళ్ళందరి గుట్టు బయటపెట్టాడు. లేకుంటే ఆ ఇబ్బంది ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది  ఈ రోజు మీ ముందు ఇలా ఉండే వాణ్ని కాదు అన్నాడు.
ఇంతలో విజిత అందరికి జూస్ తెచ్చి ఇచ్చింది.
మా అమ్మాయి డాక్టర్ విజిత అని పరిచయం చేశారు రాజుగారు.
తెలుసు తెలుసు. మీ అమ్మాయే నన్ను కంటి డాక్టర్ కి చూపించింది అన్నాడు సుధాకర్.
వినీల్ ఆఫీస్ ఫోన్ వస్తే బిజీ గా మాట్లాడుతున్నాడు కొంచెం దూరంలో.
మాధవి సుధ చక్కగా కలిసిపోయి పాత కబుర్లు నెమరువేసుకుంటున్నారు.
మీతో కొంచెం మాట్లాడాలి అన్నారు రాజు గారు.
చెప్పండి అన్నాడు సుధాకర్.
ఈ రోజు మంచి రోజు. ఇప్పుడు బాగుందంటే ఇప్పుడే మాట్లాడుతాను అన్నాడు.
అవును. మీరన్నట్లు ఈ రోజు దివ్యంగా ఉంది. ఇప్పుడు అమృత ఘడియలు కూడానూ అన్నాడు సుధాకర్.
మీకు సమ్మతమైతే మా అమ్మాయి విజితను మీ అబ్బాయి నీల్ కిచ్చి పెళ్ళిచేద్దామని నా ఆలోచన. 
ఫోన్ ముగించుకుని వచ్చి కూర్చున్నాడు వినీల్. రాజు గారి మాటలు విన్నాడు.
రా అమ్మా ఇలా కూర్చో అన్నారు రాజుగారు విజితని.
తండ్రి పక్కన కూర్చుంది విజిత.
వాళ్ళిద్దరికీ సమ్మతమైతే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్నాడు సుధాకర్ కొడుకు వైపు చూస్తూ.
నన్ను చేసుకోవడం నీకు ఇష్టమేనా విజిత అని అడిగాడు వినీల్ ఆమె కళ్ళలోకి చూస్తూ.
ముందు మీరు చెప్పండి అంది విజిత నన్ను చేసుకోవడం మీకు ఇష్టమేనా అంటూ.
నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అన్నాడు వినీల్.
మిమ్మల్ని చేసుకోవడం నాకూ ఇష్టమే అంది విజిత ఎరుపెక్కిన బుగ్గలతో.
అమ్మయ్య అనుకున్నారు పెద్దలు నలుగురూ.
కట్న కానుకలు అనబోయారు రాజుగారు.
ప్లీజ్ అలాంటివేమీ వద్దండి అన్నాడు సుధాకర్. మా పెద్దబ్బాయి, అమ్మాయి విషయంలో కూడా వాటి ప్రసక్తి లేదు అని ఖరాఖండిగా చెప్పాడు.
ఓహ్ చాలా మంచి పద్ధతి మీది అన్నారు రాజుగారు మెచ్చుకుంటూ.   మంచిరోజు చూసి తాంబూలాలు మార్చుకుందాం అన్నారు.  అదే రోజు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కూడా పెట్టుకుందాం అన్నారు. 
తప్పకుండా అన్నారు సుధాకర్, సుధ. 
పెద్దవాళ్ళు నలుగురూ భీమవరం కబుర్లలో పడిపోయారు.
విజిత వినీల్ ని తనతో రమ్మంది ఇల్లు చూపిస్తానని. 
గ్రౌండ్ పూర్తిగా పార్కింగ్. మొదటి అంతస్థు లో లివింగ్ రూమ్, కిచెన్, హాల్, రాజు గారి ఆఫీస్ రూమ్, రెండవ అంతస్థులో పెద్దవాళ్ళ బెడ్ రూమ్ తో పాటు గెస్ట్ బెడ్ రూమ్స్, మూడవ అంతస్థులో విజిత బెడ్ రూమ్, చిన్న సైజు మూవీ థియేటర్ ఉన్నాయి.
చాలా అందంగా నీట్ గా ఉంచుకుంది విజిత తన బెడ్ రూమ్ ని.
విజ్జీ చాలా బాగుంది నీ రూమ్ అన్నాడు మెచ్చుకుంటూ.
మన రూమ్ అంది సరిచేస్తూ.
ఓకే ఓకే అన్నాడు.
ఈ ఆల్బమ్ చూడండి అని వినీల్ చేతికిచ్చింది.
అందులో అన్నీ వినీల్ ఫోటోలు. స్కూల్ ఫోటోల నుంచి ఇప్పటివరకు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. నా గురించి ఇంత కలెక్షన్ ఎక్కడిది నీకు అని అడిగాడు.
మీరు ఎక్కడకు వెళితే అక్కడ నా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి నీ ఫొటోస్ తెప్పించుకునేదాన్ని.
ఓహ్ చాలా శ్రమపడ్డావు అన్నాడు నవ్వుతూ.
శ్రమ కాదు. ప్రేమ, ఆసక్తి. చెప్పానుగా నేను మీకు ఏకలవ్య శిష్యురాలినని. మరి గురువు గారికోసం ఆ మాత్రం కష్టపడకుంటే ఎలా చెప్పండి అంది. 
నువ్వొక వెర్రి మాలోకం. నీ తెలివితేటలతో మెడిసిన్ రాంక్ తెచ్చుకుని అది కూడా నా వల్లనే అంటావు అన్నాడు. 
ఎవరో ఒకరు రోల్ మోడల్ ఉంటె వాళ్ళను ఈజీ గా ఫాలో అవొచ్చు నీల్. నా రోల్ మోడల్ మీరు. మీ క్యారెక్టర్ స్ట్రాంగ్ కాబట్టి, మీరు చదువుల బిడ్డ కాబట్టి, నేను మిమ్మల్ని ఫాలో అయ్యాను కాబట్టి ఈ రోజు మీలా ఇంత  స్ట్రాంగ్ గా ఉన్నాను అంది నవ్వుతూ. 
వినీల్ చేతులు  రెండు జోడించాడు అమ్మా తల్లీ నువ్వే రైట్ అని  మెచ్చుకుంటూ.
ఇప్పుడు మీకు లెర్నింగ్ లైసెన్స్ వచ్చింది. తెలుసుగా అంది విజిత వినీల్ కి గుర్తు చేస్తూ.
ఓహ్ అవునవును. మర్చేపోయాను అంటూ విజిత మొహాన్ని తన చేతుల్లో తీసుకుని బుగ్గపై ముద్దుపెట్టాడు.
మరీ  పిసినారి బుజ్జి అంది.
ఆ మాటకు మళ్ళీ విజితను దగ్గరకు తీసుకుని ఈసారి గట్టిగా పెదవులపై ముద్దు పెట్టాడు.
నేను పిసినారిని కాను అన్నాడు వినీల్.
ఇప్పుడు ఒప్పుకుంటాను అంది విజిత నవ్వుతూ.
వాళ్ళ యజమానురాలిని పట్టుకునేప్పటికి వెనుకే వచ్చిన కుక్కలు విజిత కు ఏదో జరగబోతోందని భౌ మంటూ అరిచాయి. విజిత వాటిని సముదాయించింది. ఈయన మీ కొత్త యజమాని అంటూ వాటిని దగ్గరకు తీసుకుని వినీల్ ని చూపిస్తూ ఏదో  చెప్పింది. కుక్కలు ఏవి చెప్పినా బాగా అర్ధం చేసుకుంటాయి. విజిత చెప్పిన వెంటనే వినీల్ దగ్గరకొచ్చి నిలబడ్డాయి. వాటిని కాస్త ముద్దు చేసాడు వినీల్.
ఇద్దరూ డైనింగ్ హాల్ కి వచ్చారు. వంటావిడ అన్నీ రెడీ చేసింది. వీర్రాజు గారు ఆయన సతీమణి శ్యామల ను కూడా పిలిచినట్లున్నారు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర చేరున్నారు. మీ కోసమే వెయిటింగ్ అన్నారు వాళ్ళు. అందరూ చక్కటి విందు భోజనం చేశారు.
బోజనాలయిన తరువాత వినీల్ కి నాదొక పెద్ద రిక్వెస్ట్ అన్నారు వెంకటరాజు గారు.
ఏంటి అంకుల్ అని నీల్ అనబోతుంటే మామయ్యా అనొచ్చు అన్నారు వెంకటరాజు.
చెప్పండి మామయ్యా అన్నాడు వినీల్.
అమ్మాయేమో డాక్టర్. నువ్వేమో సాఫ్ట్వేర్ లో ఫుల్ బిజీ. ఇప్పుడున్న కొత్త పద్ధతులతో నేను ఒంటిగా బిజినెస్ నడపడం అనేది నాకు కత్తి మీద సాములా ఉంది నీల్. అందులోనూ గత రెండు వారాలుగా జరిగిన వాటిని చూస్తే ఇంతవరకు బిజినెస్ చేసిన నాకే కొంత భయం కూడా కలుగుతోంది. కుర్రాడైనా నీవు సునాయాసంగా ఆకళింపు చేసుకుని  చాలా సమర్ధవంతంగా అన్ని సమస్యలను సరిచేసావు. నీ తెలివితేటలు మన విజి ఇండస్ట్రీస్ కి ఎంతో అవసరం. ఈ పరిస్థుతులలో  నీకు అభ్యంతరం లేకపోతే మీ  పెళ్ళైన తరువాత నా బిజినెస్ బాధ్యత కూడా కొంత నీకు అప్పచెపుదామని నా ఆశ.  మరి నీ ఉద్దేశం అని నీల్ వైపు చూసారు రాజుగారు.
ఈ కొద్ది రోజులలో నేను కూడా గమనించాను మామయ్యా. మీరు ఒంటరిగా పడుతున్న శ్రమ నేను గమనించాను. నేను ఇప్పుడున్నఉద్యోగానికి రాజీనామా చేసి మీ బిజినెస్ చూసుకోవాలంటే కనీసం మూడు నెలలు పడుతుంది. ఇప్పుడు నా చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS