కోరికలు నెరవేరాలంటే.. సాయిబాబాకు ఇలా పూజ చేయండి!
కోరికలు నెరవేరాలంటే.. సాయిబాబాకు ఇలా పూజ చేయండి!
నేటికాలంలో దేవుడిని, గురువును ఆశ్రయించడంలో ప్రతి మనిషికి ఎంతో కొంత స్వార్థం తప్పకుండా ఉంటుంది. ఉద్యోగం రాలేదని, కుటుంబంలో కలహాలు ఉన్నాయని, వివాహం కాలేదని.. ఇలా చాలా సమస్యల కోసం దేవుడిని, గురువులను ఆశ్రయిస్తుంటాము. అలాగే.. దేవుడి అనుగ్రహం కోసం, గురువు అనుగ్రహం కోసం.. పూజలు , వ్రతాలు, వివిధ రకాల ఆరాధనలు కూడా చేస్తుంటాము. అయితే భారతదేశంలో చాలామందికి షిరిడి సాయిబాబా ఒక ఉన్నతమైన గురువు. ఆయనను పూజించడం వల్ల, ఆరాధించడం వల్ల జీవితంలో ఎన్నో ఇస్తాడు. ముఖ్యంగా కోరికలు నెరవేరాలని అనుకునే వారు సాయిబాబాను ఆరాధిస్తే.. అది తప్పక నెరవేరుతుందని అంటారు. కోరిలు నెరవేరడం కోసం సాయిబాబాను ఎలా పూజించాలి? తెలుసుకుంటే..
సాయిబాబా పూజ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం..
సాయిబాబా గొప్ప ఆధ్యాత్మిక వేత్త. వివిధ మతాలు, నేపథ్యాలకు చెందిన భక్తులందరూ సాయిబాబాను పూజిస్తారు. సాయిబాబా బోధనలలో ప్రేమ, కరుణ, ఇతరులకు సేవ చేయడం వంటి విషయాలు నిండి ఉంటాయి. కోరికల కోసం సాయిబాబా పూజ చేయడం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ పూజ కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, సాయిబాబా దివ్యశక్తితో అనుసంధానం అయ్యే ఒక మార్గం. భక్తిశ్రద్ధలతో పూజ చేయడం ద్వారా పవిత్రమైన వాతావరణం ఏర్పడుతుంది, అక్కడ తమ కోరికలను, సంకల్పాలను సాయిబాబాకు సమర్పించుకోవచ్చు
పూజ సమయంలో, భక్తులు సాయిబాబా మంత్రాలను జపిస్తారు. ఈ మంత్రాలకు అపారమైన శక్తి ఉంది, ఈ మంత్రాలే భక్తుడిని సాయిబాబాకు మరింత దగ్గర చేస్తాయని నమ్ముతారు. ఈ మంత్ర జపం వల్ల ఏర్పడే ప్రకంపనలు మనలో ప్రతిధ్వనించి, జీవితాలలో సానుకూల మార్పులను తీసుకువస్తాయి. సాయిబాబాకు పండ్లు, తీపి పదార్థాలు, పాల పదార్థాలతో చేసిన స్వీట్లు వంటివి నైవేద్యంగా పెడతారు.
కోరికలు తీరాలంటే.. ఇలా పూజించాలి..
పూజ చేయబోయే స్థలాన్ని శుభ్రపరచాలి. ఏ పూజకైనా శుభ్రత చాలా ముఖ్యం.
సాయిబాబా చిత్రం లేదా విగ్రహం, పువ్వులు, అగరబత్తులు, దీపం, పండ్లు, మిఠాయిలు, నీరు, తయారు చేసుకున్న నైవేద్యం.. అన్నీ సిద్దం చేసుకోవాలి.
అగరుబత్తితో దీపం వెలిగిస్తూ.. ఓం సాయిరాం అని జపించాలి. తరువాత అదే మంత్రాన్ని కొనసాగించవచ్చు. లేదంటే సాయిబాబా ఇతర మంత్రాలను అయినా జపించవచ్చు.
పాదాల వద్ద పువ్వులు ఉంచండి లేదా నేరుగా ఆయన చిత్రం లేదా విగ్రహంపై పువ్వులను అలంకరించాలి. .
పండ్లు, తీపి పదార్థాలు, ఇంట్లో తయారు చేసిన పదార్థాలు ఏవైనా సరే.. నైవేద్యంగా సమర్పించాలి.
పైవన్నీ చేసిన తర్వాత సాయిబాబా చిత్రం ముందు చేతులు జోడించి నిశ్శబ్దంగా కూర్చోవాలి. కళ్ళు మూసుకుని, ఆయన ఆశీర్వాదాలను కోరుతూ.. కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి.
సాయిబాబా పూజలో విశ్వాసం, భక్తి ముఖ్యం..
విశ్వాసం కలిగి ఉండటం అంటే సాయిబాబా ఆశీర్వాదాలను నమ్మడం, ఆయన మన కోరికలను నెరవేరుస్తారనే నమ్మకం కలిగి ఉండాలి. మనకు ఏది మంచిదో ఆయనకే తెలుసని నమ్మాలి. ఆయన ఆశీర్వాదం లభించాలి అంటే.. ఆయన ముందు శరణాగతి చెందడం చాలా అవసరం.
మరోవైపు.. భక్తి అంటే సాయిబాబాకు ప్రతి ఒక్కరూ తమను తాము సంపూర్ణ హృదయంతో అంకితం చేసుకోవడం. అంటే జీవితంలోని అన్ని విషయాలలో ఆయన పట్ల ప్రేమ, గౌరవం , కృతజ్ఞతను చూపించడం. భక్తి భావాన్ని పెంపొందించుకోవడం ద్వారా, సాయిబాబాతో గాఢంగా అనుసంధానం కావడానికి మనసులో ప్రశాంతతను, సృష్టించుకోవాలి. సాయిబాబా పూజలో చేసే ప్రతి పనిని ఎంతో భక్తితో చేస్తే ఆ సాయి తప్పక అనుగ్రహిస్తాడు.
సాయిబాబా మంత్రాలు..
సాయిబాబాను పూజించడంతో పాటు.. మంత్ర జపం, పారాయణ వంటివి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఎందుకంటే ప్రతి మంత్రం అద్భుతమైనది , శక్తివంతమైనది, భగవంతునికి దగ్గర చేసే శక్తిని కలిగి ఉంటుంది. ఆనందం, సంతోషం, ఆరోగ్యం , సంపద వంటి కోరికలను నెరవేర్చుకోవడానికి సాయి మంత్రాలను క్రమం తప్పకుండా జపించాలి.
ఓం సాయిరాం,
ఓం దేవాయ నమః,
సాయి గురువాయ నమః,
ఓం సాయి దేవాయ నమః,
సాయి రామకృష్ణ హరి.. ఇలా చాలా మంత్రాలు సాయిబాబా పూజ సమయంలో జపించడానికి ఉత్తమమైన మంత్రాలు. వీటిని మంత్ర జపం చేయడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది.
సాయి బాబా ప్రార్థన, కానుకల సమర్పణ..
సాయిబాబా పూజ సమయంలో సర్వసాధారణంగా పువ్వులు ఎక్కువ సమర్పిస్తారు. పువ్వులు స్వచ్ఛత, సౌందర్యం , భక్తికి ప్రతీకలు. ఆయన పాదాల వద్ద తాజా పువ్వులను సమర్పించడం ద్వారా గానీ, ఆయన చిత్రం లేదా విగ్రహంపై ఉంచడం ద్వారా గానీ మనం ఆయన పట్ల మన ప్రేమను, గౌరవాన్ని వ్యక్తం చేసినట్టు అవుతుంది. దీంతో పాటు పండ్లు నైవేద్యంగా పెట్టడం కూడా చాలా మంచిది. పండ్లు సహజమైనవి, ఆరోగ్యాన్ని చేకూర్చేవి.
సాయిబాబాకు పండ్లు సమర్పించడం ద్వారా, శారీరక ఆరోగ్యం , శ్రేయస్సు లభిస్తాయట. పూజ సమయంలో అగరబత్తులు వెలిగించడం.. అగరబత్తుల సువాసన ప్రతికూల శక్తి శుద్దీకరణకు ప్రతీకగా నిలుస్తూ, శాంతి , సామరస్య వాతావరణాన్ని సృష్టిస్తుంది. కొబ్బరికాయను కొట్టడం అహం నుండి విముక్తి పొంది, దేవుని వినియంగా ఉండటాన్ని సూచిస్తుంది.
ఆహార వితరణ..
సాయిబాబా పూజ చేసుకున్నప్పుడు ఆహార వితరణకు చాలా ప్రాముఖ్యత. పూజ తర్వాత కనీసం ఒక పేద వ్యక్తికి లేదా.. కుక్కలకు ఆహారం పెట్టడం చాలా మంచిది. ఇది మనిషిలో కర్మను తీసివేయడం ద్వారా కోరికలు నెరవేరడంలో సహాయపడుతుంది.
*రూపశ్రీ.