మంగళవారం రోజు జరిగే అద్బుతం.. ఈ నియమాలు పాటిస్తూ బజరంగ్ బాణ్ చదవి చూడండి!

 

మంగళవారం రోజు జరిగే అద్బుతం.. ఈ నియమాలు పాటిస్తూ బజరంగ్ బాణ్ చదవి చూడండి!

జ్యేష్ఠ మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు.  పురుషోత్తమ మాసంలోని ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజించడానికి చాలా ప్రత్యేకమైన రోజు. మంగళవారం రోజు  సాధారణంగా హనుమాన్ చాలీసా, సుందరకాండ పఠిస్తారు. అయితే బజరంగ్ బాణ్ చాలా తక్కువ మంది పఠిస్తుంటారు.  బజరంగ్ బాణ్‌లోని ప్రతి చతుష్పది ఒక మంత్రం లాంటిది,  దాని ప్రభావం మంత్రం వలె శక్తివంతమైనది. హిందూ నమ్మకాల ప్రకారం మంగళవారాల్లో సరైన నియమాలతో  బజరంగ్ బాణ్ పఠిస్తే అన్ని రకాల సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయని చెబుతారు. అయితే నిర్దేశించిన పద్ధతి ప్రకారం పఠిస్తేనే బజరంగ్ బాణ్ ఫలితాన్ని ఇస్తుంది. నియమాలు ఆచరించకుండా పఠిస్తే.. అది దుష్ప్రభావాలు కూడా కలిగిస్తుందని నమ్ముతారు.  బజరంగ్ బాణ్‌లోని చతుష్పదులు మంత్రాలంత శక్తివంతమైనవి  బజరంగ్ బాణ్ ఎలా పఠించాలి?  పఠించడానికి తీసుకోవలసిన నియమాలు ఏంటి?  తెలుసుకుంటే..

బజరంగ్ బాణ్ పఠన నియమాలు..

పఠనం..
 
 బజరంగ్ బాణ్ పఠించడం ప్రారంభించిన తర్వాత, దానిని అసంపూర్తిగా వదిలివేయకూడదు. ఎందుకంటే, హనుమంతుని ఆశీర్వాదాలు పొందడానికి అసంపూర్తి పఠనం అశుభంగా పరిగణించబడుతుంది.

హనుమాన్ చాలీసా..

 బజరంగ్ బాణ్ పఠించిన తరువాత హనుమాన్ చాలీసా కూడా పఠించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అలా చేయడం వల్ల పఠనం  పూర్తి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా హనుమంతుడు  సంతోషించి  కోరికలను తీరుస్తాడని నమ్ముతారు.

వస్త్రధారణ..

 మంగళవారం నాడు బజరంగ్ బాణ్ పఠించే ముందు  వస్త్రధారణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. హనుమంతునికి సంబంధించిన ఏ పూజలలో అయినా ఎరుపు రంగు దుస్తులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందువల్ల బజరంగ్ బాణ్ పఠించేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి.

సాత్వికత..

బజరంగ్‌బాన్ పఠించేవారు సాత్విక ఆహారం ,మంచి ఆలోచనలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. బజరంగ్‌బాన్ పఠించేవారు మాంసాహారం, మద్యం, అలాగే తామసిక పదార్థాలను సేవించకూడదు. అలా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

సమయం..

 హనుమంతుని  భక్తులు బజరంగ్ బాణ్ పారాయణం చేసే సమయం , శుభ ముహూర్తంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బ్రహ్మముహూర్తంలో బజరంగ్ బాణ్ పారాయణం చేయడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. అలా కుదరని పక్షంలో, దీనిని సాయంత్రం కూడా పారాయణం చేయవచ్చు.

ఎప్పుడు ప్రారంభించడం మంచిది?

శాస్త్రాల ప్రకారం బజరంగ్ బాణ్ పారాయణాన్ని ఏ మంగళవారం నుంచైనా ప్రారంభించవచ్చు. ప్రస్తుతం జ్యేష్ఠ మాసం నడుస్తున్నందున, ఈ మాసంలోని ఏ మంగళవారం నుంచైనా దీనిని ప్రారంభించవచ్చు. హనుమంతుడిని పూజించడానికి జ్యేష్ఠ మాసం అత్యంత పవిత్రమైనదిగా , ప్రయోజనకరమైనదిగా పరిగణించబడుతుంది.

                                       *రూపశ్రీ.