మహాభారత యుద్దంలో శ్రీకృష్ణుడి నారాయణీ సైన్యం గురించి ఈ నిజాలు తెలుసా!
మహాభారత యుద్దంలో శ్రీకృష్ణుడి నారాయణీ సైన్యం గురించి ఈ నిజాలు తెలుసా!
మహాభారత యుద్దం కౌరవులకు, పాండవులకు మధ్య జరిగిందనే విషయం తెలిసిందే.. కౌరవులకు, పాండవులకు మధ్య యుద్ధం జరగాలని నిర్ణయించినప్పుడు, ఇరు పక్షాలు తమ సైన్యాలను బలోపేతం చేసుకోవడం ప్రారంభించాయి. యుద్ధంలో పాల్గొనవలసిందిగా వారు తమ మిత్ర రాజులకు ఆహ్వానాలు పంపారు. కౌరవులు, పాండవులు ఇద్దరూ సహాయం కోసం శ్రీకృష్ణుడిని ఆశ్రయించారు. తమకు మద్దతుగా యుద్దంలో పాల్గొనమని శ్రీకృష్ణుడిని అడిగేందుకు అర్జునుడు, దుర్యోధనుడు ద్వారకకు చేరుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు నిద్రపోతున్నాడు. శ్రీకృష్ణుడికి సంబంధించినదే నారాయణి సైన్యం.. శ్రీకృష్ణుడు పాండవులకు మద్దతు ఇచ్చినా.. శ్రీకృష్ణుడి నారాయణీ సైన్యం కౌరవుల పక్షాన నిలిచింది. దీని గురించి చాలా మందికి తెలియదు. వివరంగా తెలుసుకుంటే..
యుద్దంలో తమ పక్షాన పాల్గొనమని అడిగేందుకు అర్జునుడు, దుర్యోధనుడు ఇద్దరూ శ్రీకృష్ణుని గదికి వెళ్లారు. అక్కడ శ్రీకృష్ణుడు నిద్రపోతూ ఉన్నాడు. శ్రీకృష్ణుడు లేవగానే అడగడం కోసమని శ్రీకృష్ణుడి దగ్గరే కూర్చోవడానికి సిద్దపడ్డారు ఇద్దరూ. అయితే గోపాలుని పాదాల వద్ద తాను ఎందుకు కూర్చోవాలా అని దుర్యోధనుడికి అహంభావం కలిగింది. అలా అనుకుని, అతను కృష్ణుని తల వద్ద కూర్చుని, ఆయన మేల్కొనే వరకు వేచి ఉన్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుని పాదాల వద్ద కూర్చున్నాడు.
శ్రీకృష్ణుడు, సైన్యం..
శ్రీకృష్ణుడు మేల్కొన్నప్పుడు, దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరూ యుద్దంలో తమ పక్షాన యుద్దం చేయమని శ్రీకృష్ణుడిని అడిగారు. అందుకు శ్రీకృష్ణుడు, "నేను యుద్ధంలో ఆయుధాలు చేపట్టను" అని బదులిచ్చాడు. అప్పుడు దుర్యోధనుడు శ్రీకృషఅణుడి నారాయణీ సైన్యాన్ని పిలిపించాడు. అర్జునుడు మాత్రం శ్రీకృష్ణుని మద్దతు కోరాడు. అందరి మనసులూ తెలిసిన శ్రీకృష్ణుడు దుర్యోధనునితో, "సరే, నా నారాయణీ సైన్యం కౌరవుల పక్షాన పోరాడుతుంది, నేను మాత్రం పాండవుల పక్షాన ఉంటాను, కానీ నేను ఆయుధాలు చేపట్టను" అని చెప్పాడు.
నారాయణీ సైన్యం..
శ్రీకృష్ణుని నారాయణి సైన్యం అజేయమైనది ఏ యుద్ధంలోనూ ఓడిపోలేదు. అందువల్ల దుర్యోధనుడు శ్రీకృష్ణుడి మద్దతు తమకు లేకపోయినా సరే.. శక్తివంతమైన నారాయణీ సైన్యాన్ని తనకు ఇవ్వమని కోరాడు., కానీ చివరకు ధుర్యోదనుడు యుద్ధంలో ఓడిపోయి మరణించాడు.
నారాయణీ సైన్యం గురించి నిజాలు..
మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడిన దుర్యోధనుడికి శ్రీకృష్ణుడు ఒక అక్షౌహిణి సైన్యాన్ని ఇచ్చాడు. మహాభారతం ప్రకారం, ఒక అక్షౌహిణి సైన్యంలో 21,870 ఏనుగులు, 21,970 రథాలు, 65,610 గుర్రాలు మరియు 10,9350 పదాతిదళం ఉన్నాయి. అంటే ఆ సైన్యంలో మొత్తం 21,8700 మంది యోధులు ఉన్నారని అర్థం.
శ్రీకృష్ణుని నారాయణీ సైన్యం సాధారణమైనది కాదు. ఈ సైన్యంలోని ప్రతి సైనికుడికి శ్రీకృష్ణుడే స్వయంగా యుద్ధ విద్య, దౌత్యం , మాయా ఆయుధాల వాడకంలో శిక్షణ ఇచ్చాడు.
ఈ సైన్యంలో శ్రీకృష్ణుని 18 వేల మందికి పైగా సొంత సోదరులు, తనకు సోదరుల వరుస అయ్యేవారు ఉండేవారు, వారు చాలా ధైర్యవంతులు.
ఒక అక్షౌహిణి సైన్యాన్ని పొందిన తరువాత మహాభారత యుద్ధం కోసం కురుక్షేత్ర మైదానంలో కౌరవులకు 11 అక్షౌహిణి సైన్యం , పాండవులకు 7 అక్షౌహిణి సైన్యం ఏర్పాటైంది.
బలరాముడు శ్రీకృష్ణుని నారాయణి సైన్యానికి ప్రధాన సేనాపతి అయినప్పటికీ, ఆయన ఈ యుద్ధానికి దూరంగా ఉన్నాడు, అందువల్ల కృతవర్మ నాయకత్వంలోని ఒకే ఒక అక్షౌహిణి సైన్యం మహాభారత యుద్ధంలో పాల్గొంది.
శ్రీకృష్ణుని సైన్యంలో పది లక్షలకు పైగా పరాక్రమవంతులైన యోధులు ఉండేవారు. ప్రతి యోధుడు ఎంత శక్తిమంతుడంటే, అతను ఒంటరిగా వేలాది మందితో పోరాడగలడు.
మహాభారత యుద్ధం ముగిసినప్పుడు, కౌరవుల పక్షాన పోరాడిన నారాయణి సైన్యం మొత్తం ఒక్క అక్షౌహిణితో సహా, ఇంకా సజీవంగానే ఉంది. దుర్యోధనుడు మరణించడంతో యుద్ధం ముగిసింది.
*రూపశ్రీ.